(Bones)
పిల్లల ఎదుగుదల విషయంలో తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్థ వహించాలి. ఎందుకంటే పెద్దవారితో పోల్చితే పిల్లల ఎముకలు బలహీనంగా ఉంటాయి. దీనివల్ల చిన్న చిన్న దెబ్బలు తాకినా తొందరగా విరిగిపోయే ప్రమాదం ఉంటుంది. బాల్యంలోని బలమైన ఎముకలు వారి జీవితకాల ఆరోగ్యానికి అద్బుతమైన పునాదిని అందిస్తాయి. అందువల్ల వారి ఎముకలు దృఢంగా ఉండేందుకు తీసుకోవాలసిన జాగ్రత్తలు, పాటించవలసిన ఆహార నియమాలపై అవగాహన ఉండాలి. 18 నుంచి 25 సంవత్సరాల వయస్సులో ఎముకల ఎదుగుదల ఆగుతుంది. దీన్నే పీక్ బోన్ మాస్ స్టేజ్ అని పిలుస్తుంటారు. చిన్నతనంలో పిల్లల ఎముకల ఆరోగ్యంపై దృష్టి పెట్టకపోతే మున్ముందు జీవితాంతం ప్రభావం చూపుతుంది. ఎముక సాంద్రత తగ్గిపోయి ఎముకలు క్షీణించటం, తేలికగా విరిగిపోవటం జరుగుతుంది.
ఎలాంటి ఆహారం తిసుకొవాలి….. (Bones)
ఎదుగుతున్న పిల్లలకు కాల్షియం చాలా అవసరం. ఎందుకంటే ఇది ఎముకలు, దంతాల ఏర్పాటు, అభివృద్ధికి సహాయపడుతుంది. ఆరోగ్య నిపుణుల ప్రకారం మీ పిల్లల ఆహారంలో తగినంత కాల్షియం వారి ఎదుగుదలకు చాలా అవసరం. బాల్యంలో బలమైన ఎముకలను కలిగి ఉండటం
వల్ల జీవితాంతం వారి ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. పిల్లలకు రోజూ పాలు తాగించాలి. ఎందుకంటే పాలలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది.
విటమిన్ D… (Bones)
చిన్నారుల ఎముకలు దృఢంగా ఉండటానికి, అభివృద్ధి చెందడానికి సమతుల్య ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. వారి డైట్లో కాల్షియం, విటమిన్ D వంటి న్యూట్రియంట్లు తప్పకుండా ఉండాలి. అందుకే సాధ్యమైనంతవరకూ కాల్షియం, ఉండే ఆహారం తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. గుడ్లు, ఇతర నాన్ వెజ్ పదార్ధాలు తినడం వల్ల ఎముకలు గట్టిపడతాయి. మనిషి శరీరంలో అతి ముఖ్యమైనవి ఎముకలే. ఇవి బలంగా ఉన్నంతవరకే మనిషి యాక్టివ్‌గా ఉంటాడు. ఏ పనైనా సక్రమంగా చేయగలడు. ఎముకలు బలహీనంగా ఉంటే పూర్తిగా నిస్సత్తువ ఆవహిస్తుంది. ఏ పనీ చేయలేరు. రోజూ వారీ పనులు కూడా చేయలేని పరిస్థితి ఉంటుంది. ఈ నేపధ్యంలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఎముకల సమస్య తలెత్తకుండా ఉండేందుకు హెల్తీ ఫుడ్స్ తిసుకోవాలి.
పాలు……
పాలు, పాల ఉత్పత్తులలో కాల్షియం, ఫాస్పరస్ సమృద్ధిగా ఉంటాయి. రోజుకు 2 సార్లు పాలు తప్పకుండా తాగితే శరీరానికి అవసరమైన కాల్షియం, విటమిన్ D లభిస్తాయి. ఎముకలు, దంతాలు, గోళ్ల అభివృద్ధికి ఈ పోషకాలు కీలకపాత్ర పోషిస్తాయి. అంతేకాదు పాలలో ప్రొటీన్, జింక్, విటమిన్ A, B2, B12 వంటి పోషకాలు ఉంటాయి. పిల్లలకు రోజూ పాలు ఇస్తే ఎముకల బలంగా ఉండటమే కాదు శరీరంలో రోగ నిరోధక శక్తి పెంపొందుతుంది. పాలలో అధిక శాతంలో ఉండే అమైనో ఆమ్లాలు, కొవ్వు పదార్ధాలు పిల్లల శారీరక ఎదుగుదలకు తోడ్పడతాయి.
పెరుగు…
పెరుగులో కాల్షియం, విటమిన్ డి వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. పెరుగులో కాల్షియం, ఫాస్పరస్, ప్రోటీన్, లాక్టోస్ పుష్కలంగా ఉంటాయి. కాల్షియం వల్ల ఎముకలు, దంతాలు గట్టిపడతాయి. పెరుగు చాలా సులువుగా జీర్ణం అవుతుంది. పాలకూర పోషకాల పవర్ హౌస్. పాలకూరలో కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, విటమిన్ A, C, K వంటివి మెండుగా ఉంటాయి. కేవలం ఒక కప్పు బచ్చలికూర తీసుకోవడం వల్ల రోజువారీ కాల్షియం అవసరంలో నాలుగింట ఒక వంతు తీసుకున్నట్లే. పాలకూరలోని కాల్షియం ఎముకల అభివృద్ధికి, బలంగా ఉండటానికి తోడ్పడతుంది. కొల్లార్డ్ గ్రీన్స్, బ్రోకలీ వంటి కూరగాయల్లో ఎముకలను దృఢంగా మార్చే పోషకాలు ఉంటాయి.
నట్స్…..
డ్రై ఫ్రూట్స్, నట్స్‌లో కాల్షియం, విటమిన్ డి వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యానికి, దృఢంగా ఉండటానికి తోడ్పడతాయి. మీ పిల్లల డైట్లో నట్స్ యాడ్ చేస్తే వారి ఎముకలు బలంగా ఉంటాయి. బీన్స్, బ్లాక్ బీన్స్, కిడ్నీ బీన్స్ లో మెగ్నీషియం, కాల్షియం, ఫాస్పరస్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి ఎముకల నిర్మాణానికి, అభివృద్ధికి తోడ్పడతాయి. చీజ్ ఎముకలు బోలుగా అవకుండా నివారిస్తుంది. రోజువారి జీవితంలో దీన్ని భాగంగా చేసుకోవాలి. ప్రొటీన్ పుష్కలంగా లభిస్తుంది. చిన్న పిల్లలకు కూడా దీన్ని తినిపించాలి. టోఫు శరీరంలో పోషకాల లోపాన్ని ఇది భర్తీ చేస్తుంది. దీన్ని తీసుకోవడం వల్ల శరీరానికి ప్రొటీన్ తోపాటు అనేక పోషకాలు అందుతాయి. ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
కార్బోనేటేడ్ పానీయాలు వద్దు….
కార్బోనేటేడ్ పానీయాలలో సాధారణంగా కొన్ని ఫాస్పోరిక్ ఆమ్లాలు ఉంటాయి. ఇది శరీరం కాల్షియాన్ని గ్రహించకుండా నిరోధిస్తుంది. ఈ ఆమ్లం ఎముకల ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. కార్బోనేటెడ్ పానీయాలకు బదులుగా నారింజ రసం వంటి హెల్తీ పానీయాలను తాగించండి. ఎముకలను బలోపేతం చేసేవాటిలో ముఖ్యమైనది శారీరక శ్రమ, అందుకే పిల్లలు బాగా ఆటలు ఆడేలా చూడండి. వీలైతే చిన్న చిన్న వ్యాయామాలనే చేయించండి.
(Bones)