Mega
మెగా ఇంటి సభ్యులు పెళ్లి సందడిని పూర్తి చేసుకున్నారు. రిసెంట్ టాలీవుడ్ లవ్ బర్డ్స్ మెగా ప్రిస్స్ వరుణ్ తేజ్- సొట్టబుగ్గల సుందరి నవంబర్1 వ తేదీన అగ్ని సాక్షిగా మూడు ముళ్ల బంధంతో ఒక్కటైనారు. ఇరు కుటుంబ సభ్యులు, బందుమిత్రల సమక్షంలో ఇటలీలోని టాస్కనీలో హిందూ సాంప్రదాయం ప్రకారం ఘనంగా వీరి పెళ్లి జరిగింది. ప్రస్తుతం వీరి పెళ్లికి హాజరైన సెలబ్రెటీస్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. పెళ్లికి హజరైనవారు సోషల్ మీడియాలో పిక్స్ షేర్ చేస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఆరేళ్ల ప్రేమ పక్షులుగా ఉన్న ఈ జంట భార్యభర్తలుగా ప్రమోషన్ తీసుకున్నారు.
ఖర్చుకు ఏ మాత్రం వెనకాడలేదు: Mega
ఇటలీలో ఘనంగా నిర్వహించిన వరుణ్ లావణ్య పెళ్లిలో…. మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ బందుమిత్రులందరూ హడవిడి చేశారు. పెళ్లికి కాక్ టైల్ పార్టీ, హల్దీ, మెహందీ ఇలా ప్రతి వేడుకను అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించారు. ఇన్ని ఈవెంట్స్ జరిపించడంలో ఏ మాత్రం ఖర్చుకి వెనకాడలేదు నాగబాబు. ఈవెంట్స్ నుంచి పెళ్లి దాక దాదాపు రూ.15-18 కోట్ల దాక అయిందని సోషల్ మీడియాలో కథనాలు వినిపిస్తున్నాయి. విదేశాల్లో జరిగిన పెళ్లికే ఈ రేంజ్ లో ఖర్చు పెడితే హైదరాబాద్ లో జరిగే రిసెప్షన్ కి చాలా మంది సిని ప్రముఖులు రానున్నారు…. మరి హైదరాబాద్ లో ఇంక ఎంత ఖర్చు అవుతుందో చెప్పలేము.నాగబాబుకి ఒక్కగానోక్క కొడుకు కావడంతో వరుణ్ పెళ్లికి ఈ మాత్రం ఖర్చు చేయడంలో తప్పే లేదంటున్నారు అభిమానులు. ఇక హైదరాబాద్ లో 5వ తేదిన వరుణ్ లావణ్య ల రిసెప్షన్ జరగనుంది.
పోస్ట్ షేర్ చేసి ఎమోషనల్ అయిన నాగబాబు: Mega
సంప్రాదాయ బద్ధంగా కొడుకు పెళ్లి ఇటలీ లో చేశాడు నాగబాబు. ఇప్పటికే మెగా ఫ్యామిలీ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. పెళ్లిలో మెగా బ్రదర్స్ చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ ఫోటోలు దిగారు. ఈ ఫోటోను నాగబాబు తన సోషల్ మీడియాలో షేర్ చేసి ఎమోషనల్ క్యాప్షన్ పెట్టాడు. అందులో మా మధ్య గొడవలు జరిగినా, విభేదాలు వచ్చినా మేము ఎప్పుడూ విడిపోలేదు. కష్ట సుఖాల్లోనూ కలిసి తోడుగా… ఒకరికి ఒకరు సపోర్ట్ చేసుకుంటూ ఉన్నాం… ఎప్పటికి ఇలానే ఉంటాం.. కష్టాలను, ఆనందాలను కలిసి పంచుకున్నాం.. మా రిలేషన్ లో మర్చిపోలేని ఆనంద క్షణాలు ఉన్నాయి. మా అన్నదమ్ముల బంధం విడదీయలేనిది అంటూ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశాడు. ఆ పోస్ట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది చూసిన మెగా ఫ్యాన్స్ మీరు ఎప్పుడు కలిసి కట్టుగా ఊమ్మడి కుటుంబం లాగానే ఉంటారు. నాగాబాబు మీరు బాధపడకండి అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
వదినమ్మ వచ్చేసిందంటున్న నిహారిక: Mega
పెళ్లికి హాజరైన ప్రతి ఒక్కరు జంటతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఇటలీలో హడావిడి మొత్తం నిహారికదే. తన అల్లరితో పెళ్లిలో చిలిపి పనులు చాలా చేసింది. ఇక పెళ్లిలో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. వరుణ్ లావణ్య నిహారిక ముగ్గురు కలిసిదిగిన ఫోటోకి క్యాప్షన్ ‘వదినమ్మ వచ్చేసింది’ అంటూ పెట్టింది. వీరి పెళ్లి ఫోటోలు అందరిని బాగా ఆకట్టుకుంటున్నాయి.
బాబాయ్ తో దిగిన ఫోటో వైరల్:
మొన్నటిదాకా అందరి ఫోటోలు లీక్ అవుతున్న పవన్ పిక్ మాత్రం అసలు లీక్ అవ్వలేదు. పవన్ ఫ్యాన్స్ మా అభిమాని పిక్ ను ఎవరైనా లీక్ చేయండయ్యా అంటూ బాధతో కామెంట్స్ పెట్టారు. చివరకు వరుణ్ పెళ్లిలో చెర్రితో దిగిన ఫోటో విడుదల అయ్యింది. ఇప్పుడది సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. దానిని చూసిన అభిమానులు ‘ఇది కదరా ఫోటో ‘ అంటూంటే మరి కొందరేమో పిక్ ఆఫ్ ది డే అంటూ కామెంట్స్ పెడుతున్నారు పవన్ ఫ్యాన్స్.
తళుకు మన్న అల్లు ఫ్యామిలీ ఫొటో
వరుణ్ పెళ్లిని మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ బాగా ఎంజాయ్ చేశారు. అందరి దృష్టీ మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ మీదే. వధూ వరులతో అల్లు అర్జున్ తన భార్య స్నేహారెడ్డి, కుమారుడు అయాన్, కూతురు అర్హతో దిగిన ఫోటోను సోషల్ మీడియా లో షేర్ చేశారు. ఫోటోను చూసిన ఐకాన్ స్టార్ ఫాన్స్ సంతోషంగా ఉన్నారు.