Amala Paul
మొదటి పెళ్లి విడాకుల తరువాత చాలా గ్యాప్ తీసుకున్న ఈ అమ్మడు రెండో పెళ్లి వార్తతో మళ్లీ ప్రేక్షకులకు ముందుకు వచ్చింది. ఎవరిని పెళ్లి చేసుకుంటుంది? అసలు విషయానికి వస్తే….. ఇద్దరమ్మాయిలు సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయింది అమలాపాల్. తన నటనతో ఎంతో మందిని సొంతం చేసుకుంది. టాలీవుడ్ లో నాగచైతన్య సినిమాతో ఏంట్రీ ఇచ్చింది. సిని ఇండస్ట్రీలో స్టార్ హీరోల సరసన నటించింది ఈ అమ్మడు. సౌత్ ఇండస్ట్రీలో చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంటుంది.
నిలకడ లేని రెండు రిలేషన్స్
25 ఏళ్లు కెరీర్ పీక్ లో ఉన్న టైం లోనే సినిమాలు చేయకుండా పెళ్లి వైపు అడుగులు వేసింది. 2014లో డైరెక్టర్ ఏ యల్ విజయ్ ని ప్రేమ పెళ్లి చేసుకుంది. ఆ ప్రేమ పెళ్లి ఎన్నో రోజులు నిలవలేదు… చివరకు 2017లో ఇరువురు విడిపోయారు. అలా జరిగిన తరువాత కొంత కాలం మరో రిలేషన్ లోకి వెళ్లలేదు అమలపాల్. మధ్యలో సింగర్ తో రిలేషన్ లో ఉందని పుకార్లు జోరుగా ప్రచారం జరిగాయి. వీరు ఇద్దరు కలిసి బిజినెస్ స్టార్ట్ చేశారు. అతడితో విభేదాలు తలెత్తాయి. అవి పోలీస్ స్టేషన్ వరకు దారి తీశాయి. ఈ రెండు విషయాలతో 2017 నుంచి అమల పర్సనల్ లైఫ్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. తరువాత నుంచి సినిమాలలో బిజీగా ఉంటూ… సొషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది. ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీలో బిజీగా ఉంది. రీసెంట్ గా పెళ్లి వార్తతో మన ముందుకు వచ్చింది ఈ అమ్మడు. కొన్ని రోజులుగా ఓ అబ్బాయితో రిలేషన్ షిప్ లో ఉండి పెళ్లికి ఓకే చెప్పింది. ఇంతకి ఆ వ్యక్తి ఎవరు? ఇంత సడన్ గా అమలా పాల్ పెళ్లి పీటలెక్కడానికి కారణమేంటి? Amala Paul
ఈవెంట్ మేనేజర్ తో అమలా పెళ్లి జరుగుతుందా? Amala Paul
అమలపాల్ జీవితంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతోంది. ఈవెంట్ మేనేజర్ జగత్ దేశాయ్ ను పెళ్లాడనున్నది అమలా పాల్. జగత్ దేశాయ్ గుజరాత్ కు చెందిన వాడు. పెళ్లి వార్తలు బయటకు రావడానికి కారణం తన 32వ పుట్టిన రోజు వేడుకలు. ఆమె బర్త్ డే సెలబ్రేషన్స్ ని ఓ రిసార్ట్ లో ఘనంగా సెలబ్రేట్ చేశాడు జగత్ దేశాయ్. ఈ సందర్భంగా ఉంగరం బహూకరించి అమలాపాల్ కు పెళ్లి ప్రపోజ్ చేశాడు జగత్… ప్రపోజల్ కి ఓకే చెప్పి ఓ కిస్ కూడా ఇచ్చేసింది ఈ ముద్దుగుమ్మ.. జగత్ దేశాయ్ ప్రపోజ్ చేసిన వీడియోని తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ‘నా కలల రాణి నాకు ఎస్ చెప్పింది’ ……’వెడ్డింగ్ బెల్స్ఎహెడ్, హ్యాపీ బర్త్ డే మై లవ్’ అంటూ ట్వీట్ చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతోంది. త్వరలోనే ఈ జంట ఏడు అడుగులతో ఒక్కటి కాబోతున్నారు.మనం కూడా కాబోయే ఈ కొత్త జంటకు గుడ్ లక్ చెప్పేద్దాం. Amala Paul