పాక్షిక చంద్రగ్రహణం (Lunar Eclipse)
తేదీ : 2023 అక్టోబర్ 28
ప్రారంభ సమయం : రా. 1.05
విడుపు సమయం : సా. 2.23 గంటలకు
చంద్రుడు ప్రచ్ఛాయలోకి ప్రవేశించే సమయం : రా.11.32 చంద్రుడు ప్రచ్ఛాయనుండి బయటకు వచ్చే సమయం : రా.03.56
వారం : శనివారం
తిథి : ఆశ్వయుజ పూర్ణిమ
నక్షత్రం : అశ్విని , రాశి : మేషరాశి
చంద్రగ్రహణం (Lunar Eclipse) పౌర్ణమి తిథినాడు ఏర్పడుతుంది. అక్టోబర్ 28వ తేదీనాటి రాత్రి పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతోంది. మన పంచాంగాల లెక్కల ప్రకారం మాత్రం వారాన్ని శుక్రవారంగానే పరిగణిస్తారు. హైదరాబాద్ లో ఈ గ్రహణం రాత్రి1.44ల నుంచి కంటికి కనపడుతుంది. సాధారణ నియమాలు గ్రహణ సమయంలో భోజనం చేయకూడదు. గ్రహణం ప్రారంభమ్యేలోపుగా అరిగిపోయేలా భోజనం పూర్తి చేసుకోవాలి. రాత్రి 8 గంటలకే భోజనాదికాలు పూర్తి చేసుకోవడం మేలు. నిత్యావసర వస్తువులపై దర్భలు వేసి ఉంచాలి. గ్రహణ సమయంలో దానం, జపం వంటివి నిర్వహించేవారు ప్రారంభ సమయంలో పట్టుస్నానం చేస్తారు. గ్రహణం పూర్తయ్యాక చేసే విడుపు స్నానాన్ని మాత్రం అందరూ విధిగా చేయాలి. గృహశుద్ధి చేసుకోవాలి.
చంద్రగ్రహణే యస్మిన్ యామే గ్రహణం, తస్మాత్ పూర్వం ప్రహరత్రయం న భుంజీత.
సూర్యగ్రణేతు ప్రహర చతుష్టయం. చంద్రగ్రహేతు యామాం స్త్రీన్ బాలవృద్ధాతురైర్వినా.
బాలవృద్ధాతురాణాం తు గ్రహణ యామాత్పూర్వమేక యామో నిషిద్ధః
చంద్రగ్రహణ (Lunar Eclipse) మందు, గ్రహణం ముందు మూడు ప్రహరలు (ఒక ప్రహర = 48నిముషములు) లో భోజనం చెయ్యరాదు. సూర్యగ్రహణానికి ముందు నాలుగు ప్రహరలులో భోజనం చెయ్యరాదు. కానీ ఇది చిన్నపిల్లలకు, ముసలివారికి, స్త్రీలకు, అనారోగ్యుల విషయంలో వర్తించదు. వారు ఒక ప్రహర ముందు భుజించవచ్చును.
సంధ్యాకాలే యదా రాహుః గ్రసతే శశిభాస్కరౌ తదహర్నైవ భుంజీత రాత్రావపి కదాచన. సాయం సంధ్యాయాం సూర్యగ్రస్తే పూర్వే౬హ్ని రాత్రౌ చ న భోక్తవ్యం.అహోరాత్రం న భోక్తవ్యం చంద్రసూర్యగ్రహో యదా ముక్తిం దృష్ట్వాతు భోక్తవ్యం స్నానం కృత్వా తతఃపరమ్.
సంధ్యాసమయంలో రాహువు / కేతువు ద్వారా చంద్రుడు లేదా సూర్యగ్రహణం జరిగితే, ఆ పగలు, రాత్రి కూడా భోజనం చెయ్యకూడదు. తరువాతి రోజు శుద్ధబింబాన్ని చూసి, స్నానాదులు చేసుకుని భోజనం చెయ్యాలి.
సర్వేషామేవ వర్ణానాం సూతకం రాహు దర్శనే స్నాత్వా కర్మాణి కుర్వీత శృతమన్నం వివర్జయేత్ రాహు / కేతువుల గ్రహణం అయినప్పుడు అన్ని జాతులవారికి సూతకం వస్తుంది. కాబట్టి, ఆ సమయంలో వండిన అన్నాన్ని తినకుండా గ్రహణం అయ్యాక స్నానం చేసి వండుకుని తినాలి. అరనాలం పయస్తక్రం దద్దిస్నేహాజ్య పాచితం మణికస్థోదకం చైవ న దుష్యేత్ రాహుసూతకే*__*అన్నం పక్వమిహత్యాజ్యం స్నానం సవనసంగ్రహే వారితక్రార నాలాది తిలదర్భైర్న దుష్యతి.పులియబెట్టిన కడుగునీరు, పాలు, మజ్జిగ, పెరుగు, నూనె, నేతితో వండిన పదార్థాలు, గంగాజలం… వీటిపై నువ్వులను, దర్భలను వేసి ఉంచితే అవి గ్రహణసమయంలో అపవిత్రం కావు♪. కాబట్టి గ్రహణం తరువాత వాటిని ఉపయోగించుకోవచ్చు.
ముక్తౌ యస్తు న కుర్వీత స్నానం గ్రహణసూతకే
స సూతకీ భవేత్తావత్ యావత్స్యాత్ అపరోగ్రహః
గ్రహణం విడిచాక స్నానం చెయ్యని వారికి మరల మరొక గ్రహణం వచ్చి, అప్పుడు స్నానం చేసేవరకు సూతకమే వర్తించి అప్పటి వరకు అపవిత్రులుగానే పరిగణింపబడతారు.
ఇందోః లక్షగుణం పుణ్యం రవేః దశగుణం తతః
గంగాతోయేతు సంప్రాప్తే ఇందోః కోటీ రవేర్దశః
గవాం కోటి సహస్రస్య యత్ఫలం లభతే నరః
తత్ఫలం లభతే మర్త్యో గ్రహణే చంద్రసూర్యయోః
చంద్రగ్రహణ (Lunar Eclipse) సమయంలో విధివిధానంగా స్నానం చెయ్యడం వల్ల లక్షగుణిత పుణ్యం కలుగుతుంది♪. సూర్యగ్రహణ సమయంలో స్నానం వల్ల దానికంటే పది రెట్లు ఎక్కువ పుణ్యం లభిస్తుంది.