custard apple
సీతాఫలం… ఈ పేరు తెలియని వారుండరు. సాధారణంగా దొరికే పండ్ల కంటే సీజన్ లో దొరికే పండ్లలో ఒక్కొక్క పండుకు ఒక్కొ ప్రాధాన్యత ఉంటుంది. శీతాకాలంలో విరివిరిగా లభించే పండ్లల్లో సీతాఫలం ఒకటి. దీనిని ఇంగ్లీష్ లో కస్టర్డ్ యాపిల్ అని పిలుస్తారు. చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు ఈ పండుని అందరూ ఇష్టంగా తింటారు. కేవలం శీతాకాలంలో మాత్రమే లభించే ఈ పండ్లను అందరూ ఇష్టపడతారు. దీనిలో అద్భుతమైన రుచితో పాటు మన శరీరానికి కావలసిన అన్ని పోషకవిలువలను సమృద్ధిగా అందించడంలో కీలకపాత్ర వహిస్తుంది. దీనిలో ఎన్నో అద్భుతమైన గుణాలు ఉన్నాయి.
పోషకాల గని సీతాఫలం… custard apple
సీతాఫలంలో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు దాగున్నాయి. దీనిలో పోషకాలు సమృద్ధిగా ఉండడంతో పోషకాల గని అని కూడా పిలుస్తారు. ఇది తిన్న వెంటనే శక్తిని ఇస్తుంది. ఇందులో విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా లభిస్తాయి. ఐరన్, విటమిన్ సి, పాస్ఫరస్, మెగ్నీషియం వంటివి ఉండి ఆరోగ్యనికి ఎంతో మేలు చేస్తాయి.ఎన్నో ఖనిజాలు, విటమిన్లు అత్యధిక పీచు పదార్ధాలతో సమృద్ధిగా ఉండే సీతాఫలం మన ఆరోగ్యానికి ఎనలేని మేలు చేస్తుంది.
ప్రయోజనాలు అని తెలిస్తే ఎవరూ వదులుకోరు
సీతాఫలంలో ఆకు మొదలుకుని విత్తనం వరకు ఆరోగ్యనికి ఎంతగానో మేలు చేస్తుందని వైద్యశాస్త్రం చెబుతుంది. ఒక్కమాటలో చేప్పాలంటే పండులోని ప్రతి భాగం ఔషధమే. అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులను నశింపచేయడానికి సీతాఫలం ఎంతగానో ఉపయోగపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. సీతాఫలం అన్ని వ్యాధులకు సంజీవని మాదిరిగా పని చేస్తుంది. క్యాలరీలను పెంచుకోవడంలో మరియు బరువు పెరగడానికి ఎంతో ఉపయోగపడుతుంది. గర్భిణీ స్త్రీలు సీతాఫలం తినడం వల్ల పొట్టలో పెరిగే శిశువు యొక్క మెదడు, నాడీవ్యవస్థ, వ్యాధి నిరోధకత పెరగడానికి సహాయపడుతుంది. అస్త్మా మరియు గుండె సంబంధిత సమస్యల నుండి ఉపశమనం పొందడంలో సీతాఫలం మంచిగా పనిచేస్తుంది.
ఇది జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది. మలబద్ధకాన్ని నివారించి జీర్ణసమస్యల ను తగ్గించడంలో సహయపడుతుంది. షుగర్ వ్యాధిని కంట్రోల్ చేయడంలో కూడా సహయపడుతుంది. ఇందులో ఉండే పోటాషియం మరియు మెగ్నీషియం బ్లడ్ ప్రజర్ ని కంట్రోల్లో ఉంచుతుంది. కంటి సమస్యలను దూరం చేస్తుంది. జాయింట్ పెయిన్స్ ను నివారిస్తుంది. దీనిలో ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల అనీమియాను తగ్గిస్తుంది. నియాసిన్ మరియు డైటరీ ఫైబర్ అధికంగా ఉండటం వల్ల కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గిస్తుంది. దంతాల ఆరోగ్యానికి చాలా మంచిది. దంతాలనొప్పి మరియు దంతక్షయాన్ని నివారించడానికి సీతాఫలం సహాయపడుతుంది. స్కిన్ అలర్జీని నివారిస్తుంది. మరియు స్కిన్ క్యాన్సర్ రాకుండా చూస్తుంది.
ఎక్కువగా తింటే ముప్పే! custard apple
సీతాఫలాన్ని చాలా మంది ఇష్టంగా తింటారు. ఈ పండును అవసరమైన పరిమాణంలో తీసుకుంటే ఆరోగ్యనికి ఎంతో మేలు జరుగుతుంది. అధికంగా తీసుకోవడం వల్ల మెదడు ఆరోగ్యన్ని దెబ్బతీస్తుంది. పార్కిన్ సన్స్ వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. సీతాఫలాన్ని అధికంగా తీసుకోవడం వల్ల బరువు ఎక్కువగా పెరిగే అవకాశాలు ఉంటాయి. ఎక్కువగా తింటే అజీర్తి, అతిసారం వంటి రోగాల భారిన పడే అవకాశం ఉంది. అంతే కాకుండా ఇందులో పోటాషియం ఎక్కువగా ఉండటం వల్ల కంటిచూపు సమస్యలతో పాటు మానసిక స్థితిలో మార్పులు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఐరన్ ఎక్కువగా ఉండడంతో ఎక్కువ తింటే కడుపు నోప్పితో పాటు ఇతర పేగు సంబంధిత రోగాలకు దారి తీస్తుంది.