(Steps)
ప్రతి వ్యక్తి తనను తాను ఆరోగ్యంగాను, ఫిట్ గాను ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. దీని కోసం వారు వివిధ రకాల వ్యాయామాలు కూడా చేస్తారు. ప్రతిరోజు ఉరుకుల పరుగుల జీవితంలో, అనేక రకాల పనులతో అలసిపోయేవారు. అలసట లేకుండా ఉండడం కోసం, ఆరోగ్యం కోసం రోజు నడవాలి అని చెబుతున్నారు వైద్యులు. ఆరోగ్యంగా ఉండడానికి ప్రతిరోజు కఠినమైన దినచర్య పాటించనవసరం లేదు. ఎంత బిజీ షెడ్యూలు ఉన్నప్పటికీ కొంత సమయాన్ని మీ ఆరోగ్యం కోసం, ఫిట్నెస్ కోసం కేటాయిస్తే మంచిది. ప్రతిరోజు కేవలం ఒక గంట సేపు నడక మిమ్మల్ని ఫిట్ గాను, ఆరోగ్యంగాను ఉంచుతుంది. అనేక వ్యాధుల నుండి మిమ్మల్ని కాపాడుతుంది అయితే ప్రతిరోజు ఎంతసేపు ఏ సమయంలో నడవడం వల్ల శరీరానికి మేలు జరుగుతుందో తెలుసుకుందాం.
ఏలాంటి సమయంలో వాకింగ్ చేయాలి (Steps)
నడకతో రోజును ప్రారంభిస్తే రోజంతా ఎనర్జిటిక్ గా ఉంటారు. పాజిటివ్ గా కూడా ఫీలవుతారు. ప్రతిరోజు ఉదయం వాకింగ్ చేయడం వల్ల మీ గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మీ బాడీలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. జీర్ణవ్యవస్థకు సంబంధించిన అనేక సమస్యలకు కూడా పరిష్కారం లభిస్తుంది. ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం, మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత వాకింగ్ చేయడం ఎంతో మంచిది. ఉదయం నడవడానికి మీకు టైమ్ దొరక్కపోతే సాయంత్రం ఒక అరగంట పాటు నడిస్తే మంచిది. సాధారణంగా ఆరోగ్యంగా ఉండాలంటే మనం తీసుకునే ఫుడ్, లైఫ్ స్టైల్ కీ రోల్ ప్లే చేస్తాయి. అదే విధంగా స్ట్రెస్ లేకుండా ఉండాలి. మంచి నిద్ర కూడా ఆరోగ్యానికి చాలా అవసరం. అలానే వ్యాయామం కూడా మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. ప్రతిరోజు నడవడం వల్ల మీ బాడీని మీరు కచ్చితంగా లైట్ గా ఫీల్ అవుతారు. అయితే వాకింగ్ చేసేవాళ్ళు ప్రతీరోజూ క్రమం తప్పకుండా వాకింగ్ చెయ్యాలి. కొద్ది రోజులు వాకింగ్ చెయ్యటం, కొద్ది రోజులు మానెయ్యటంలాంటివి చెయ్యకూడదు. అలా చేస్తే ఏ విధమైన రిజల్ట్ ఉండదు.
రోజుకి ఎన్ని అడుగులు వేయాలి (Steps)
చాలా మందికి ఈ అనుమానం ఉంటుంది. ఆరోగ్యంగా ఉండాలంటే ఎంత దూరం నడవాలి అని తెగ ఆలోచిస్తూ ఉంటారు. వ్యాయామం చేయడం వల్ల చాలా ప్రయోజనాలని మనం పొందొచ్చు. అయితే ఎన్ని అడుగులు వేస్తే మన ఆరోగ్యానికి మంచిది. కేవలం ఆరోగ్యంగా ఫిట్ గా మాత్రమే కాకుండా ఎన్నో అనారోగ్య సమస్యలు మన దరిచేరకుండా జాగ్రత్తగా ఉండొచ్చు. ఎంత బిజీ షెడ్యూలు ఉన్నప్పటికీ కొంత టైంని మీ ఆరోగ్యం కోసం, ఫిట్నెస్ కోసం కేటాయిస్తే మంచిది. ప్రతిరోజు కేవలం ఒక గంట సేపు నడక మిమ్మల్ని చాలా ఫిట్ గాను, ఆరోగ్యంగాను ఉంచుతుంది. అనేక వ్యాధుల నుండి మిమ్మల్ని కాపాడుతుంది. దీని కోసం ప్రతిరోజు ఉరుకుల పరుగుల జీవితంలో రకరకాల పనులతో అలసిపోయేవారు అలసట లేకుండా ఉండడం కోసం, సమస్యల నుంచి రిలీఫ్ కోసం, ఆరోగ్యం కోసం రోజు నడవాలి అని చెబుతున్నారు వైద్యులు. రోజుకి పదివేల అడుగులు నడవడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. స్మార్ట్ వాచ్ ఉంటే ఈ అడుగుల లెక్కను తెలుసుకోవడం సులువే. పదివేల అడుగుల నడక మనల్ని శారీరకంగా, మానసికంగా, సామాజికంగాను ఉంచడంలో బాగా హెల్ప్ అవుతుంది.
అడుగులతో ఆరోగ్య ప్రయోజనాలు
రోజువారీ వ్యాయామాలతో పాటు నడక అలవర్చుకుంటే చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ప్రశాంతమైన నిద్ర, ఉత్సాహంగా ఉంటారు. హార్ట్ స్టోృక్ వచ్చే అవకాశం తగ్గుతుంది. వాకింగ్, స్మిమ్మింగ్ లాంటివి చేయడం వల్ల హృదయ నాళాల, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది.ప్రతిరోజు స్వచ్ఛమైన గాలికి సూర్యరశ్మిలో అలా కొద్దిసేపు నడిస్తే ఒత్తిడి తగ్గుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. అల్జీమర్స్ వచ్చే అవాకాశం తగ్గుతుంది. 71 నుంచి 93 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారిలో ప్రతిరోజు కనీసం 0.3కిలో మీటర్లు నడిచిన వారిలో అల్జీమర్స్ వచ్చే అవకాశం నడవని వారి కంటే తక్కువగా ఉందని వర్జీనియా యూనివర్సిటీ పరిశోధనలో తేలింది. ప్రతిరోజు నడిస్తే గుండె నాళాల ఆరోగ్యం మెరుగుపడుతుంది. తద్వారా గుండె జబ్బులు, ఊబకాయం తదితర దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే ఛాన్స్ తగ్గుతుంది. కొవ్వు తగ్గుతుంది ప్రతిరోజు నడిచి మనం తినేదాని కన్నా ఎక్కువ క్యాలరీలు కరిగిస్తే శరీరంలో ఉన్న కొవ్వు తగ్గి కండరాలు గట్టిపడతాయి.