గురక (snoring) .. దీనిని చాలా మంది చిన్న సమస్యగా చూస్తారు. మనలో ఎంతో మంది నిద్రపొయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టే వారి కంటే, వారితో కలసి ఒకే గదిలో పడుకునేవారికి ఎక్కువ సమస్యగా ఉంటుంది. దీనివల్ల పక్కన పడుకున్న వారు చాలా ఇబ్బంది పడతారు. ఈ సౌండ్కు వారికి నిద్రపట్టదు. దాదాపు 30 ఏళ్ల వయస్సు లోపు వారిలో సుమారు 10% మంది, 60 ఏళ్లు పైబడిన వారిలో 60% మంది గురక పెడుతుంటారు. నేషనల్ స్లీప్ ఫౌండేషన్ గణాంకాల ప్రకారం, ప్రతి ముగ్గురు పురుషులలో ఒకరికి, ప్రతి నలుగురు స్త్రీలలో ఒకరికి రాత్రి గురక పెట్టే అలవాటు ఉంటుంది. ఒకవేళ మీరు అప్పుడప్పుడూ గురక పెడితే అది పెద్ద సమస్యేమి కాదు. ఎక్కువ సేపు గురక పెట్టేవారిలో శ్వాస ఆగిపోవడం, హృదయ సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే గురకను నిర్లక్ష్యం చేయకూడదు.
గురక ఎందుకు వస్తుంది? (snoring)
నిద్ర సమయంలోముక్కు నుంచి ఊపిరితిత్తుల్లోకి గాలి వెళ్లే మార్గంలో అడ్డంకులు ఏర్పడితే వచ్చేదే గురక . అలాంటప్పుడు నోటి ద్వారా శ్వాస తీసుకునే ప్రయత్నం జరుగుతుంది. మానసికపరమైన ఒత్తిడి, కంగారు, విపరీతమైన ఆలోచనల వల్ల కూడా గురక వస్తుంది. నిద్రపోతున్న సమయంలో శ్వాస తీసుకోవడం, వదలడం చేసినపుడు మన మెడ, తలలోని మృదు కణజాలంలో కంపనల వల్ల మనం గురక పెడుతుంటాం. మనం నిద్రపోతున్న సమయంలోశ్వాస పీల్చుకునే మార్గం విశ్రాంతి స్థితిలో ఉంటుంది. ఆ సమయంలో గాలి చాలా బలవంతంగా లోపలికి వెళ్లాలి. అందుకే మృదు కణజాలంలో కంపనలు ఏర్పడతాయి. మధ్య వయసు, ఆపై వయసుకు వచ్చిన తర్వాత గొంతు భాగం సన్నబడుతుంది. దీనివల్ల గురక రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే మహిళలతో పోలిస్తే పురుషుల్లో గురక సమస్య ఎక్కువగా వస్తుంది.
మనం గురక పెట్టకుండా ఏం చేయవచ్చు…
మనం గురకపెట్టకుండా ఉండాలంటే వాయుమార్గం తెరుచుకుని ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం. అలా చేయడానికి ఎన్నో పద్ధతులు ఉన్నాయి. మందు తాగే అలవాటు ఉన్నవారు గురక పెట్ట అవకాశం ఎక్కువగా ఉంటుంది. రాత్రి పూట ఆల్కహాల్ తాగినా గురక వస్తుంది.
సాధారణంగా ముక్కులో అడ్డంకులు ఉండటం వల్ల నోటితోశ్వాస తీసుకుంటారు. ఇవేకాదు అలర్జీలు, సైనస్ ఇన్ఫెక్షన్, ముక్కులోపలి భాగం వాచిపోవడం, అడినాయిడ్స్ అన్నీ కూడా శ్వాస మార్గానికి అడ్డంకులే కారణం.
గురక సమస్యను అధిగమించడానికి చిట్కాలు… (snoring)
ప్రతిరోజూ రాత్రి నిద్రపోయేముందు గుప్పెడు పచ్చి అటుకులను తింటే గురక రాకుండా కంట్రోల్ అవుతుంది. రాత్రి పడుకునే ముందు మరిగే నీటిలో 4,5 చుక్కలు యూకలిప్టస్ ఆయిల్ వేసి ఆవిరి పట్టాలి. అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ ఏజెంట్స్ ఉంటాయి. ఇది గొంతును క్లియర్ చేస్తుంది. గురక నుంచి ఉపశమనం పొందడానికి రోజుకు రెండు సార్లు అల్లం, తేనె టీ తాగితే మంచిది. వెల్లుల్లి, ఉల్లిపాయ, ముల్లంగి తీసుకుంటే గురక సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇవి ముక్కు పొడిబారకుండా రక్షిస్తాయి. మెలటోనిన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే.. నిద్ర బాగా పడుతుంది. పైనాపిల్, అరటిపండు, కమలా పళ్లలో మెలటోనిన్ ఎక్కువగా ఉంటుంది. మీరు ఈ ఆహారం తీసుకుంటే గురక సమస్య తగ్గుతుంది.
అధిక బరువూ కారణమే…
ముఖ్యంగా అధిక బరువు ఉన్న వారిలో చాలా మందికి గురక సమస్య ఉంటుంది. లావుగా ఉండే వారి శ్వాస మార్గం నిద్ర సమయంలో మరింతగా కుచించుకుపోతుంది. కాబట్టి బరువు తగ్గేందుకు ప్రయత్నించండి. బరువు తక్కువగా ఉన్నవారికి గురక వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. స్మోకింగ్, మద్యపానం ఈ రెండు అలవాట్లు చాలా అనారోగ్యాలకు కారణాలు. అలాగే గురక ఎక్కువగా రావడానికి, బరువు పెరగడానికి కూడా ఇవి కారణాలు. ఈ రెండింటికి దూరంగా ఉండటం మంచిది. మంచి ఆహరం తీసుకోవడం, బయట ఫుడ్ ఎక్కువ తీసుకోకుండా వుండటం మంచిది. వయస్సుతో సంబంధం లేకుండా అందరికి గురక వస్తుంది దానికి ముఖ్య కారణం ఫాస్ట్ ఫుడ్ తీనడం వల్ల బరువు పెరుగుతున్నారు కాబట్టి బరువు పెరిగే ఆహారానికి దూరంగా ఉండటం మంచిది. (snoring)