(1)
నిశ్శబ్దంగా ఉండటం వల్ల అద్భుతమైన శక్తి లభిస్తుందన్న విషయం మీకు తెలుసా మాట్లాడడం ఒక అందమైన కళ.. మౌనంగా ఉండటం అంతకంటే అద్భుతమైన కళ. అందుకే జీవితంలో ప్రతి ఒక్కరు గంటసేపు మౌనంగా ఉండాలని చెబుతారు. మౌనంగా ఉండడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు, ఎన్నో లాభాలు కలుగుతాయని చెబుతున్నారు. చాలామంది తత్వవేత్తలు, నిష్ణాతులు మౌనమే గొప్ప శక్తిని ఇస్తుందని చెబుతారు.
మానసిక ఒత్తిడికి చెక్ (1)
ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత కాసేపు మౌనంగా ఉండడం మంచిది. గంటసేపు మౌనంగా ఉంటే మానసిక ఒత్తిడి నుంచి బయట పడతామని చెబుతున్నారు. మౌనం మన ఆందోళనలను కంట్రోల్ చేస్తుందని చెప్తున్నారు. నిత్యం ఉరుకుల పరుగుల జీవితంలో అలసి సొలసి పోతున్న వారు కచ్చితంగా ఒక గంట సేపు మౌనంగా ఉంటే ఆ అలసట తగ్గుతుందని, వారి మెదడు పనితీరు మెరుగవుతుంది. మానసిక ఆరోగ్యానికి మౌనం ఎంతో బాగా ఉపయోగపడుతుందని సూచిస్తున్నారు. భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోవడానికి, మెరుగైన లోతైన అవగాహన కలిగి ఉండడానికి, ప్రశాంతంగా ఉండడానికి మౌనం ఎంతగానో ఉపయోగపడుతుంది. మౌనంగా ఉండడం వల్ల హాయిగా నిద్ర పడుతుందని, రక్తపోటు సమతుల్యం అవుతుందని చేబుతున్నారు నిపుణులు.
ఇమ్యూనిటీ పెరుగుతుంది…
మౌనంగా ఉండడం వల్ల ఒత్తిడి కూడా తగ్గుతుందని, ఫలితంగా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మౌనం వల్ల ఆవేశం, కోపం, అయినదానికి, కాని దానికి గొడవలు పడడం, నోరు పారేసుకోవడం వంటి లక్షణాలు ఉంటే అవి తగ్గుతాయని చెబుతున్నారు. గుండె దడ తగ్గించడంలో మౌనం ఎంతగానో కీలకపాత్ర పోషిస్తుంది. శరీరం ఆరోగ్యంగా ఉన్నప్పుడు రోగ నిరోధక శక్తి పెరుగుతుందని, ఫలితంగా సంతోషకరమైన జీవనాన్ని సాగించగలుగుతామని అంటున్నారు. కాబట్టి మౌనానికి ఉన్న శక్తిని అర్ధం చేసుకుని, మౌన వ్రతాన్ని పాటించి కనీసం రోజుకు గంట సేపైనా నిశ్శబ్దంగా ఉండి మనం మన శరీరాన్ని, మనసును కంట్రోల్ లో ఉంచుకోవాలి.
ఒక గంట సేపు ఎలాంటి విషయాల గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండటం వల్ల ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్, భయం మొదలైన వాటిని నుంచి రిలీఫ్ పొందవచ్చు. నిశ్శబ్దంగా ఉండటం వల్ల ఒత్తిడి హార్మోన్ల ఉత్పత్తిని తగ్గించుకోవచ్చు. దీంతో స్ట్రెస్ అనేది తగ్గుతుంది. స్ట్రెస్ తగ్గడం వల్ల ఇతర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. రోజూ ఒక గంట సేపు మౌనంగా, ప్రశాంతంగా ఉండటం వల్ల గుండె సమస్యల ముప్పు తగ్గుతుందట. అంతే కాకుండా గుండె ఆరోగ్యంగా పని చేస్తుందని అధ్యయనాల్లో తేలింది. రక్త ప్రసరణ కూడా బాగా జరుగుతుందట. నిశ్శబ్దంగా ఉండటం వల్ల క్రియేటివిటీ థాట్స్ అనేవి పెరుగుతాయి. కళాకారులు, రైటర్స్ వీలైనంత వరకూ ప్రశాంతంగా ఉంటారు. ఇలా ఉండటం వల్ల క్రియేటివిటీ ఆలోచనలు వస్తాయి.
కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయ్! (1)
నిశ్శబ్దంగా ఉండటం వల్ల కమ్యునికేషన్ స్కిల్స్ పెరుగుతాయి. నిశ్బబ్దంగా ఉండి మీరు మాట్లాడే ప్రతి పదాలను మరింత జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడతారు. అలాగే శ్రద్ధగా వినడం వంటివి నేర్చుకుంటారు. అవగాహన సానుభూతిని పెంపొందించుకోవడానికి కూడా ఇది హెల్ప్ అవుతుంది. నిశ్శబ్దంగా ఉండటం వల్ల నిద్ర మెరుగు పడుతుంది. మంచి నిద్ర వల్ల మనసు కూడా రిలాక్స్ గా ఉంటుంది. దీంతో ఇతర సమస్యలు వచే అవకాశం కూడా తగ్గుతుంది. రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. (1)