(Italy)
మెగా ఫ్యామిలీ వరస గుడ్ న్యూస్ లతో ప్రేక్షకులను అలరిస్తోంది. రీసెంట్ గా మెగా ఫ్యామిలీలో వారసురాలు పుట్టడం, వరుణ్ పెళ్లి వంటి శుభవార్తలతో మనందరినీ సంతోష పరిచారు. ఈజోరులో భాగంగా నవంబర్ 1న మెగా ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. ప్రేమ పెళ్లితో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సొట్ట బుగ్గల సుందరి లావణ్య ఒక్కటి కాబోతున్నారు. మొన్నటికి మొన్న వీరి ప్రీ వెడ్డింగ్ పార్టీ సందడి సందడిగా సాగింది. ఆ ఫోటోలను చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. ఇక నవంబర్ 1వ తేదీన ఇటలీలో గ్రాండ్ గా వీరి డెస్టినేషన్ వెడ్డింగ్ జరగబోతోంది.. వీరి పెళ్లి కార్డు సైతం మీడియాతో షేర్ చేస్తుకున్నారు. వెడ్డింగ్ కార్డు సింపుల్ డిజైన్ తో అందరిని ఆకట్టుకుంటుంది. అది చూసిన ఫ్యాన్స్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఇటలీలో మెగా పెళ్లి సందడి:
వరుణ్-లావణ్య పెళ్లి ఇటలీలోని టస్కనీలో అంగరంగ వైభవంగా జరగనుంది. అక్టోబర్ 30న కాక్ టెయిల్ పార్టీతో స్టార్ట్ చేసి, అక్టోబర్ 31న హల్దీ వేడుకలు ఘనంగా జరుగనున్నాయి. పెళ్లికి కొద్ది రోజులే ఉండటంతో వరుణ్-లావణ్య హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పొర్ట్ నుంచి శుక్రవారం ఇటలీకి బయలుదేరారు. ఈ జంటతో పాటు వైష్ణవ్ తేజ్ కూడా ఇటలీకి వెళ్లాడు. త్వరలోనే మెగా ఫ్యామిలీ మొత్తం ఇటలీకి బయలు దేరనున్నారు. అయితే పవన్ కళ్యాణ్ హాజరు అవుతాడో లేదో అన్నది మాత్రం స్పష్టం కాలేదు. (Italy)
ఏ హీరో పెళ్లికి అటెండ్ అవుతున్నాడు? (Italy)
డెస్టినేషన్ వెడ్డింగ్ కావడంతో మెగా ఇంట్లో జరిగే పెళ్లికి కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరు కానున్నారట. సిని ఇండస్ట్రీ హీరోలు ఎవరు అటెండ్ అయ్యే ఛాన్స్ లేదని సమాచారం. అయితే ఒక హీరో మాత్రం స్పెషల్ గా పెళ్లికి అటెండ్ అవుతున్నాడని సమాచారం. ఇంతకీ ఎవరు ఆ హీరో? అతను ఎవరో కాదు నితిన్. ఇటలీలో జరిగే పెళ్లి వేడుకలకు నితిన్ హాజరు అవుతున్నాడట. మొదటి నుంచి అల్లు అర్జున్ కి, అల్లు శిరీష్ కి, రాంచరణ్ కి, వరుణ్ తేజ్ కి, నితిన్ చాలా క్లోజ్ ఫ్రెండ్. అందుకే పెళ్లి వేడుకలలో పాల్గొంటున్నాడు.
మదాపూర్ లో రిసెప్షన్: (Italy)
కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహ బంధంతో ఒక్కటికానున్నారు వరుణ్-లావణ్య. అనంతరం నవంబర్ 5వ తేదీన మాదాపూర్ లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో వీరి వివాహ రిసెప్షన్ ఘనంగా జరగనుంది. ఇరువురు కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నారు. వీరి రిసెప్షన్ కి అయినా సినీ ప్రముఖులు హాజరౌతారో లేదో చూడాలి.
వరుణ్ పెళ్లికి బబాయ్ వెళతాడా?
ఇక రాజకీయాలలో బిజీగా ఉన్న పవన్ పెళ్లికి అటెండ్ అవుతాడో లేదో అన్నది ప్రశ్నర్థకంగా మారింది. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల జోరు కొనసాగుతుంది. తెలంగాణలో కూడా జనసేన పార్టీ పోటీ చేయనుందని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎన్నికల సమయంలో పవన్ పెళ్లికి హాజరు అవుతాడో లేదో చూడాలి మరి. (Italy)