(Fit)
మానసిక ఆరోగ్యం మెరుగు పడాలంటే ఏం చేయాలి ?
మనసు సక్రమంగా ఉంటేనే ప్రశాంతమైన జీవితం. ఉరుకుల పరుగుల జీవనంలో నేడు చాలా జాగ్రత్తలు అవసరం. మానసిక రోగులను ఉంచే ప్రాంతాలు చూస్తే గుండె తరుక్కుపోతుంది. మాసిన, చిరిగిన బట్టలు, జైలులాంటి చిన్న గది, ఒంటరితనం, ఈ ప్రపంచంలో నన్ను పట్టించుకునే మనిషి ఒక్కరూ లేరా అని బాధపడే ఎంతోమందిని ఈ సమాజంలో చూస్తున్నాం. మంచానికి ఇనుప చైన్‌తో కట్టేసిన కాళ్లు,ఎవరికోసమోవెతికే కళ్లు మానసిక ఆరోగ్యం లోపించిన వారి పరిస్థితి ఇలా ఉంటుంది. మానసిక వైకల్యం కారణంగా పిచ్చివాళ్లు అనే ముద్ర వేయించుకుని వాళ్లు జీవిస్తున్నారు. ప్రపంచంలో ఎవరికీ పట్టని వారుగా దీనంగా బతుకులీడుస్తున్న ఇలాంటి వాళ్లు మన చుట్టూ ఎంతోమంది వున్నారు. వాళ్లూ మనుషులే వారి పట్ల మనందరి దృక్పథాలు మారాలి అంటోంది WHO ప్రపంచ ఆరోగ్య సంస్థ.
మెంటల్ హెల్త్ డేని ఎందుకు నిర్వహిస్తున్నారు? (Fit)
ఏటా అక్టోబర్ 10న వరల్డ్ మెంటల్ హెల్త్ డేని నిర్వహిస్తోంది. ఆరోగ్యమే మహాభాగ్యం అనేది ఆనాటి మాట. ఆరోగ్యం బాగుంటే అంతా బాగుంటుంది. కాని నేడు మానసిక ఆరోగ్యమే మహాభాగ్యం అంటున్నారు మానసిక వైద్యనిపుణులు. కానీ ఇప్పటి పరిస్థితులు వేరు ఒకటే టెన్షన్ .. ఉరుకులపరుగల జీవితం. కనీసం కుటుంబ సభ్యులతో సైతం గపడలేని జీవితం. ఈ క్రమంలో మానసిక ఆరోగ్యం ఎంతో ముఖ్యం. ఇందుకోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని ఏటా అక్టోబర్ 10న జరుపుకోవాలని ప్రకటించింది. మన ఆలోచనలు ఆచరణలూ అన్నీ మెదడుపైనే ఆధార పడి పనిచేస్తుంటాయి. మెదడు లేకుంటే శరీరం ఇంజన్‌లేని రైలు, దారం లేని గాలి పటం అవుతుంది. లక్ష్యాలను చేరి ఆనందంగా జీవించేందుకు ఇతర శారీరక అవయవాలతో పాటు మానసిక ఆరోగ్యం బాగుండేలా చూసుకోవాలి.
జీవితం పట్ల శ్రద్ద తీసుకోకపోతే ఏమౌతుంది…
మానసిక ఆనారోగ్యాన్ని అశ్రద్ధ చేస్తే, చికిత్సను మధ్యలోనే ఆపేసినా పరిస్థితి మరింత అదుపుతప్పే ప్రమాదం ఉంది. శారీరక, మానసిక ఆరోగ్యాలు ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి. దీర్ఘకాలిక శారీరక సమస్యలు కొన్నిసార్లు మెదడుపై ప్రభావం చూపుతాయి. అలాగే మానసిక అనారోగ్యం శారీరక ఆరోగ్యాన్ని కూడా తీవ్రంగా దెబ్బతీస్తుంది. కనుక అటు శారీరకంగానూ, ఇటు మానసికంగానూ దృఢంగా ఉండేలా చూసుకోవాలి. మానసిక రోగం పేరిగితే చాలు మనందరికీ భయం. మానసిక వైద్యనిపుణుల అంచనా ప్రకారం 40 శాతం మంది పిచ్చివాళ్లే అంటారు. ఇది మెడికల్ అనాలసిస్ మాత్రమే. వాస్తవంగా చెప్పాలంటే సమాజంలో ఏ రెండు శాతం మందో మానసికంగా పూర్తిగా ఫిట్‌గా ఉంటారనే వాదన కూడా వినిపిస్తోంది.
వివిధ రకాల మానసిక రుగ్మతలు… (Fit)
మన చుట్టూ ఉన్న సమాజంలో ఎంతో వింత వ్యక్తులు ఉన్న వారు కనిపిస్తుంటారు. ఒకరికి తిండి పిచ్చి, నగల పిచ్చి, డబ్బు సంపాదించాలనే పిచ్చి, గొప్పలు చెప్పుకునే పిచ్చి, ఆడంబరాలకు ఇలా ఎన్నో రకాల మానసిక రుగ్మతలు ఉన్న వారు మన చుట్టూనే కనిపిస్తుంటారు. ఏ లక్షణమైనా లిమిట్ దాటితే అవి పిచ్చి చేష్టలే అవుతాయి.
వైద్య పరిభాషలో మానసిక వ్యాధిని పలు రకాలుగా చెప్పారు. డిప్రెషన్,యాంగ్జయిటీ, యాంగ్జయిటీ న్యూరోసిస్, బైపోలార్ డిజార్డర్, సోషల్ యాంగ్జయిటీ డిజార్దర్, పానిక్ డిజార్డర్, అబ్సెసిస్ కంపల్సెవ్ డిజార్డర్, ఫోబియా, మానియా, స్కిజోప్రినియా, డిల్యూషన్ డిజార్డర్, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, సుపీరియారిటీ కాంప్లెక్స్, ఇల్యూషన్, అడిక్షన్ లాంటి మానసిక వైకల్యాలు ఉన్నాయి. స్థూలంగా చెప్పాలంటే మానసిక ఉద్రేకాలను నిగ్రహించుకోలేక పోవడమే రుగ్మతలను తెచ్చిపెడుతోంది.
తీసుకోవలసిన జాగ్రత్తలు …
కష్ట సమయాలు, క్లిష్ట పరిస్థితుల్లో కుంగి పోకుండా బ్యాలెన్సుగా ఉండగలిగితే మెదడు సక్రమంగా పనిచేస్తుంది. ఒత్తిడికి గురికాకుండా సమస్య పరిష్కారం దిశగా ఆలోచించాలనే గాని ఆందోళనకు గురికాకూడదు అంటారు మానసిక వైద్య నిపుణులు.
తగు మోతాదులో పౌష్టికాహారం, రోజులో కసనం గంట సేపు వ్యాయామం, రిలాక్సేషన్ ఎక్స్ర్ సైజులు చేస్తూ , తీవ్ర ఉద్రేకాలకు లోనుకాకుండా ఉండాలి. ఎంతటి పెద్ద సమస్యల అయినా కుంగి పోకుండా ఉండేలా మనసును దృఢంగా ఉంచుకోగలగాలి. ప్రతి సమస్యకు పరిష్కారం ఉందనే విషయాన్ని బలంగా నమ్మాలి. ఇలా ఆలోచిస్తే ఆందోళన దూరం అవుతుంది. జాగ్రత్తలు పాటిస్తే మానసిక రుగ్మతలు మన దరి చేరవని సైక్రియాటిస్టులు అంటున్నారు.
ఏ వయస్సులో వారికి మానసిక సమస్యలు ఎక్కువ ? (Fit)
వృద్ధాప్యంలో మానసిక రుగ్మతలు ఎక్కువగా వస్తున్నాయి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మానసిక వైద్యులు అంటున్నారు. వృద్ధుల పట్ల, కుటుంబం, ఇతర సభ్యులు ప్రేమతో ఉండాలి. ఏ వయస్సు వారిలో అయినా మానసిక ఆరోగ్య సమస్యలు ఎక్కువగా కనిపిస్తే వారిని వెంటనే సైక్రియాటిస్టు వద్దకు తీసుకెళ్లాలి.
జీవితంలో నిరంతరం పరుగులు పెడుతున్నారు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు, అయిన వాళ్లను కూడా పట్టించుకోవడం లేదు. జీవితంలో వేగం ఉండాలే కాని వేగమే జీవితం కాకుడదు. డబ్బు పోతే మళ్లీ సంపాదించుకునే అవకాశం ఉంటుంది. కానీ బంధాలు తెంచుకుంటే తిరిగి రావు. అందుకే ఆందోళనకు స్వస్తి చెప్పి ప్రశాంతంగా నవ్వూతూ ఉండటం మంచిది. కష్టాలు, బాధలు, లక్ష్యాలు ఉంటూనే ఉంటాయి. వాటిని గురించే ఆలోచిస్తూ మనసు పాడు చేసుకుంటే మనకే నష్టం. మనసు బాగుంటే శారీరక ఆరోగ్యం కూడా బాగుంటేందనే విషయాన్ని గుర్తించాలి. మానసిక ఆరోగ్యమే మహా భాగ్యం అనే విషయాన్ని మనసా, వాచా, కర్మణా నమ్మి ఆ దిశగా మహాభాగ్యాన్ని పొందాలి. (Fit)
(వాట్సాప్ కథనం ఆధారంగా)