మెగా న్యూ కపుల్ వరుణ్ (Varun) లావణ్య పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. నాగబాబుకు ఒక్కగానొక్క కొడుకు కావటంతో పెళ్లిని చాలా వైభవంగా జరిపించాడు. ఆరేళ్ల పాటు ప్రేమించుకున్న ఈ జంట కుటుంబ సభ్యుల సమక్షంలో ఒక్కటయ్యారు. ఇటలీలోని టస్కానీలో బుధవారం రాత్రి 7:18 కు మెగా ప్రిస్స్ వరుణ్, లావణ్య త్రిపాఠి పెళ్లి సంబరాలు అంబరాన్ని అంటాయి. పెళ్లి ఇతర దేశాల్లో జరిగినా తెలుగు సంప్రాదాయాలు కట్టు బాట్లుకు ఏమాత్రం డోకా లేదు. వరుణ్- లావణ్య పెళ్లి సంప్రాదాయ బద్దంగా జరిపారు మెగా ఫ్యామిలీ. ఇరు కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల ఆశీర్వాదంతోపెళ్లి ఈవెంట్ లో ప్రతీ ఘట్టం ఘనంగా జరిగింది. కొద్ది మంది బంధువులతో మాత్రమే పెళ్లి జరిగింది. వరుణ్ లావణ్య, మెగా ఫ్యామిలీ పిక్స్ సోషల్ మీడియా వైరల్ అవుతున్నాయి. సినీ ప్రముఖులు, మెగా ఫ్యాన్స్ వధూవరులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక నవంబర్ 5వ తేదీన హైదరాబాద్ మాధాపూర్ లో ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో వరుణ్-లావణ్య రిసెప్షన్ నిర్వహించనున్నారు.
వరుణ్ పెళ్లి లో తప్పు చేసిన నాగబాబు: (Varun)
ఏ శుభకార్యం అయిన ఏదో ఒక తప్పు జరగటం కామన్. అలాగే నాగబాబు తన కొడుకు పెళ్లిలో ఒక తప్పు చేసి అందరికి దొరికిపోయారు. కొడుకు పెళ్లిలో నాగబాబు చేయకూడని పని ఒకటి చేశారు.? విషయానికి వస్తే పెళ్లి ఫోటోల్లో అందరు ట్రెడిషనల్ డ్రెస్ లో అందంగా, హుందాగా కనిపించారు. ఒక్క నాగబాబు తప్ప… అందరు స్టేజ్ మీద చెప్పులు వేసుకోకుండా పద్దతిగా ఫోటోలో ఉన్నారు… కానీ నాగబాబు మాత్రం చెప్పులు వేసుకోని కనిపించారు. వేదమంత్రాలతో ఒక్కటేన జంటను దీవించడానికి అలా చెప్పులు వేసుకోని రావటం చూసిన అందరు నాగబాబుపై మండిపడుతున్నారు. ఎంతో సంప్రాదాయ బద్ధంగా జరిగిన పెళ్లిలో ఇలా నాగబాబు చేయడం చూసి అందరు కోపం వ్యక్తం చేశారు.
వరుణ్ పెళ్లిలో పవన్ డిఫరెంట్ డ్రస్: Varun)
పెళ్లి ఫోటోల్లో అందరూ ట్రెడిషనల్ డ్రెస్ లో ఉంటే పవన్ కళ్యాణ్ మాత్రం అందరి కన్నా డిఫరెంట్ డ్రస్ లో కనిపించాడు. పవన్ మాత్రం టీషర్ట్ లో ఉండి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఎందుకో తెలియదు కానీ వరుణ్- లావణ్య పెళ్లి పనులు మొదలయ్యినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ ఫోటో కోసం ఫ్యాన్స్ ఎంతో అత్రుతగా ఎదురు చూశారు. చివరకు పెళ్లి రోజున అందరి కన్నా డిఫరెంట్ గా కనిపించి షాక్ కి గురిచేశాడు.
వారు లేని లోటు ఎవరు తీర్చలేరు:
మెగా కుటుంబ సభ్యులల్లో అందరూ పెళ్లిలో హంగామ చేశారు. అయితే వరుణ తేజ్ నానమ్మ అంజనా దేవి, పిన్ని రేణూ దేశాయ్ వరుణ్ పెళ్లికి హాజరు కాలేకపోయారు. రేణూ దేశాయ్ కుతూరు, కొడుకు కూడా పెళ్లికి రాలేదు. పెళ్లికి అతికొద్ది మంది సభ్యులు మాత్రమే హాజరయ్యారు.
సందడంతా వారిదే…
వరుణ్-లావణ్య పెళ్లికి మెగా స్టార్ చిరంజీవి కుటుంబం, మనుమరాళ్లతో సందడి చేస్తూ, డాన్స్ లు చేయడం వంటి హంగామా బాగా చేశారు. చిరంజీవి సతీమణి, నాగబాబు సతీమణి, పవన్ కళ్యాణ్ సతీమణి, రామ్ చరణ్ సతీమణి, అల్లు అర్జున్ సతీమణి, నితిన్ సతీమణి, అల్లు శిరిష్, అల్లు కుటుంబానికి చెందిన వారు అందరూ సందడి సందడి చేశారు. సెలబ్రేషన్స్ లో అందరు భాగస్వాములు అయ్యారు.