హైదరాబాద్ లో కాల్పుల కలకలం రేగింది. శమీర్ పేటలోని ఒక క్లబ్ లో ఈ కాల్పులు జరిగాయి. భార్య వివాహేతర సంబంధం గురించి ప్రశ్నించినందుకు ఈ కాల్పులు జరిగినట్లు తెలిసింది. పోలీసుల కథనం ప్రకారం సిద్ధార్ధ దాస్ అనే వ్యక్తి తన భార్యతో కలసి సీరియల్ నటుడు మనోజ్ సెలబ్రిటీ క్లబ్ కు వెళ్లాడు. తన భార్య ప్రియుడితో కలసి క్లబ్ కు వెళ్లిందని తెలుసుకున్న సిద్ధార్థ్ దాస్ అక్కడకు వెళ్లారు. ఇద్దరినీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని ప్రశ్నించారు. నిలదీశాడు.
ప్రశ్నించినందుకు…
దీంతో సిధ్దార్థదాస్, మనోజ్ మధ్మ వాగ్వాదం చెలరేగింది. ఇద్దరు ఘర్సణ పడే పరిస్థతికి వచ్చారు. దీంతో సినీ నటుడు మనోజ్ తన వద్ద ఉన్న ఎయిర్ గన్ తో సిద్ధార్ధ్ దాస్ పై కాల్పులు జరిపాడు. అయితే ఈ కాల్పుల నుంచి సిద్ధార్థ్ దాస్ తప్పించుకుని శామీర్ పేట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో సంఘటన స్థలికి చేరుకున్న పోలీసులు అక్కడ ప్రత్యక్ష సాక్షులను విచారించిన అనంతరం మనోజ్ పై కేసు నమోదు చేశారు. వివాహేతర సంబంధమే కాల్పులకు కారణమని పోలీసులు గుర్తించి ఆ దిశగా దర్యప్తు చేస్తున్నారు. మనోజ్ కార్తీకదీపం, మౌనపోరాటం వంటి సీరియళ్లలో నటిస్తున్నాడు.