Niharika
ఎప్పుడూ తన అల్లరి చేష్టలు, చిలిపి పనులతో వార్తల్లో ఉండే మెగా డాటర్ నిహారికా కొణిదెల గాసిపర్స్ కి బోలెడు స్టఫ్ అందిస్తుంటుంది. తాజాగా అన్నయ్య పెళ్లి వేడుకలో మంచి ఫన్, ఎంటర్ టైన్ మెంట్ అందిస్తోంది. ఒక్కగానొక్క అన్న పెళ్లిలో ప్రతీ మూమెంట్ ను ఎంజాయ్ చేస్తూ ఇటలీలో నానా హంగామా చేస్తోంది. అయితే ఈసారి తన బంధువులలో ఒకరితో డేటింగ్ లో ఉన్నట్లు ఫోటోలు విడుదల అవడం సంచలనం గా మారింది. ఇటలీలో మంచి లొకేషన్లలో ఆ అబ్బాయితో కలసి చెట్టా పట్టాలేసుకు తిరుగుతున్న నిహారిక అతగాడితో లంచ్ కి, డిన్నర్ కి కూడా వెళుతూ ఆ ఫొటోలను ఇన్ స్టా లో షేర్ చేస్తోంది.Niharika
వారిద్దరు కొంత కాలంగా క్లోజ్ గా మూవ్ అవుతున్నారని తొందరలోనే పెళ్లి కూడా చేసుకుంటారనీ ఊహాగానాలు రేగుతున్నాయ్. ఇంతకీ నీహారిక తో చనువుగా ఉంటున్న ఆ హీరో ఎవరు? చాలా మందికి కలిగే సందేహం ఇది.. అతగాడు మరెవరో కాదు.. నాగబాబు మేనల్లుడైన పంజా వైష్ణవ్ తేజ్. సాయిధరమ్ తేజ్ తమ్ముడైన వైష్ణవ్ రెండు,మూడు సినిమలతో టాలీవుడ్ లో బానే పేరు సంపాదించుకున్నాడు. వైష్ణవ్ తేజ్ తో లంచ్, డిన్నర్ ఫోటోలను నిహారిక తన ఇన్ ష్టా లో షేర్ చేయడం చూసిన ఫ్యాన్స్ ఆమె అతడిని పెళ్లి చేసుకుంటుందేమో అని కామెంట్లు పెడుతున్నారు. నిజానికి నీహారిక వైష్ణవ్ తేజ్ ను చేసుకున్నా తప్పులేదు. ఎందుకంటే అతడు వరసకు బావ అవుతాడు. చిరంజీవి సోదరి కొడుకే కావడంతో బావా, మరదళ్ల బంధం వారిది…
కెరీర్ ను బిజీగా మార్చుకున్న బ్యూటీ Niharika
మొదటి పెళ్లి నిహారికకు అచ్చి రాలేదు. జొన్నలగడ్డ చైతన్యను చేసుకుని రెండేళ్లయినా కాపురం చేయకుండానే విడాకులు తీసేసుకుంది. అప్పటినుంచి సినిమాలు, సీరియళ్లు, షార్ట్ ఫిలింలు అంటూ హడావుడి పడుతోంది. తన లైఫ్ ను బిజీగా మార్చేసుకుంది. ఇప్పుడు వైష్ణవ్ తో కలసి తిరగడం చూస్తుంటే పెళ్లి చేసుకుంటుందేమో అనే డౌట్లు ప్రేక్షకులకు పెరుగుతున్నాయ్. … మీ రెండో భర్త ఇతడేనా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. త్వరలోనే నిహారిక- వైష్ణవ్ లు పెళ్లి చేసుకుంటున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. బావ మరదళ్లు అంటే గాసిప్స్ రావటం కామన్. ఇండస్ట్రీలో బావ మరదళ్లు అయిన నిహారిక-వైష్ణవ్ తేజ్ పై అందుకే ఇలాంటి పుకార్లు వస్తున్నాయ్.. మరి పుకార్లుకు వైష్ణవ్ కానీ నిహారిక కానీ స్పందిస్తే ఒక క్లారిటీ వస్తుంది.
నాగబాబుకు పంచ ప్రాణాలు
ప్రస్తుతానికైతే నిహారిక సినిమాల్లో పెద్దగా రాణించలేకపోయినా షార్టు ఫిలింలు, వెబ్ సీరీస్ లలో బిజీగా ఉంటోంది. లైఫ్ ను చాలా ఈజీ గా తీసుకుంటూ ఎంజాయ్ చేయాలి అనే భావనలో ఉండే ఈ ముద్దుగుమ్మ అంటే నాగబాబుకు విపరీతమైన ప్రేమాభిమానాలు. తన కుమార్తెకు కష్టం కలిగించే పని ఏదీ తాను చేయబోదని తన కెరీర్ ను తాను చక్క దిద్దుకోగలదనీ చెబుతుంటారు నాగబాబు. మరినిహారిక , బావను పెళ్లాడతానంటే మెగా ఫ్యామిలీ కూడా అభ్యంతరాలు పెట్టే అవకాశం ఉండకపోవచ్చు.. అసలు మొదట్లోనే ఈ పెళ్లి జరిగితే నిహా జీవితం బాగుండేదేమో అంటున్నారు మెగా ఫ్యామిలీ అభిమానులు.