Raviteja
మాస్ యాక్షన్ కి పెట్టింది పేరు రవితేజ. అందుకు గాను మాస్ మహరాజ్ రవితేజ అనే ట్యాగ్ ను సొంతం చేసుకున్నాడు. క్యారెక్టర్ అర్టిస్ట్ గా సిని ఇండస్ట్రీకి పరిచయం అయ్యి స్టార్ హీరోగా హవా నడిపిస్తున్నాడు. ఇటివలే ధమకా సినిమాతో సూపర్ హిట్ ను అందుకున్నాడు…. ఇక ఇప్పుడు దసరా బరిలో టైగర్ నాగేశ్వరరావు సినిమాతో మన ముందుకు రానున్నాడు. రవితేజ కెరీర్ లో తొలి పాన్ ఇండియా మూవీ ఇదే. ఈ సినిమా కోసం మాస్ మహరాజా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచుస్తున్నారు. టైగర్ నాగేశ్వర రావు మూవీ డీటైల్స్ ఆ సినిమాకి భారీ హైప్ తీసుకొస్తున్నాయి.
అక్టోబర్ 20న తెలుగు, తమళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లోనే కాకుండా మరో లాంగ్వేజ్ లో కూడా రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారట. ఆ భాషను ఇప్పటి వరకు తెలుగు ఇండస్ట్రీలో ఏ దర్శక-నిర్మాత రిలీజ్ చేయలేదట. ఇంతకి ఆ భాష ఏమిటి? అది ఏదో కాదు సైన్ లాంగ్వేజ్. ఆ భాషలో ఈ సినిమా రిలీజ్ అయితే ఎలా ఉండబోతుందని అందరూ ఉత్కఠంగా ఎదురుచుస్తున్నారు. టైగర్ నాగేశ్వరావు టీమ్ ది గ్రేట్ అని కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.
మూవీ స్టోరీ
టైగర్ నాగేశ్వరరావు సినిమా పిరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనుంది. స్టువర్టుపురం గజదొంగ అయిన టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రానుంది. గజదొంగ రోల్ లో రవితేజ ఈ సినిమాలో నటించనున్నాడు. ట్రైలర్ చూసిన ప్రేక్షకులు రవితేజ నటన గూస్ బంప్స్ తెప్పించేలా ఉందంటున్నారు..దసరాను టార్గెట్ చేస్తూ ఈ సినిమా అక్టోబర్ 20న థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఇప్పటి వరకు ఈ సినిమాకు విడుదలకు ముందే బిజినెస్ కలక్షన్స్ 33 కోట్లు వచ్చాయి.
హైకోర్టు లో కేసు
ఈ సినిమాకు సంబంధించి హైకోర్టు లో కేసు వేశారు. రిలీజ్ అయిన టీజర్ లోని భాష ఎరుకల సామాజిక వర్గం వారిని, వారి భాషను కించపరిచేలాగా ఉందని ఆ వర్గం వాళ్లు చిత్ర బృందంపై ఏపీ హైకోర్టు లో కేసు నమోదు చేశారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్ సీ) అనుమతి లేకుండా టీజర్ విడుదల చేయడం పై అభ్యంతరం తెలిపింది. సెన్సార్స్ అనుమతి లేకుండా ఎలా విడుదల చేస్తారని ప్రశ్నంచింది హైకోర్టు. ఈ మేరకు అభిషేక్ అగర్వాల్ కు నోటీసులు జారీ చేసింది.
మూవీలో నటించిన ప్రముఖులు Raviteja
టైగర్ నాగేశ్వరరావు సినిమాలో రవితేజకి జంటగా నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకి నూతన వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. రేణు దేశాయ్ ఒక కీలక పాత్రలో నటిస్తోంది. 2003లో జానీ సినిమాలో నటించిన రేణూ దేశాయ్ తాజాగా ఈ సినిమాతో రీఏంట్రీ ఇస్తోంది. మురళీ శర్మ పొలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ రవితేజ ఫ్యాన్స్ ని బాగా ఆకట్టుకున్నాయి. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై విడుదలవుతున్న ఈ సినిమాపై ప్రేక్షకులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. Raviteja