Pineapple
పైనాపిల్… దీనిని తెలుగులో అనాస పండు అని కూడా అంటారు. ఇది వర్షాకాలంలో విరివిగా దొరుకుతుంది. కోయడం కాస్త కష్టమే కానీ పైనాపిల్ యొక్క రుచే వేరు. పుల్లపుల్లగా తియ్యతియ్యగా తింటుంటే తినాలనిపించే ఈ పండులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. దీనిని సలాడ్లో లేదా ముక్కలుగా కట్ చేసుకుని తినవచ్చు. జ్యూస్ గా చేసుకుని తీసుకోవచ్చు. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అందుకే హెల్తీయెస్ట్ ఫ్రూట్స్ లో పైనాపిల్ ఒకటి. దీనిలో విటమిన్ ఎ, విటమిన్ సి తో పాటు కాల్షియం, ఐరన్, సోడియం వంటి మినరల్స్ కూడా అధిక మొత్తంలో ఉంటాయి. దీనిలో శరీరానికి అవసరమయ్యే అనేక రకాల పోషకాలు ఉంటాయి. పైనాపిల్ ను తరచూ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మానసిక ఒత్తిడి, ఆందోళనలు కూడా తగ్గుతాయి.
పుష్కలంగా నిండి ఉన్న పోషక విలువలు… Pineapple
అనాసపండులో కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, సోడియం, పొటాషియం, మాంగనీస్, కెరోటిన్, ప్రోటీన్, ఫైబర్, విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, శక్తి వంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా బోలెడన్ని పోషకాలు నిండి ఉంటాయి. పైనాపిల్లో నీరు 87.8 గ్రాములు (ప్రతి 100 గ్రాముల పండులో), ప్రొటీన్ 0.4 మి.గ్రా, కొవ్వు 0.1 మి.గ్రా, పిండి పదార్థం 10.8 మి.గ్రా, కాల్షియం 20 మి.గ్రా, పాస్పరస్ 9 మి.గ్రా, ఐరన్ 2.4 మి.గ్రా, సోడియం 34.7 మి.గ్రా, పొటాషియం 37 మి.గ్రా, మాంగనీస్ 0.56 మి.గ్రా, కెరోటిన్ 18 మైక్రోగ్రాములు, శక్తి 46 కిలో కాలరీలు ఉంటాయి.
అనాసతో ఆరోగ్య ప్రయోజనాలేన్నోతెలుసా…
ఆనారోగ్య సమస్యల నుండి రక్షించడంలో మరియు రోగనిరోధక శక్తిని పెంచడంలో పైనాపిల్ ఎంతగానో సహయపడుతుంది. దీనిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది పేగులను ఆరోగ్యంగా ఉండేలా పనిచేస్తుంది. అజీర్ణం, మలబద్ధకం వంటి జీర్ణసమస్యల నుండి బయటపడేలా చేస్తుంది. దీనిలో బ్రోమెలైన్ ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్ధను ఆరోగ్యంగా ఉంచడంలో సహయపడుతుంది. మరియు నొప్పి, వాపు వంటి ఆర్థరైటిస్ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. బ్రోమెలైన్ గుండె ఆరోగ్యనికి ఎంతో మంచిది. ఇది గుండె సమస్యలకు రక్షణగా పనిచేస్తుంది. గుండెని ఆరోగ్యంగా ఉంచడంలో ఎంతగానో సహయపడుతుంది. మరియు రక్తాన్ని గడ్డ కట్టకుండా కాపాడుతుంది. పైనాపిల్ ఉండే కొన్ని లక్షణాలు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి క్యాన్సర్ ప్రమాదం నుండి రక్షించడానికి పనిచేస్తుంది. ఇందులో కాల్షియం అధికంగా ఉంటంది. పెరిగే పిల్లలకూ, వృద్ధులకు ఇది చాలా మంచిది. బలహీనమైన ఎముకలను బలపరచడంలో , ఇతర ఎముకల సమస్యల నుండి బయటపడేందుకు ఇందులో కాల్షియం చాలా బాగా పనిచేస్తుంది. కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం కలిగిస్తుంది.
దీనిలో పోటాషియం సమృద్ధిగా ఉండడం వల్ల మూత్రపిండ వ్యాధులకు మరియు మూత్ర ప్రక్రియ సరిగా లేని వారికి చక్కటి ఫలితాన్నిస్తుంది. మరియు కడుపులోని పురుగుల్నీ చంపేస్తుంది. ఇందులోని రసాయనాలు మూత్రపిండాలను ప్రేరేపించి శరీరంలోని మలినాలను తొలగిపోయేలా చేస్తుంది. రక్తహీనతతో బాధపడే వారికి పైనాపిల్ ఎంతగానో సహయపడుతుంది. పంటి వ్యాధులతో భాధపడేవారిలో వాపులు, మంటలు, నొప్పులు ఎక్కువ. దీనిలో ఉండే విటమిన్-సి బ్యాక్టీరియాతో పోరాడి చిగుళ్ల సమస్యలను నివారిస్తుంది. గొంతునొప్పి, సైనసైటిస్, బ్రాంకైటిస్ వంటి శ్వాసకోస వ్యాధుల నియంత్రణలో కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. తాజా అనాసపండు రసాన్ని నోట్లో పోసుకుని పుక్కిలించడం వల్ల గొంతునొప్పి, టాన్సిల్స్ నివారణ అవుతుంది. దగ్గుకీ, జలుబుకీ మంచి ఔషధంలా పని చేస్తుంది. అంతే కాకుండా ఆడవారికి నెలసరి సక్రమంగా వచ్చేందుకు తోడ్పడుతుంది. పచ్చకామెర్లు, కాలేయం వ్యాధులున్నవారు ప్రతిరోజు ఈ రసాన్ని తీసుకోవడం వల్ల మంచి ఫలితం లభిస్తుంది.
అందాన్ని పెంచుకోవాలంటే అనాస తినాల్సిందే… Pineapple
ఈ పండు ఆరోగ్యనికే కాదు అందానికి కూడా ఔషధంలా పనిచేస్తుంది. దీని రసాన్ని ముఖానికి రాసుకుని మర్థన చేస్తే ముఖ చర్మం కోమలంగా, అందంగా తయారవుతుంది. దీనిలోని ఎంజైమ్స్ ముఖం మరియు చర్మంలో నిర్జీవ కణాలను తొలగిస్తాయి. అంతే కాకుండా మొటిమలు, నల్లమచ్చలు వంటి వాటిని కూడా తొలగిస్తుంది. దీనిలో ఉండే మ్యాంగనీస్ విటమిన్ సి తో కలిసి చర్మం నిగనిగలాడేలా చేస్తుంది.
వీరు దూరంగా ఉండటమే మంచిది…
గర్భం దాల్చిన మహిళలు పైనాపిల్ కు దూరంగా ఉండటమే మంచిది. దీనిని తీనడం వల్ల గర్భస్రావమయ్యే ప్రమాదముంటుంది. నెలలు నిండే కొద్ది ప్రమాద స్ధాయి తగ్గుతుంది కాబట్టి తరువాత నెలల్లో ఎటువంటి భయం లేకుండా తినొచ్చు. ఎదైనా ఆనారోగ్య సమస్యలకు మెడిసిన్ వాడేవారు దీనిని తీనకపోవడమే మంచిది. ఆల్కహాల్ తో కూడా పైనాపిల్ ఇంటరాక్ట్ అవడం వల్ల కొన్ని రకాల దుష్ప్రభావాలు ఉన్నాయి. రక్తానికి సంబంధించిన మందులను వాడేటప్పుడు పైనాపిల్ ని పూర్తిగా నిర్మూలించాలి. ఆల్కహాల్ తో కూడా పైనాపిల్ ఇంటరాక్ట్ అవడం వల్ల కొన్ని రకాల దుష్ప్రభావాలు ఉన్నాయి. ఇతర సమస్యలతో భాధపడేవారు వివిధ రకాల ఔషధాలను వాడేవారు పైనాపిల్ ని ఆహరంలో భాగంగా చేర్చకోవాలనుకుంటే వైధ్యులను సంప్రదించడం మంచిది. Pineapple