Mega
ఇటలీలోని టుస్కాని నగరంలో మెగా ఫ్యామిలీ పెళ్లి హడావిడి మొదలైంది. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల 48 నిమిషాలకు మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారు వరుణ్-లావణ్య. మెగా పెళ్లి సంబరాలు అంబరాళ్లును అందుకుంటున్నాయి. పెళ్లి పూర్తి చేసుకొని ఈ నైట్ కి అక్కడే 8:30 గంటలకు వెడ్డింగ్ రిసెప్షన్ కూడా నిర్వహించబోతున్నారట. ఇప్పటికే సంగీత్ పార్టీ, హల్దీ, మెహందీ కార్యక్రమాలతో సందడి చేశారు మెగా ఫ్యామిలీ. అందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
స్పెషల్ బస్సు లో నితిన్ ప్రయాణం:
నితిన్ వరుణ్ తేజ్ కు మంచి స్నేహితుడు…. ఇప్పటి వరకు జరిగిన అన్ని ఈవెంట్స్ కి హజరవుతూ వచ్చారు నితిన్-శాలిని. మొన్నటికి మొన్న లావణ్య ఇచ్చిన బ్యాచులర్ పార్టీకి శాలిని పాల్గొని సందడి చేసింది. వరుణ్ పెళ్లికి నితిన్ ఏకంగా తన ఫ్యామిలీతో కలిసి బస్సులో టుస్కాని నగరానికి చేరుకున్నరని తెలుస్తుంది. ప్రత్యేకమైన బస్సు లో నితిన్ తన భార్య శాలిని తన అక్క బావ అలాగే డిజైనర్ నీరజకోనా పెళ్లి వేడుకకు వెళ్లారు. స్పెషల్ బస్సుకు “వరుణ్ వారి పెళ్లి పార్టీ” అంటూ పేరు పెట్టారు. ఇక ఈ ఫోటోతో ప్రేక్షకులకి అందరికి నితిన్ కూడా హాజరైయ్యారని అర్థం అయింది.
నిహారికని ఫాలో అవుతున్న లవణ్య: (Mega)
వరుణ్ తేజ్, లావణ్య రీల్ లో నటించిన ఈ జంట రియల్ లైఫ్ లో ఒక్కటైనారు. పెళ్లికి సంబంధించిన కట్టుబాట్టుల్లో లావణ్య త్రిపాఠి నిహారికని ఫాలో అవుతుందట. అసలు లావణ్య నిహారికాను ఏమ్ ఫాలో అయింది? నిహారిక చైతన్య పెళ్లి జైపూర్ లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వెడ్డింగ్ కోసం నిహారిక తన అమ్మగారు పద్మజా పెళ్లి చీరను కట్టుకొని అందరిని ఆశ్చర్యపరిచింది. నిహారిక ఎంతో సెటిమెంట్ గా భావించి వాళ్ల అమ్మగారి చీరలో తలుక్కుమంది. ఇక లావణ్య కూడా నిహారికను ఫాలో అవుతుందని సమాచారం. తన తల్లి పట్టుచీరను కట్టుకొని పెళ్లి వేడుకల్లో మెరవనుందట. తన తల్లి పెళ్లి రోజున కట్టుకున్న చీరను మోడ్రన్ గా డిజైన్ చేయించి తన పెళ్లి రోజున కట్టుకోనున్నదని సమాచారం. తన తల్లి చీరను కేప్ లెహంగాలో డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ కాలంలో అమ్మాయిలందరూ ఈ ట్రెండ్ నే ఫాలో అవుతున్నారు.