S
సినిమా ఇండస్ట్రీలోకి కొత్త తరం వచ్చేస్తోందా? మూవీ ఇండస్ట్రీలో అదృష్టం పరీక్షించుకోడానికి సెలబ్రిటీల వారసులు క్యూ కడుతున్నారు. అటు వెండితెర, బుల్లితెరలో రాణిస్తూ అందరిని మెప్పిస్తున్నారు సుమ కనకాల, సింగర్ సునీత. ఇద్దరూ వారి వారి రంగాల్లో ఎవరికీ తీసిపోరు.. వీళ్లిద్దరిదీ ఒక సెపరేట్ స్టైల్ . వీరి టాలెంట్ తో వీళ్ల ఫ్యామిలీకి కూడా క్రేజ్ పెరిగింది. బుల్లితెర పై సుమ, సింగర్ గా సునీత ఇద్దరూ ఇద్దరే.. సునీత పాడటం తగ్గించారేమోగానీ, సుమ మాత్రం ఇంకా తన యాంకరింగ్ తో నెంబర్ వన్ స్థానంలోనే ఉంది. తమ ప్రొఫెషన్లలో లక్షలాది మంది ప్రేక్షకులను సంపాదించుకున్న వీళ్లు ఇప్పుడు ఆ క్రేజ్ ను పెట్టుబడిగా పెడుతున్నారు.
తమ తమ వారసులను సినిమాల్లోకి తీసుకొస్తున్నారు. సుమ-రాజీవ్ కనకాల ల కొడుకు రోషన్ బబుల్ గమ్ అనే సినిమాతో హీరోగా ప్రేక్షకుల ముందుకి రానున్నాడు. రాజీవ్ కనకాల ఫ్యామిలీ బేసిగ్గా యాక్టింగ్ ప్రొఫెషన్ లోనే ఉంది . రోషన్ తాతయ్య దేవదాస్ కనకాల, బామ్మ, నాన్నరాజీవ్, ఇప్పుడు అమ్మ సుమ అందరూ నటనలో అనుభవం ఉన్నవారే. ఈ బ్యాక్ గ్రౌండే తమకు కలిసొచ్చి రోషన్ హీరోగా నిలబడతాడేమోనని ఆశతో అడుగులేస్తోంది సుమ.
రోషన్ ని అదృష్టం వరిస్తుందా?
బబుల్ గమ్ సినిమాతో మన ముందుకు వస్తున్నాడు రోషన్. హీరోగా తన అదృష్టాన్ని పరిక్షించుకోబోతున్నాడు . రవికాంత్ పేరుపు ఈ మూవీకి డైరక్టర్ గా పరిచయం కానున్నాడు. హీరోయిన్ గా చెరుకూరి మానస చౌదరి నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను దర్శకధీరుడు రాజమౌళి రిలీజ్ చేశాడు. ఈ సందర్భంగా మూవీ యూనిట్ కు శుభాకాంక్షలు తెలియజేశాడు రాజమౌళి. ఫస్ట్ లుక్ లో ఇద్దరు రెడ్, బ్లాక్ కలర్ కాస్టూమ్స్ లో మెరుస్తూ, బబుల్ గమ్ తో రొమాంటిక్ లుక్ లో ఉన్న పోస్టర్ ని రిలీజ్ చేశారు.
ఇవాళ (అక్టోబర్ 10)న ఈ సినిమాకి సంబంధించిన స్టోరీ గ్లింప్స్ కూడా రిలీజ్ అవుతున్నాయి. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, మహేశ్వరి మూవీస్ కలిసి నిర్మిస్తున్నాయి. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించనున్నారు. ఈ సినిమాతో ఇద్దరు కొత్త నటులు సినీ ఇండస్ట్రీకి పరిచయం కానున్నారు. బబుల్ గమ్ సినిమా రిలీజ్ కాకుండానే రోషన్ రెండో సినిమాను లైన్ లో పెట్టాడని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు యువ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు.
రెండో సినిమాతో అయిన హిట్ అందుకుంటాడా? S
ఇక సింగర్ సునీత తనయుడు ఆకాష్ ఇప్పటికే బోణీ కొట్టాడు.. సర్కారీ నౌకరీ అనే సినిమాలో ఇటీవల నటించాడు. ఆకాష్ ను గ్రాండ్ గా లాంచ్ చేసినా ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. సింగర్ గా తన పేరు , ప్రఖ్యాతులు, ప్రముఖులతో పరిచయాలు, తన వారసుడికి కలిసొస్తాయని ఆశించిన సునీతకు నిరాశే మిగిలింది. ఆ సినిమా కనీసం పదిమంది నోళ్లలో కూడా నానలేదు. అయినా ఆకాష్ నిరాశపడలేదు. ఇప్పుడు మరో సినిమాకు ప్రిపేర్ అవుతున్నాడు. మరి ఈ రెండో మూవీ అయినా ఆకాష్ కు కలిసొస్తుందో లేదో చూడాలి. మరోవైపు సునీత కుమార్తె శ్రేయా గోపరాజు కూడా గాయనిగా తన కెరీర్ షురూ చేసింది. సునీత చరిష్మా వీరిద్దరికీ ఎలా కలిసొస్తుందో చూడాలి.
S