noise
గతంలో టైమ్ చూడాలంటే చేతికి ఉన్న వాచ్‌లో చూసేవాళ్లం. ఆ తరువాత క్రమంగా మొబైల్ ఫోన్ వాడకం పెరిగింది. చాలా మంది ప్యాషన్ కోసం రింగ్స్ ధరిస్తుంటారు. ఎక్కువ శాతం మెటల్ రింగ్స్ ధరిస్తారు. అయితే, ఇప్పుడు ఆ రింగ్స్ మరింత స్మార్ట్‌గా మారాయి వాచ్ స్థానంలో స్మార్ట్ రింగ్స్ వచ్చేశాయి. ఇటీవల ప్రముఖ స్మార్ట్‌వాచ్ తయారీ కంపెనీ అయిన నాయిస్ స్మార్ట్ రింగ్‌ను లాంచ్ చేసింది. సరికొత్త టెక్నాలజీతో స్మార్ట్ రింగ్స్ అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం ఈ స్మార్ట్ రింగ్స్ ట్రెండే నడుస్తుందని చెప్పొచ్చు. ఇది కూడా స్మార్ట్ వాచ్ మాదిరిగానే పని చేస్తుంది. భారతదేశంలో అందుబాటులోకి రావడం ఇదే ప్రథమం అని చెప్పవచ్చు. రోజువారీ ఆరోగ్య కార్యకలాపాలను ట్రాక్ చేయడానికి రూపొందించారు. ఇది నిద్ర, సంసిద్ధత, కార్యాచరణ అనే మూడు ప్రధాన మెట్రిక్‌లను అందిస్తుంది.
అసలేంటీ ఈ స్మార్ట్ రింగ్…….. noise
స్మార్ట్ వాచ్‌ల మాదిరిగానే స్మార్ట్ రింగ్లలో కూడా సెన్సార్స్, ఎన్ఎఫ్సి చిప్‌లు ఉంటాయి. స్మార్ట్ వాచ్ ఆరోగ్యాన్ని ట్రాక్ చేసినట్లే, ఈ స్మార్ట్ రింగ్ కూడా హెల్త్‌ను ట్రాక్ చేస్తుంది. ఇందులో తేడా ఏంటంటే స్మార్ట్ రింగ్ పరిమాణం స్మార్ట్ వాచ్ కంటే చిన్నగా ఉండటమే. మీ వేలి సైజ్ ప్రకారం ఈ స్మార్ట్ రింగ్‌ను కొనుగోలు చేయొచ్చు. మరో మాటలో చెప్పాలంటే మార్కెట్లో సాధారణ రింగ్‌ని కొనుగోలు చేసినట్లే ఈ స్మార్ట్ రింగ్‌ను కూడా కొనుగోలు చేయొచ్చు. ఇందులో ఎన్నో రకాల డిజైన్స్, మోడల్స్ కూడా ఉన్నాయి. అంతేకాదు వేలి వాచీల్లో కాలిక్యులేటర్, డిజిటల్ డిస్ ప్లే వంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి. మరి వీటి రేటు ఎంత ఉంటుంది అనుకుంటున్నారు మోడల్ ని బట్టి రేట్ ఉంటుంది. మూడు డాలర్ల నుంచి మొదలు అంటే 249 రూపాయల నుంచి రేట్లు మొదలన్నమాట.
పనితీరు ఎలా ఉంటుంది…. noise
వేలికి పెట్టుకునేలా ఉంగరం సైజులో ఉండే వాచీలు మార్కెట్ లోకి వచ్చేశాయి. స్మార్ట్ వాచ్ మాదిరిగానే ఈ స్మార్ట్ రింగ్‌లో హార్ట్రే ట్ మానిటర్, పల్స్ రేట్ మానిటర్, స్లీప్ మానిటర్, బ్లూటూత్ కనెక్టివిటీ, కాంటాక్ట్‌లెస్ పేమెంట్ మొదలైన అనేక ఫీచర్లు ఉన్నాయి. స్మార్ట్ రింగ్ ఖరీదును బట్టి ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి. స్మార్ట్ వాచ్ మాదిరిగానే యాప్ ద్వారా మీ ట్రాకింగ్ మొత్తం వివరాలను చూడొచ్చు. మొబైల్ ఫోన్‌ను కూడా కంట్రోల్ చేసే వెసులుబాటు ఉంది. ఈ స్మార్ట్ రింగ్‌లో హార్ట్ రేట్ మానిటర్, పల్స్రే ట్ మానిటర్, స్లీప్ మానిటర్, బ్లూటూత్ కనెక్టివిటీ, అలారం సెట్, కాల్ రిసీవ్, కాల్ కట్ చేయడం వంటి ఆప్షన్స్ కూడా ఉన్నాయి. స్మార్ట్ రింగ్ అధునాతన సెన్సార్లు, దృఢమైన నిర్మాణ నాణ్యతతో వస్తుంది.
స్మార్ట్ రింగ్ ఫీచర్లు……….
ఆరోగ్యానికి సంబంధించిన 70 అంశాలను ఈ రింగ్ ట్రాక్ చేస్తుంది. ప్రతిరోజూ నిద్ర, సంసిద్ధత, కార్యాచరణ స్కోర్లను పర్యవేక్షిస్తుంది, లూనా రింగ్ విశ్రాంతి విధానాలు, మొత్తం ఆరోగ్యాన్ని ఆప్టిమైజ్ చేయడానికి విలువైన సిఫార్సులను అందిస్తుంది. ఉష్ణోగ్రత సెన్సార్ ఆహారం, వ్యాయామం ద్వారా ప్రభావితమైన శరీర వైవిధ్యాలను ట్రాక్ చేస్తుంది. లూనా రింగ్ యాప్ ద్వారా ఈ స్మార్ట్ రింగ్ ఆటోమేటిక్ ఫర్మ్‌వేర్ అప్డేట్లను అందిస్తుంది. నాయిస్ లూనా రింగ్ ఒక అల్ట్రా-లైట్ వెయిట్ 3 ఎంఎం ఫారమ్ ఫ్యాక్టర్‌తో రూపొందించారు. కాబట్టి ఈ రింగ్ రెండో స్కిన్ అనుభూతిని అందిస్తుంది. ఫైటర్-జెట్ గ్రేడ్ టైటానియం, డైమండ్ లాంటి పూతతో ఈ రింగ్‌ను రూపొందించారు. ముఖ్యంగా ఈ రింగ్ గీతలు, తుప్పుకు నిరోధకతను నిర్ధారిస్తుంది. బీఎల్ఈ 5 సాంకేతికతతో పని చేసే ఈ రింగ్ నీటి-నిరోధకతతో వస్తుంది. ఈ స్మార్ట్ రింగ్ ఒకే ఛార్జ్‌పై 6 రోజుల బ్యాటరీ జీవితాన్ని అందిస్తుంది.
స్మార్ట్ రింగ్ ధర……….. noise
నాయిస్ లూనా రింగ్ ధర రూ. 14,999గా కంపెనీ నిర్ణయించింది. ఈ రింగ్‌ను నాయిస్ అధికారిక వెబ్సైట్ నుంచి లేదా ఆన్లైన్ షాపింగ్ సైట్ల నుంచి కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్ రింగ్ ఏడు-రింగ్ సైజులతో పాటు ఐదు రంగు ఎంపికల్లో అందుబాటులో ఉంటుంది.ప్రత్యేకమైన ప్రాధాన్యతా యాక్సెస్ పాస్‌తో తమ లూనా రింగ్‌ను ముందస్తుగా బుక్ చేసుకున్న వినియోగదారులు కొనుగోలు చేసిన రోజున అదనంగా రూ. 1,000 తగ్గింపును పొందవచ్చు. అలాగే పాస్ హోల్డర్లు రూ. 2000 విలువైన లిక్విడ్, డ్యామేజ్, థెఫ్ట్ ఇన్సూరెన్స్‌తో పాటు స్మార్ట్ కళ్లజోడు, నాయిస్ ఐ1పై అదనపు తగ్గింపుకు కూడా పొందవచ్చు.దీని ద్వారా నేరుగా రూ. 3,000 నగదు ప్రయోజనం పొందవచ్చు.కంపెనీ బ్రాండ్, ఫీచర్స్, బ్యాటరీ, తదితర వివరాలను బట్టి వీటు రేటు మారుతుంది.