(sorry)
దానగుణంలోనూ, మంచితనంలోనూ ఆయనకు ఎవరూ వంక పెట్టలేరు. తమిళ ఇండస్ట్రీ ముద్దుబిడ్డ ఎవరు అంటే రజనీకాంత్ అని చెప్పుకోవాలి. రజనీ సినిమాలో చిన్నపాటి పాత్ర వచ్చినా చాలు తమ జన్మ ధన్యం అనుకుంటారు చాలా మంది.. అలాంటి రజనీ పక్కన ఏకంగా హీరోయిన్ అవకాశం వస్తే ఎవరైనా వదులుకుంటారా?కానీ ఓ నటి అంత పనీ చేసింది. ఆమె ఎవరో కాదు.. అందాల సుందరి త్రిష.
సౌత్ లో నెంబర్ 1 స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్. రజినీకాంత్ పక్కన హీరోయిన్ గా నటించే ఛాన్స్ ని మిస్ చేసుకుందట ఈ బ్యూటీ. అప్పట్లో సూపర్ హిట్ అయిన శివాజీ సినిమాలో త్రిషని అనుకున్నారట. శివాజీ సినిమా రజినీకాంత్-శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కింది. ఇంత పెద్ద కాంబినేషన్ లో హీరోయిన్ ఛాన్స్ వస్తే ఏ హీరోయిన్ మాత్రం వదులుకుంటుంది. ఆ ఛాన్స్ ని త్రిష మిస్ చేసుకుంది. తను నో చెప్పటంతో సెకండ్ ఛాయస్ అయిన శ్రియని సంప్రదించాడు శంకర్. చివరకు శ్రియాశరణ్ ఆ ఛాన్స్ వినియోగించుకుంది. రజినీకాంత్ నటన, శ్రియశరణ్ డాన్స్ తో సినిమా అంచనాలను మించి పెద్ద హిట్ గా నిలిచింది. ఈ సినిమా బాక్సాఫీస్ లో వద్ద పెను సంచలనం సృష్టించింది. శ్రియ కెరీర్ లో శివాజీ సినిమా సూపర్ హిట్ అయింది. తనకు మంచి గుర్తింపు తెచ్చుకుంది. అందులో పువ్వల్లే.. నవ్వుల్.. నవ్వుల్..నవ్వల్లే పువ్వుల్ పువ్వుల్.. వాజీ వాజీవాజీ.. నారాజే ఈ శివాజీ అంటూ శ్రియ సుకుమారంగా, కోమలంగా చేసిన డ్యాన్స్ ప్రతీ ప్రేక్షకుడి గుండెలో నిలిచిపోతుంది.
త్రిష శివాజీ సినిమాను ఎందుకు వదులుకుంది? (sorry)
ఇంత సూపర్, డూపర్ హిట్ మూవీని త్రిష వదులు కోడానికి చాలా కారణాలే ఉన్నాయిట. అప్పటికే ఆమె చేతిలో నాలుగు ప్రాజెక్ట్స్ ఉన్నాయిట. అయినా శివాజీలో హీరోయిన్ పాత్రకు మీరే కరెక్ట్ గా సూటవుతారు.. డేట్స్ ఎలాగోలా అడ్జెస్ట్ చేసుకోండి ప్లీజ్ అని డైరక్టర్ శంకర్ కూడా బతిమాలాడుట. అయితే మూవీ ఇంత సక్సెస్ అవుతుందని ఊహించని త్రిష అప్పటికే చేతిలో ఉన్న ప్రాజెక్టులను వదులుకోవడం ఎందుకులే అని నో చెప్పేసిందిట. మరోసారి ఆలోచించుకోండని శంకర్ అన్నా సారీ.. నేను ఈ మూవీలో నటించలేను.. డేట్స్ అడ్జెస్ట్ కావు అని తేల్చి చెప్పేసిందిట త్రిష.
మళ్లీ ఛాన్స్ మిస్ చేసుకున్న త్రిష :
అప్పట్లో అలా శివాజీ సినిమాలో నటించలేకపోయిన త్రిష ఆ తర్వాత పేట అనే సినిమాలో చెల్లెలు గా నటించింది. హీరోయిన్ ఛాన్స్ ని మిస్ చేసుకుని చివరకు చెల్లెలు క్యారెక్టర్ లో నటించింది త్రిష. అయితే నటించిన ఆ సినిమా మాత్రం కమర్షియల్ గా హిట్ అయ్యింది. అయితే రీసెంట్ గా రజినీకాంత్ తో మళ్లీ హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చింది. మళ్లీ త్రిష తప్పు చేసింది. ఒకసారి రజనీ లాంటి వ్యక్తి పక్కన చెల్లెలుగా నటించి ఆ తర్వాత హీరోయిన్ గా నటించడం బాగోదు అంటూ తిప్పి కొట్టేసిందిట త్రిష. రజనీ పక్కన హీరోయిన్ గా రొమాన్స్ చేయలేను అని చెప్పేసిందట. ఇది విన్నవాళ్లు త్రిష కి మైండ్ పోయిందా అని అనుకుంటున్నారు. రజనీ పక్కన రోల్ అంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు.. కానీ త్రిష మాత్రం చేయలేను అంటూ తిరస్కరించింది. గుమ్మంలోకి వచ్చిన గోల్డెన్ ఛాన్స్ ని కాలదన్నుకోడం అంటే ఇదేనేమో.. బ్యాడ్ లక్ త్రిషా…