టీడీపీ అధినేత చంద్రబాబుకు రానున్న ఎన్నికలు పెద్ద తలనొప్పిని తెచ్చిపెట్టక మానవు. 2024 ఎన్నికల్లో పొత్తులతోనే చంద్రబాబు పోటీకి దిగాలని డిసైడ్ అయిపోయారు. బీజేపీ తో పొత్తు ఇంకా ఖరారు కాకపోయినా జనసేన తో మాత్రం ఆయన పొత్తు పెట్టుకోవడం గ్యారంటీ. ఇప్పటికే రెండు పార్టీల క్యాడర్ కలిసిపోయిందనే అనుకోవాలి. నేతలు కూడా కలసి వైసీపీ ప్రభుత్వం పై పోరాటం చేస్తున్నారు. జగన్ సర్కార్ కు వ్యతిరేకంగా ఇప్పటికే టీడీపీ, జనసేన రోడ్ మీదకు వచ్చేసాయి.
గత ఎన్నికల్లో…
అయితే గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన టీడీపీ 175 నియోజకవర్గాల్లో నేతలను బరిలోకి దించింది. గత ఎన్నికల్లో టీడీపీ తరుపున పోటీ చేసి ఓటమిపాలైన నేతలు తాము పెట్టిన ఖర్చు తో అప్పుల పాలయ్యారు. కొందరు అందుకే దాదాపు మూడేళ్లపాటు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. చివరకు చంద్రబాబు వార్నింగ్ తో కొందరు బయటకు వచ్చారు. డబ్బులకు డబ్బులు పోయి.. అధికార వైసీపీ కేసులతో చాలామంది పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉన్నారు.
పట్టు నిలుపుకునేటందుకు…
వీరిలో ఎక్కువమంది వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమైపోయారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతతో ఈసారి తమ గెలుపు ఖాయమని భావిస్తున్నారు. అందుకే రెండేళ్ల నుంచి పార్టీ కోసం ఖర్చు చేసారు. చంద్రబాబు పర్యటనలతో పటు ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమానికి, నారా లోకేష్ పాదయాత్రకు తమ డబ్బులు వెచ్చించారు. అయితే పొత్తులు ఉంటాయని తేలిపోవడంతో కొందరు నేతలు ఇప్పటినుంచే బెంగ పెట్టునకున్నారు. పొత్తులో భాగంగా తమకు ఈసారి సీటు వస్తుందో? లేదో? అన్న దిగులు పట్టుకుంది.
ఈ జిల్లాల్లో మాత్రం దడ…
జనసేనకు ఎలా లేదన్నా 30కి పైగానే అసెంబ్లీ స్థానాలు ఇవ్వాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈస్ట్, వెస్ట్ జిల్ల్లాల్లో జనసేన ఎక్కువ స్థానాలు కోరనుంది. పవన్ వారాహి యాత్ర కూడా ఈ జిల్లాల్లోనే తొలుత ప్రారంభించిన సంగతి అందరికి తెలిసిందే. రెండు జిల్లాల్లో 34 స్థానాల్లో వైసీపీని గెలవనివ్వనని కూడా జనసేనాని శపధం చేసారు. ఈ పరిణామాలతో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన తెలుగు తమ్ముళ్లలో ఆందోళన మొదలయ్యింది. 34 స్థానాలలో కనీసం 15కు పైగా స్థానాలను జనసేన కోరే అవకాశముందన్న అంచనాల నేపథ్యంలో టీడీపీ నేతలు యువనేత నారా లోకేష్ ను మంచి చేసుకునే ప్రయత్నంలో పడ్డారు. అయితే టికెట్ దక్కని నేతలు రెబెల్ గా బరిలోకి దిగిన.. ప్రత్యర్థితో చేతులు కలిపినా టీడీపీకి ఇబ్బంది తప్పదని పార్టీ అధినేత చంద్రబాబులో కొంత కలవరం ఉన్న మాట అయితే నిజం. ఈ ప్రమాదం నుంచి బాబు ఎలా బయట పడతారన్నది ఆసక్తిదాయకమే.
Follow Us On : YouTube , Google News