(BHU)
విశ్వ విద్యాలయాలంటే చదువుల తల్లి నిలయాలనుకుంటాం.. విద్యార్ధుల భవిష్యత్తును తీర్చి దిద్దే కేంద్రాలనుకుంటాం.. కానీ అవి పార్లర్లుగా, పాశ్చాత్య సంస్కృతికి కేరాఫ్ అడ్రస్ గా మారితే? విలువల వలువలను గాలికొదిలేసి నిస్సిగ్గుగా రేపటితరం దౌర్జన్యాలకు పాల్పడితే. మహిళల మాన ప్రాణాలతో చెలగాటమాడితే.. చదువుల నిలయాల్లో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయంటే ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఆడపిల్లలున్న తల్లి దండ్రులు భయభ్రాంతులకు గురవడం గ్యారంటీ. అమ్మాయిలను ఆటబొమ్మలుగా మార్చేసి వారిపై బలవంతంగా దాడులు చేయడం వారి మాన ప్రాణాలను హరించడం దారుణాతి దారుణం. ఇలాంటి ఘటనలు ఎక్కడో అనాగరిక సమాజంలో జరిగితే పోనీ ఏదో అని సరిపెట్టుకోవచ్చు.. కానీ చదువుల నిలయాలైన యూనివర్సిటీలోనే ఇలాంటివి జరిగితే ఆడపిల్లల భద్రత ఇంకెక్కడ?
బెనారస్ హిందూ యూనివర్సిటీలో ఘటన (BHU)
యూపీ లక్నోలోని బనారస్ హిందూ యూనివర్సిటీ (BHU) ఇలాంటి ఘటనలతోనే వార్తల్లోకి ఎక్కింది. BHU కేంపస్ లో ఓ మహిళా విద్యార్ధిని కొందరు యువకులు బలవంతంగా ముద్దు పెట్టుకుని,ఆమె బట్ట లూడదీసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్టూడెంట్స్ హాస్టల్ దగ్గర ముగ్గురు యువకులు బైక్ పై వచ్చి ఈ ఘటనకు పాల్పడినట్లు దీనిని వీడియోలో కూడా చిత్రీకరించినట్లు తెలుస్తోంది.
భద్రత కల్పిస్తాం అంటున్నయాజమాన్యం
ఈ ఘటనలో బయట వ్యక్తుల ప్రమేయముందని, బయటి వ్యక్తులను కేంపస్ లోకి అనుమతించరాదని విద్యార్ధి సంఘాలు ధర్నాకు దిగాయి. ఐఐటీ సెంటర్ కు బీహెచ్ యూ ను వేరు చేస్తూ మధ్యలో గోడ ఉండాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. ఐఐటీ కేంపస్ కు చెందిన వారే ఈ ఘటనకు పాల్పడ్డారన్నది విద్యార్ధి సంఘాల ఆరోపణ. విద్యార్ధి సంఘాల డిమాండ్లను పరిశీలించిన కళాశాల యాజమాన్యం విద్యాశాఖతో చర్చించి క్లోజ్డ్ కేంపస్ గా మార్చేందుకు ప్రయత్నిస్తామని హామీనిచ్చింది. విద్యాశాఖతో చర్చించి యూనివర్సిటీ కేంపస్ ను క్లోజ్ చేసి అనుమతులను క ఠినం చేస్తామని వర్సిటీ రిజిస్ట్రార్ ప్రకటించారు. సంఘటన తర్వాత కేంపస్ లో భద్రత పెంచామని, మరిన్ని సీసీటీవీలను ఏర్పాటు చేస్తామని, ఎక్కడికక్కడ నిఘాను పెంచుతామని రిజిస్ట్రార్ప్ర కటించారు. రాత్రి పది దాటాక, ఉదయం ఐదు వరకూ విద్యార్ధుల రాకపోకలను కూడా బాగా కుదిస్తామని వర్సిటీ యాజమాన్యం తెలిపింది.
ఘటన ఎలా జరిగిందంటే (BHU)
బుదవారం రాత్రి తన స్నేహితురాలితో కలసి కేంపస్ బయటకు వెళుతుండగా తనను కొందరు యువకులు వేధించారని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కర్మన్ బాబా ఆలయం దగ్గర ముగ్గురు యువకులు మోటార్ సైకిల్ పై వచ్చి తనను తన స్నేహితురాలినుంచి వేరు చేశారని, ఒక మూలకు తీసుకు వెళ్లి బలవంతంగా ముద్దు పెట్టుకున్నారని, బట్టలు ఊడదీశారని ఆరోపించింది. తనను వివస్త్రను చేసి వీడియోలు తీసి, ఫోటోలు క్లిక్ చేశారని.
పావుగంట తర్వాత తనను వదిలిపెట్టి తన పోన్నం బర్ తీసుకున్నారని ఆ యువతి ఫిర్యాదులో పేర్కొంది. అయితే ఈ సంఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని, యూనివర్సిటీ యాజమాన్యంతో కలసి సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్చే స్తున్నామని కేంపస్ లో భద్రత పెంచుతామని పోలీసులు చెబుతున్నారు.ఇటీవల కాలంలో సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో ఇలాంటి ఘటనలు ఎక్కువ జరుగుతున్నాయి. మహిళలపై బలవంతంగా దాడులకు దిగడం, లైంగిక చర్యలకు పాల్పడటం, ఆపై బ్లాక్ మెయిలింగ్ కుదిగడం పరిపాటిగా మారుతోంది. ఎవరైనా ప్రతిఘటిస్తే ఆ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పెడతామని బెదిరింపులకు ఈ రౌడీ మూకలు పాల్పడుతున్నాయి. యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్య నాథ్ రాష్ట్రంలోనే ఇలాంటి ఘటన జరగడం సంచలనం సృష్టించింది.