₹2000
పెద్ద నోట్ల రద్దులో భాగంగా కేంద్రం రెండు వేల నోటును రద్దు చేసిన సంగతి తెలిసిందే.అయితే ఇప్పటికే అనేక మంది దగ్గర చెలామణీలో ఉన్న ఆనోటును దశల వారీగా ఉపసంహరించిన కేంద్రం వినియోగ దారులు తమ దగ్గరున్న నోట్లను మార్చుకోడానికి ఈనెల 30 వరకూ గడువు పెట్టింది. 2023 సెప్టెంబర్ 30 తర్వాత రెండువేల నోటు చెలామణీలో ఉండదు. కాబట్టి తమ దగ్గర ఇంకా ఏవైనా రెండు వేల నోట్లు మిగిలి ఉంటే వినియోగ దారులు బ్యాంకులకు వెళ్లి వాటిని మార్చుకోవడం , లేదా బ్యాంకుకు సరెండర్ చేసి ఛేంజ్ తీసుకోవడం మంచిది. రెండు వేల నోటును మార్చుకోడం అనేది ఈనెల మే 23న మొదలైంది. వినియోగ దారులు తమ దగ్గరున్న రెండు వేల నోట్లను మార్చుకోడానికి ఇది చివరి అవకాశం. కాబట్టి ఇంకా బీరువాల్లోనూ, అటకలపైనా, స్ట్రాంగ్ రూముల్లోనూ రెండు వేల నోట్లు మిగిలి ఉంటే తక్షణం వాటిని మార్చుకోవడం మంచిది.
ఎలా మార్చుకోవాలి? ₹2000
పెద్ద నోట్ల రద్దులో భాగంగా కేంద్రం రెండు వేల నోటును రద్దు చేసిన సంగతి తెలిసిందే.అయితే ఇప్పటికే అనేక మంది దగ్గర చెలామణీలో ఉన్న ఆనోటును దశల వారీగా
రెండువేల నోట్లను కలిగిన వారు వారి వారి బ్యాంకుల్లో వీటిని మార్చేసు కోవచ్చునని ఆర్బీఐ ప్రకటించింది. అయితే వీరికి కేవైసీ, ఇతర లీగల్ డిపాజిట్ నిబంధనలు వర్తిస్తాయని తెలిపింది.
కనీస సేవింగ్స్ బ్యాంకు డిపాజిట్ కలిగిన వారు, లేదా జన్ థన్ ఖాతాలు కలిగిన వారికి ఇప్పటికే అమల్లో ఉన్న డిపాజిట్ పరిమితులు వర్తిస్తాయి. అంటే ఈఖాతాల్లో నిబంధనలకు మించి ఎక్కువ సంఖ్యలో రెండు వేల నోట్లను డిపాజిట్ చేయాలనుకుంటే రెగ్యులర్ డిపాజిట్ పరిమితులు వర్తిస్తాయి.
అంతే కాదు.. రెండు వేల నోట్లు కలిగిన వారు ఈనెలాఖరు లోగా ఆర్బీఐకి చెందిన 19 ప్రాంతీయ కార్యాలయాల్లో కూడా మార్చుకోవచ్చు. ఏ బ్యాంకులోనైనా ఈనోట్లను సరెండర్ చేసి బదులుగా ఎక్స్జేంజ్ నోట్లను తీసుకోవచ్చు.రెండువేల నోట్లు ఆర్బీఐ ముద్రించిన నోట్లే కాబట్టి వీటిని మార్చుకోడానికి ప్రత్యేకమైన స్లిప్ లేదా ఐడీ ప్రూఫ్ కానీ అవసరం లేదని ఆర్బీఐ గైడ్ లైన్స్ నిర్దేశిస్తున్నాయి. అయితే కొన్ని పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు రకరకాల పద్ధతులని అనుసరించాయి. కాబట్టి ఈ కరెన్సీ మార్పులో ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే ఐడీ ప్రూఫ్ తో వెళితేనే బెటర్ అని అధికారులు సూచిస్తున్నారు.
ఈ వారంలో బ్యాంకు శెలవులు
– బ్యాంకులు ఇవాల్టినుంచి బుధవారం వరకూ తెరిచే ఉంటాయి. ( సెప్టెంబర్ 25నంచి సెప్టెంబర్ 27 వరకూ)
– గురువారం సెప్టెంబర్ 28 మిలాదు నబీ పండుగ కావడంతో బ్యాంకులకు హాలీడే.
– శని ఆదివారాలు నార్మల్ గా వర్కింగ్ అవర్స్ లోనే బ్యాంకులు పనిచేస్తాయి.
దీన్ని బట్టి చెప్పొచ్చేదేంటంటే రెండు వేల నోట్ల మార్పిడికి ఈ నెలాఖరు వరకే గడువు ఉంది. ఆ నోట్లను ఇవాల్టి నించి ( సోమవారం) 27 వరకూ, మళ్లీ ఈనెల 29,30 తేదీల్లోనూ మార్చుకోవచ్చు…
పెద్ద నోట్ల రద్దు తో నల్లధనం వెలికితీస్తామని మోడీ సర్కార్ ఎన్నికల వాగ్దానంగా ప్రకటించింది. అయితే ఈ లక్ష్యం పూర్తిగా నెరవేరలేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.