Mega
ఇటలీలో గ్రాండ్ గా జరుగుతున్న వరుణ తేజ్, లావణ్య త్రిపాఠీల పెళ్లికి పవన్ కల్యాణ్ మాజీ భార్య అంటే వరుణ్ తేజ్ పిన్ని అయిన రేణూ దేశాయ్ వెళ్లటం లేదు. మెగా ఫ్యామిలీ నుంచి ఆమెకు ఇన్విటేషన్ ఉందో లేదో కూడా తెలీదు. మొత్తానికి పెళ్లికి అయితే వెళ్లడం లేదని ఆమె సోషల్ మీడియాలో క్లారిటీ ఇచ్చారు. వరుణ్ 8 ఏళ్ల నుంచి తనకు తెలుసునని చాలా సార్లు ఎత్తుకు తిప్పాననీ ఆమె చెప్పారు. చిన్నప్పుడు తనతో చాలా క్లోజ్ గా ఉండేవాడని, మంచి కుర్రాడనీ కితాబిచ్చారు రేణూ.
లావణ్యతో వరుణ్ జీవితం హాయిగా సాగిపోవాలని, కొత్త జంట అన్యోన్యంగా కాపురం చేయాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. పెళ్లికి తాను వెళ్లడం లేదని, నిహారిక పెళ్లికి కూడా తాను వెళ్ల లేదని కేవలం పిల్లలను పంపినట్లు తెలిపారు. అప్పటినుంచి ఆమె అదే దూరం మెయిన్ టెయిన్ చేస్తూ వచ్చారు. హైదరాబాద్ సిటీకి షూటింగ్ పరంగా వచ్చినా కూడ ఆమె మెగా ఫ్యామిలీని కలవరు అని తెలుస్తోంది.
పవన్ పై నో కామెంట్ అన్న రేణూ Mega
రేణూ దేశాయ్ ఇటీవల సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. పవన్ ను ఒక నాయకుడిగా చూస్తారా? ఆయన గెలిచి సీఎం అవ్వాలని కోరుకుంటారా అన్న ప్రశ్నకు నో కామెంట్ అని సమాధాన మిచ్చారు. తాను ఏమీ కోరుకోనని, దేవుడే అన్నీ చూసుకుంటాడనీ సమాధానమిచ్చారు. తల రాత ఎలా ఉంటే అలా జరుగుతుందన్నది రేణూ దేశాయ్ భావన కాబోలు. రేణూ దేశాయ్ ఓ మీడియా ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలన్నీ వెల్లడించారు. చాలా లావుగా కనిపిస్తున్నారేంటి అన్న ప్రశ్నకు తనకు గుండె జబ్బు ఉందని , దానికోసం మందులు వాడుతూ, రెస్ట్ గా ఉండటం వల్ల తాను లావెక్కినట్లు రేణూ తెలిపారు. తన కుటుంబంలో ఇది వారసత్వంగా వస్తోందని, తన జీవితం పై కూడా తనకు భయాలున్నాయని ఆమె అన్నారు. పిల్లలు ఇంకా సెటిల్ కాలేదని ఆ బెంగే తనను వేధిస్తుందని రేణూ అన్నారు.
మూడో భార్యతో కలసి పెళ్లికి పవన్
రేణూ దేశాయ్ అత్తవారి కుటుంబంతో సత్సంబంధాలు కలిగి ఉండకపోయినా పిల్లలు అకీరా, ఆద్య మాత్రం మెగా ఫ్యామిలీతో బానే ఉంటారు. అన్ని వేడుకలకు హాజరు అవుతుంటారు. నిహారిక పెళ్లికి పవన్ వెంట ఆద్య వెళుతున్న వీడియోలు గతంలో లీక్ అయ్యాయి. అయితే ఈసారి వరుణ్ తేజ్ పెళ్లికి పవన్ తన మూడవ భార్య అన్నా లెజినోవాతో కలసి వెళుతున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎయిర్ పోర్టులో వారిద్దరూ కలసి వెళుతున్న ఆ ఫొటో నెట్టింట వైరల్ గా మారింది. ఆఫొటోలో లెజినోవా చాలా లావుగా కనిపించారు.
దాంతో ఆమె బాగా ఒళ్లు చేశారంటూ నెటిజన్లు కామెంట్లు కూడా పెట్టారు. ఇప్పుడు వరుణ్ తేజ్ పెళ్లికి అకీరా, ఆద్యా వెళ్లారో లేదో తెలీదు.అన్నాలెజినోవా మెగా ఫ్యామిలీతో మాత్రం చాలా సన్నిహితంగా మెదులుతారు. వారి ఇంట్లో ప్రతీ కార్యక్రమానికి చీరకట్టుతో హాజరయి సందడి చేస్తుంటారు. గతంలో శ్రీజ పెళ్లి ఫొటోల్లోనూ ఆమె కనిపించారు.
మొత్తం మీద వరుణ్ తేజ్ పెళ్లికి నానమ్మ అంజనా దేవి కూడా వెళ్లడం లేదు. వయసు రీత్యా ఆమె ప్రయాణాలు చేయలేక ఇంట్లోనే ఉండిపోయారు. ఆ పెళ్లి వేడుకలను ఇంటినుంచే లైవ్ లో తిలకించే ఏర్పాట్లు చేశారు. మెగా ప్రిన్స్ వరుణ తేజ్ పెళ్లికి అత్తా కోడళ్లు వెళ్లకపోవడం విచిత్రమే! Mega