B
మూడు ముళ్లు, ఏడు అడుగులతో ఒక్కటవ్వబోతున్నారు సిని ఇండస్ట్రీలోని ప్రముఖులు. బీ టౌన్ లో వరుసగా పెళ్లి బాజాలు మోగుతున్నాయి. పెళ్లిళ్ల సీజన్ స్టార్ట్ అవ్వటంతో మూవీ ఇండస్ట్రీ వాళ్లు పెళ్లి శుభవార్తలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
మోగా ఫ్యామిలీ న్యూ కపుల్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్- లావణ్యా త్రిపాఠీ నవంబర్ 1వ తేదిన పెళ్లి పీటలెక్కుతున్నారు. కొన్ని ఏళ్లు ప్రేమించుకొని పెద్దల సమక్షంలో ఒక్కటవ్వబోతున్నారు ఈ జంట. వీరి వివాహం ఇటలీలో ఘనంగా జరగనుంది. ఇప్పటికే మెగా ఫ్యామిలీ అందరు ఇటలీకి చేరుకున్నారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్, భార్యతో సహా ఇటలీ బయల్దేరారు. పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరగనుంది.
యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా కూతురి పెళ్లి: B
త్వరలో సర్జా ఇంటిలో పెళ్లి హడావిడి మొదలవుతుంది. యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా పెద్ద కూతురు ఐశ్వర్య పెళ్లి పీటలెక్కబోతుంది. మొన్నటికి మొన్న తంబీ రామయ్య కొడుకు ఉమాపతి రామయ్యతో ఎంగేజ్ మెంట్ ఘనంగా జరిగింది. ఈ జంట కూడా ప్రేమించుకొని వివాహ బంధంతో ఒక్కటికాబోతున్నారు. ఉమాపతి రామయ్య ఇప్పటికి నాలుగు సినిమాలు చేశాడు. ఇక ఐశ్వర్య ఇండస్ట్రీలోకి ఇంక ఏంట్రీ ఇవ్వక పోయినా అందరికి సుపరిచితమే.
దగ్గుపాటి ఇంట పెళ్లి బజాలు:
విక్టరీ వెంకటేష్ ఇంట పెళ్లి వేడకలు వైభవంగా జరగనున్నాయి. ఇప్పటికే పెద్ద కూతురు ఆశ్రిత వివాహం అంగరంగ వైభవంగా జరిపాడు వెంకీ. త్వరలో రెండో కూతురు హయవాహన కూడా పెళ్లి కూతురు కాబోతోంది. విజయవాడకి చెందిన ఒక డాక్టర్ కొడుకుతో నిశ్చితార్థం జరిగింది. ఇద్దరు పిల్లలు పెళ్లిలు జరిపి వారిని ఒక ఇంటి వారిని చేశాడు. మరో ఇద్దరు పిల్లలు భావన, అర్జున్ విదేశాల్లో విద్యను అభ్యసిస్తున్నారు.
కీరవాణి ఇంట పెళ్లి సందడి:
ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి చిన్న కుమారుడు శ్రీసింహ కోడూరి వివాహం జరగనుంది. సీనియర్ నటుడు మురళీమోహన్ మనవరాలు మాగంటి రాగతో శ్రీసింహ పెళ్లి జరగనుంది. శ్రీ సింహా హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. మత్తు వదలరా మూవీలో హీరోగా మెప్పించాడు. ఆ సినిమాలో మంచి ప్రశంసలు అందుకున్నాడు. హీరోగా నిలదొక్కుకోవడానికి బాగానే కష్టపడుతున్నాడు. శ్రీ సింహ తెల్లవారితే గురువారం, దొంగలున్నారు జాగ్రత్త, భాగ్ సాలే, ఉస్తాద్ సినిమాలలో నటించాడు.
కెరీర్ స్టార్ కాకుండానే పెళ్లి పీటలెక్కుతున్నాడా? B
రౌడీ బాయ్స్ మూవీతో టాలీవుడ్ లో హీరోగా ఏంట్రీ ఇచ్చాడు ఆశిష్. తన నటనతో అందరికి దగ్గరయ్యాడు. త్వరలోనే సెల్ఫిష్ అనే మరో సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు. మూవీస్ లో ఇప్పడే కెరీర్ స్టార్ట్ చేసిన ఆశిష్ మరో వార్తతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇతడు త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు సమాచారం. ఏపీకి చెందిన ఓ వ్యాపార వేత్త కూతురితో పెళ్లి జరగనుందని తెలుస్తోంది. డిసెంబర్ లో నిశ్చితార్థం జరగుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న జైపూర్ లో పెళ్లి జరుగుతుందని సమాచారం. అయితే ఈ ఆశిష్ ఎవరో కాదు ప్రముఖ డైరెక్టర్ దిల్ రాజ్ సొదరుడి తనయుడు. ఆశిష్ మాత్రం స్టార్ అవ్వకుండానే పెళ్లి చేసుకోవటం అందరిని ఆశ్చర్యనికి గురిచేసింది. మరి ఈ వార్త నిజమో కాదో త్వరలోనే అర్థం అవుతుంది.
అమలా పాల్ రెండో పెళ్లి
రెండో పెళ్లి వార్తతో మన ముందుకు వచ్చింది అమలా పాల్. తన పుట్టిన రోజు వేడుకలలో ఈ విషయం బయటకు వచ్చింది. అమలా పాల్ ఈవెంట్ మేనేజర్ జగత్ దేశాయ్ ను పెళ్లాడనున్నది. వీరు కొన్ని రోజులు రిలేషన్ షిప్ లో ఉన్నారు. త్వరలో నిశ్చితార్థపు వేడుకతో మన ముందుకు రాబోతున్నారు.
పరిణీతి-రాఘవ్ చద్దా B
రీసెంట్ గా బాలీవుడ్ బ్యూటీ క్వీన్ పరిణీతి చోప్రా, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా ఏడడుగులు వేసి వివాహ బంధంతో ఒక్కటైనారు. వీరు కూడా ప్రేమించుకొని మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. వీరి పెళ్లి ఉదయ్ పూర్ లోని లీలా ప్యాలెస్ లో అంగరంగ వైభవంగా జరిగింది. ఇప్పటికి వారి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.