SRK
బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ నేడు తన 58వ బర్త్ డే జరుగుపుకుంటున్నాడు. అన్ని ఏళ్లు ఉన్న కానీ గ్రీకువీరుడు లాగా ఉంటాడు. బాలీవుడ్ కా బాద్ షా, కింగ్ ఖాన్ పలు పేర్లుతో అభిమానులు పిలుపంచుకుంటారు. రొమాంటిక్ పాత్రకు పెట్టింది పేరు షారుక్…. అలవోకగా పాత్రల్లో జీవిస్తుంటాడు.. అందుకే కింగ్ ఆఫ్ రొమాన్స్ అనే ట్యాగ్ ను సొంతం చేసుకున్నాడు. తన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు షారుక్. ఇప్పటికే 100కి పైగా సినిమాల్లో నటించాడు షారుక్.
షారుక్ ఫ్యాన్స్ ని ఎప్పుడు నిరాశపరచడు: SRK
షారుక్ ఖాన్ బర్త్ డే సందర్భంగా ప్రతి ఏడాది వేలాది మంది అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు చెప్పటానికి వస్తారు. అర్ధరాత్రి 12 దాటగానే కోట్లాది మంది అభిమానులు శుభాకాంక్షలు చెబుతారు. ఆయన పుట్టిన రోజున ఫ్యాన్స్ పండుగలా జరుపుకుంటారు. అంతమంది అభిమానులు వచ్చిన ఆయన ఏ నాడు వారిని నిరాశ పరచలేదు. అలాగే నేడు కూడా నిరాశ పరచలేదు. ముంబైలోని వెస్ట్ బాంద్రాలోని తన నివాసం మన్నత్ ఇంటి బాల్కనీ లోకి వచ్చి అభిమానులకు చేతులు ఊపుతూ ధన్యవాదాలు తెలిపాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఒడిదుడుకులతో సాగిన షారుక్ జీవితం… ఇప్పుడు బాలీవుడ్ కా బాద్ షా సాదారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు షారుక్. పుట్ బాల్, హాకీ ప్లేయర్ గా ఎన్నో అవార్డులను దక్కించుకున్నాడు. భుజానికి గాయం కారణంతో ఆటలకు దూరం అయ్యాడు. అంతటితో ఆగిపోలేదు…. 1989లో టెలివిజన్ సిరీస్ ఫౌజీతో మన ముందుకు వచ్చాడు. టెలివిజన్ అలా వచ్చాడో లేదో సడన్ గా గ్యాప్ ఇచ్చాడు. షారుక్ అమ్మ చనిపోవటంతో టీవీ కి దూరం అయ్యాడు… ఒక్కసారిగా ఒంటరివాడయ్యాడు. ఇక ఆ బాధ నుంచి కొలుకోవటానికి కొన్ని ఏళ్లు గ్యాప్ తీసుకున్నాడు. ఇక 1992లో దీవానాలో నటించాడు. మొదటి సినిమాతోనే బాలీవుడ్బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసింది. పట్టింది ప్రతీది బంగారం అనటానికి నిదర్శనం షారుక్ సినిమాలే… ఆయన నటించిన ప్రతి సినిమా సూపర్ హిట్టే. మూడు దశాబ్దాలుగా బాలీవుడ్ కింగ్ లా తన హవా నడుపుతున్నాడు.
కోటీశ్వరుడు అయినా సింపుల్ లైఫ్:
మధ్యతరగతి మనిషి గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన షారుక్ ఇప్పుడు కోటీశ్వరుడు అయ్యాడు. షారుక్ ఆస్తుల విలువ సుమారుగా రూ 6500 కోట్లకు పైమాటే అని చెప్పవచ్చు. సినిమాలు, వ్యాపార ప్రకటనలు, ఐపీఎల్ పై భారీగా సంపాదిస్తున్నాడు. ఏడాదికి రూ.300 కోట్లు సంపాదిస్తున్నాడని సమాచారం. షారుక్ సినిమాలు బాగా హిట్ అందుకోవటంతో ఆయన అడిగినంత రెమ్యునరేషన్ ఇస్తారు ప్రొడ్యూసర్లు. ఒక్క సినిమాకే 120 నుంచి 150 కోట్ల వరుకు వసులు చేస్తున్నాడట షారుక్. మనసు గొప్పది అంత సంపాదిస్తున్నా ఏ మాత్రం గర్వం లేకుండా సింపుల్ లైఫ్ లీడ్ చేస్తున్నాడు. కోవిడ్ సమయంలో తన 4 అంతస్తుల వ్యక్తిగత కార్యాలయ స్థలాన్ని కోవిడ్ రోగులకు చికిత్స అందించేందుకు ఇచ్చేశాడు. పేద పిల్లలకు విద్యను అందించడం, స్వచ్ఛంద సంస్థకు సాయం చేయడం వంటి పనులు చేస్తుంటాడు.
SRK అందుకున్న పురస్కారాలెన్నో…
షారుక్ ఖాన్ ఎన్నో సినిమాల్లో నటించాడు. కోట్లాది మంది ఫ్యాన్స్ ని సొంతం చేసుకున్నాడు. తన నటనతో ఎన్నో పురస్కారాలు అందుకున్నాడు. 14 ఫిల్మ్ ఫేర్ అవార్డులను అందుకున్నాడు. 2005 లో పద్మశ్రీ అవార్డును అందుకున్నాడు. భారత్ తో పాటు అనేక ఇతర దేశాల విశ్వ విద్యాలయాల నుంచి ఐదు గౌరవ డాక్టరేట్లను అందుకున్నాడు. కలెక్షన్ల సునామీ షారుక్ ఖాన్ ఈ మధ్య సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్లుగా నిలిచాయి. రీసెంట్ గా వచ్చిన పఠాన్, జవాన్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర దుమ్ము లేపాయి. కలెక్షన్ల సునామీ ని సృష్టించాయి. ఇక డిసెంబర్ లో దుంకీ సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు. ఇక ఈ సినిమా టాలీవుడ్ స్టార్ ప్రభాస్ మూవీతో ఢీ కొట్టడానికి సిద్ధంగా ఉంది.