(Tej-Lav)
పెళ్ళి ఘడియలు దగ్గర పడుతున్న కొద్దీ మెగా ఫ్యామిలీలో సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. గతంలో నిహారిక పెళ్లికి జైపూర్ లో ఎంత హంగామా, హడావుడి చేశారో అంతకు మించిన హడావుడి చేస్తోంది నాగబాబు ఫ్యామిలీ. ఒక్కడే కొడుకు కావడం వాళ్లింట్లో ఆఖరి పెళ్లి కావడంతో నాగబాబు ఫ్యామిలీ పట్టలేని సంతోషానికి గురవుతోంది. ప్రిన్స్ వరుణ్ తేజ్ మనసును గెలుచుకున్న లావణ్య త్రిపాఠీ మూడు ముళ్ల బంధంతో మెగా ఇంటి కోడలుగా మారబోతోంది. ఇప్పటికే పరిమితమైన బంధుగణం, సన్నిహితులు డెస్టినేషన్ వెడ్డింగ్ కు హాజరు కావడానికి ఇటలీ చేరుకున్నారు. ఇటలీ లోని టస్కానీలో వరుణ్, లావణ్యల పెళ్లి పెద్దల సమక్షంలో అంగరంగ వైభంగా జరగనుంది. ఇటలీ నుంచి వచ్చాక హైదరాబాద్ ఎన్ కన్వెన్షన్ లో గ్రాండ్ రిసెప్షన్ కు కూడా ఇప్పటినుంచే ఏర్పాట్లు జరుగుతున్నాయి.
లావణ్యకోసం
లావణ్యను వరుణ్ తేజ్ లావీ అని ముద్దుగా పిలుస్తుంటాడు. ఇద్దరూ కలసి చేసినవి తక్కువ సినిమాలే అయినా ఇద్దరి మధ్యా మంచి కెమిస్ట్రీ ఉండటం, ఆ తర్వాత అది ప్రేమగా మారడంతో చివరకు పెళ్లికి దారి తీసింది. యూపీ లోని సంపన్న బ్రాహ్మణ కుటుంబానికి చెందిన లావణ్య పీజీ తర్వాత సినిమాలలోకి అడుగు పెట్టింది.
వరుణ్ పెళ్లి వేడుకల్లో క్లీంకార ఫోటో వైరల్ (Tej-Lav)
మెగా ఫ్యామిలీ వరుస శుభవార్తలతో ఆనందోత్సాహాలలో ఉంది. నేడు నాగబాబు పుట్టిన రోజు. బర్త్ డే వేడుకలు ఇటలీలో జరుగుతున్నాయి. చిరంజీవి ముద్దుల మనవ రాలు క్లీంకారతో సహా మెగా ఫ్యామిలీ అంతా ఇటలీ చేరుకున్నారు.అక్కడ హోటల్ లోని స్విమ్మింగ్ పూల్ దగ్గర తీసిన ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది. ఆ ఫోటోలను చెర్రీ, ఉపాసన తమ ఇన్ స్టాలో షేర్ చేశారు. ఫోటోని నేరుగా తీయకుండా స్విమ్మింగ్ పూల్ నీళ్లలో ప్రతిబింబాన్ని ఫోటో తీశారు. అందులో క్లీంకార్ ముఖం కనీ కనిపించకుండా ఉంది. క్లీంకార పుట్టాక బయటకు వచ్చిన తొట్ట తొలి ఫోటో ఇదే.మెగా వారసురాలి ఫోటో ఇలా బయటకు రావడంతో మెగా ఫ్యాన్స్ ఖుషీ ఫీలవుతున్నారు.
పెళ్లికి అంజనా దేవి దూరం…
మెగా స్టార్ కన్న తల్లి అంజనా దేవి మనవడి పెళ్లికి హాజరుకాలేకపోతుందట. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి రీత్యా ప్రయాణాలు చేయడం మంచిది కాదని వైద్యులు చెప్పడంతో ఆమె ఇక్కడే ఉండిపోయారు.. కుటుంబ సభ్యులు అందరూ ఇటలీకి వెళ్లినా అంజనా దేవి మాత్రం రెస్ట్ తీసుకుంటున్నారు. మనవడి పెళ్లి డైరెక్ట్ గా చూడలేకపోయినా ఇంట్లో టీవీలో బిగ్ స్క్రీన్ పై లైవ్ చూసే విధంగా ఏర్పాటు చేశారు.
లావణ్య స్టైలిష్ స్కార్ఫ్ ధర ఎంతంటే? (Tej-Lav)
మెగా ప్రిన్స్ వరుణ తేజ్ , లావణ్యల ఇటలీ టూర్ లో లావణ్య ధరించిన స్కార్ఫ్ పైనే అందరి దృష్టి పడింది.ఆమె ధరించిన స్కార్ఫ్ ఇప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారింది. మెగా కోడలు కాకముందే ఖరీదైన స్కార్ఫ్ ధరించి వార్తల్లో నిలిచింది. గోధుమ రంగు బ్యాగీ హ్యాంగింగ్ డ్రెస్ తో పాటు అదే రంగు లూయిస్ విట్టన్ ఎసెన్షియల్ స్కార్ఫ్ ధరించింది లావణ్య. ఎయిర్ పోర్ట్ లో లావణ్య వెళిపోతుండగా మీడియా వర్గాలు ఫోటో తీశారు. అందులో కనపడిన ఆమె స్కార్ఫ్ రేట్ తెలిస్తే గుండె జల్లు మనాల్సిందే.. మెగా కోడలు కాకముందే ఖరీదైన దుస్తులతో అందరికి షాక్ ఇచ్చింది లావణ్య. లావణ్య ధరించిన ఆ స్కార్ఫ్ ధర ఏకంగా రూ. 52,500. ఆఫ్టరాల్ ఒక స్కార్ఫ్ కి అంత రేటా? అని లావణ్య ఫ్యాన్స్ విస్తుబోతున్నారు. ఆ సొమ్ముతో ఏకంగా ఓ ఐ ఫోన్ వచ్చేస్తుంది అని నోరెళ్లబెడుతున్నారు.