ఇంతవరకు డ్రోన్ (Drone) అంటే గాలిలో ఎగిరేది, ఫోటోస్, విడియోస్ తిసేది, పంట పోలాల్లో మందలు చల్లేవి, ఆర్మీలో పనిచేసే డ్రోన్ గురించి ఇన్నాళ్లు విన్నారు, చూశారు. పక్షిలా గాలిలో విహరిస్తూ ఫొటోలూ, వీడియోలూ తీసే డ్రోన్లనే మనం చూశాం. కానీ నీటిలో చేపలా ఈదుతూ అక్కడి అందాలను బంధించే డ్రోన్లూ ఇప్పుడు వస్తున్నాయి. చైనీస్ తయారీదారు యూకాన్ రోబోటిక్స్ పారిశ్రామిక దిగ్గజం ఓమ్నిడైరెక్షనల్ అండర్ వాటర్ డ్రోన్, ఓషన్ ఐ ని ఆవిష్కరించింది.
ప్రో కన్ స్యూమర్ ఓరియెంటెడ్ BW స్పేస్ ప్రో అండర్ వాటర్ డ్రోన్ ఓషన్‌ఐ పేరుతో యు కేన్ రోబోటిక్స్ సంస్థ రూపొందించింది. UAV డ్రోన్ నీటి అడుగున భూభాగాల సర్వేలు చేయడానికి ఎంతో ఉపయోగం పడుతుంది.
ఓషన్ ఐ డ్రోన్ ఏమిటంటే…. Drone
పెద్ద పెద్ద మహా సముద్రపు నీటి అడుగున కు వెళ్లి అక్కడి నీటి ఒత్తిడిని సైతం తట్టుకుని దీనికి ఉన్న 4కె రిజల్యూషన్ కెమెరాతో పాటు, హై లో బీమ్ ల ఎల్ యీడీ లైట్లతో చీకటి ప్రదేశాల్లో కి వెళ్లి అక్కడి మసక మసక గా ఉన్న దృశ్యాలను కూడా స్పష్టంగా తీసి పంపిస్తుంది. ఈ డ్రోన్ ను మనం నీటి ఒడ్డున ఉండి జాయ్ స్టిక్ లాంటి రిమోట్ సాయంతో నియంత్రిచవచ్చు. 360 డిగ్రీల కోణంలో డ్రోన్ తిరిగి కావలసిన ఫుటేజీని చిత్రికరించి మనకు పంపిస్తుంది. ఇందులో 64 జీబీ మెమరీ ఉంటుంది. నీటి అడుగున ఉన్న వస్తువులను తిరిగి పొందడానికి ఇది ఉపయోగ పడుతుంది. అంతే కాకుండా సముద్రంలో అరుదైన మత్స్య సంపదను గుర్తించడం కోసం, అరుదైన జంతు జాలం గుర్తించడం కోసం మనుషులు వెళ్లలేని చీకటి ప్రాంతాలకు వెళ్లి అక్కడ అన్వేషణ చేసి మనకు కావలిసిన సమాచారం అందిస్తుంది.
ఓషన్‌ఐ డ్రోన్ ప్రత్యేకతలు……
ఓషన్‌ఐ యొక్క అత్యంత ప్రత్యేక లక్షణాలలో ఒకటి దాని నాలుగు థ్రస్ట్-వెక్టరింగ్ మోటార్ పాడ్లు. ఈ డ్రోన్‌కు 360 డిగ్రీలో తిరిగే ఫీచర్ ఉంది. దానికి ఉన్న ఎనిమిది మోటార్ల కోసం ప్రతి ఒక్కటి దానికి ఎదురుగా రెండు మోటార్లను కలిగి ఉంటుంది. క్రాఫ్ట్ సెకనుకు 2 మీటర్లు 6.6 అడుగులు టాప్ ఫార్వర్డ్ వేగంతో లోపలికి వెళుతుంది. 100 మీటర్లు నుంచి 328 అడుగుల లోతు వేళ్లే విధంగా డ్రోన్ తయారు చేశారు. నీటి నుండి బయటకు వచ్చినప్పుడు, డ్రోన్ 5.6 కిలోల 12.3 పౌండ్లు బరువు ఉంటుంది.ఈ డ్రోన్ 10 నుండి 40ºC 14నుండి 104 ºFవరకు నీటి ఉష్ణోగ్రతలలో తట్టుకోగలుగుతుంది.దాని 10,000-MAHలిథియం బ్యాటరీ యొక్క ఒక ఛార్జ్ 30 నిమిషాల నుండి ఒక గంట రన్ టైమ్ వరకు ఉంటుందని అంతవరకు ఎలాంటి అంతరాయం లేకుండా పని చేస్తుంది.
ఈ డ్రోన్ ధర ఎంత? Drone
ఓషన్‌ఐ అండర్ వాటర్ డ్రోన్ youcanrobotics.com వెబ్సైట్లో అందుబాటులో ఉంది. నలుపు, ఆరెంజ్ కలర్ లో డ్రోన్ లు అందుబాటులో ఉన్నాయి 4k ప్రైమ్ లెన్స్ వేరియంట్ ధర US$5,499, 4k జూమ్ లెన్స్ వేరియంట్ ధర US $5,999 వరకు ధరలు ఉన్నాయి. ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే రూ.4.6 లక్షలు ఖరీదు చేయవచ్చు.