మొత్తానికి చంద్రబాబు (cbn) బెయిల్ మీద బయటకొచ్చారు.అభిమానుల ఆనందానికి హద్దే లేదు.. జైలు దగ్గర పండగ వాతావరణం కనిపించింది. కానీ ఆయన ముఖం చూడక కరువు వాచిపోయిన వారికి మాత్రం ఆయన నీరస పడ్డట్టే కనిపించారు. మనవడు దేవాంష్ కూడా జైలు దగ్గరకొచ్చే తాతయ్యను కలిశాడు. విదేశాలకెళ్లాడంటూ మనవడికి సర్ది చెబుతున్నానన్న భువనేశ్వరి మరిప్పుడు ఏం చెబుతారో? చంద్రబాబు సొంత డబ్బా కొట్టుకోడం బాగా అలవాటు. తన 40 ఏళ్ల ఇండస్ట్రీని పదే పదే చెప్పుకుని, హైటెక్ సిటీని తానే కట్టానని, మెట్రో రైల్ తానే వేశాననీ, ఇలా అనేకానేక క్రెడిట్లు తన అక్కౌంట్ లో వేసుకోవడం అలవోకగా అలవాటైపోయింది ఆయనకి. అందుకే స్కిల్ స్కామ్ కేసులో ఆయన తప్పు చేశారనడానికి బొచ్చెడు ఆధారాలున్నా.. ఆయన మనస్సాక్షి తప్పును అంగీకరించడానికి సిద్ధపడలేదు. అహం అడ్డొచ్చింది. దాంతో తాను నిప్పు, తప్పు చేయలేదు అంటూ జైలునుంచి బయటకొచ్చి కూడా అదే పాట పాడారు.
మరి తప్పు చేయకపోతే బెయిల్ ఎందుకు ఆయనకు త్వరగా రాలేదు అన్న ప్రశ్నకు టీడీపీ శ్రేణుల దగ్గర సమాధానం లేదు. ఇక ఈ మొత్తం ఎపిసోడ్ లో లోకేష్ మాటలు విని చిన్న పిల్లలు కూడా నవ్వుకుంటున్నారు. చంద్రబాబు బెయిల్ కి అప్లయ్ చేయరని, ఆయన నిర్దోషిగానే బయటకు వస్తారనీ గొప్పలు చెప్పాడు. కానీ ఏసీబీ కోర్టునుంచి హై కోర్టు వరకూ చివరకు సుప్రీం కోర్టులో కూడా స్కిల్ స్కామ్ లో మాములుగా బెయిల్ రాదని స్పష్టంగా తేలిపోయాక ఆయన అనారోగ్యం పేరు చెప్పుకుని బయటపడే యత్నం చేశారు. మామూలుగా బెయిల్ రాదని, వయసును, అనారోగ్యాన్ని చూపిస్తే వస్తుందని మొదటనుంచి ఉండవల్లి లాంటి ప్రముఖులు సైతం డిబేట్లలో చెబుతూనే ఉన్నారు. అయితే చంద్రబాబు జైలుకెళ్లడం సింపతీగా టర్న్ అవుతుందేమోనని టీడీపీ శ్రేణులు ఆశపడ్డాయి. కానీ పరిస్థితి తల్లకిందులవుతోందని , పార్టీయే గల్లంతయ్యే ప్రమాదముందని తేలాక ఆయన భద్రత పై గొడవ చేయడం మొదలు పెట్టారు.
అనారోగ్యాల జాబితా చాంతాడంత! (cbn)
జైలులో భద్రత కరువైందని, ఆయనకు కళ్లు కనిపించడం లేదని, గుండెజబ్బు ఉందనీ, చర్మంపై రాషెస్ వచ్చాయని, దోమలు కరుస్తున్నాయని, వాటర్ ట్యాంకులో నీరు బాలేదని, జైలు పై డ్రోన్లు ఎగరేస్తున్నారని, జైలులోకి గంజాయి సప్లయ్ అవుతోందని, స్మగ్లర్లు, కిరాయి హంతకులు ఉన్న జైల్లో14 ఏళ్లు సీఎంగా చేసిన ఆయన్ను పెట్టారని ఇలా ఒకటి కాదు.. ఒక తీరు కాదు.. నోటికొచ్చినన్నిఆరోపణలు చేస్తూనే ఉన్నారు. మొదట్లోనే ఆయనకు అనారోగ్యం ఉందని చెప్పి ఉంటే వారం, పదిరోజుల్లోనే బెయిల్ వచ్చేసేది. జైలుకు ముందు వరకూ తాను నవయువకుడినని, తనతో ఎవరూ పోటీ పడలేరని బహిరంగ సభల్లో చంద్రబాబు చెబుతూ ఉండేవారు. తన వయసు 70 దాటినా తన మానసిక, శారీరిక శక్తి, తెలివి తేటలు, సమర్ధత విషయంలో జగన్ ఎందుకూ పనికి రాడని పదే పదే చెబుతూ ఉండేవారు. తీరా జైలులో పడ్డాక అమ్మో, నాయనో అంటూ ఆపసోపాలు పడ్డారు.
నో ఛేంజ్… అదే యాటిట్యూడ్
చంద్రబాబు (cbn) లాంటి వ్యక్తి జైలు కెళ్లి బయటకు వచ్చాక ఆయన ముఖ కవళికలు చూడాలని చాలా మంది ఆసక్తిగా టీవీ స్క్రీన్లకు అతుక్కుని మరీ చూశారు. జైలు కెళ్లిన పశ్చాత్తాపం కానీ,చిన్నతనంగానీ ఆయనలో కనిపించలేదు సరికదా.. ఇంకా తనను అన్యాయంగానే జైలులో పెట్టారన్న భావనలోనే ఆయన బాడీ లాంగ్వేజ్ ఉంది. విడుదల సందర్భంగా హై కోర్టు విధించిన షరతులను ఉల్లంఘించి జైలు ప్రాంగణంలోనే ఆయన మీడియాతో, పబ్లిక్ తో మాట్లాడటం తెలుగు దేశం తెంపరి తనానికి నిదర్శనం. ఈనెల9న రెగ్యులర్ బెయిల్ వస్తే ఇక ఆయన జైలు ముఖం మళ్లీ చూడరు.కాకపోతే కేసులు మాత్రం వెంటాడతాయి. ఏది ఏమైనా.. తాను నిప్పు, నిజాయితీ పరుడినని చెప్పుకునే చంద్రబాబు కెరీర్ లో 53 రోజుల జైలు జీవితం ఒక మాయని మచ్చే!