salaar
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ న్యూ సినిమాతో మన ముందుకు రానున్నాడు. ప్రభాస్- ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న సలార్ వరస పోస్ట్ పోన్ లతో ప్రేక్షకులకు నిరాశే మిగులుతోంది. అలాగే మూవీ మేకర్స్ కూడా ఏదో ఒక అప్డేట్ తో వచ్చి ప్రేక్షకులను నిరాశ పరుస్తున్నారు. ప్రభాస్ సినిమాను ఎప్పుడు ధియేటర్స్ లో చూస్తామా అంటూ ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. ఇలా పోస్ట్ పోన్ లతో, అప్డేట్ లతో అందరిని నిరాశ పరుస్తున్నాడు ప్రశాంత్ నీల్.. లెటేస్ట్ గా మరొక అప్డేట్ తో మన ముందుకు వచ్చాడు. ఆ అప్డేట్ కూడా ఫ్యాన్స్ ను నిరాశ పరిచింది.
హోంబాలే ఫిలింస్ నిర్లక్యం:
సలార్ సినిమాపై రోజుకు ఒక్కొక్క ట్విస్ట్ తో మన ముందుకు వస్తున్నారు. ప్రభాస్ కెరీర్ లో ఇన్ని ట్విస్ట్ లతో వచ్చిన సినిమానే లేదు. మరి ఇన్ని ట్విస్ట్ లతో వస్తున్నా సలార్ సినిమా హిట్ అవుతుందో లేదో చూడాలి. అసలు లెటెస్ట్ గా వచ్చిన ట్విస్ట్ ఏంటి? విషయానికి వస్తే హోంబాలే ఫిలింస్ సంస్థలు నిర్లక్ష్యంగా ఉంటున్నారట. ఫిలింస్ చేసిన పనికి ప్రేక్షకులలో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గతంలో సలార్ రెండు పార్ట్ లు అనుకుంటే ఇప్పుడు రెండు పార్ట్ లు కాదని ఒకటే పార్ట్ అని ప్రచారం జరుగుతోంది. మళ్లీ హఠాత్తుగా ఐటెం సాంగ్ పెట్టి తీస్తున్నారని సమాచారం.
ఇలా పూటకో అప్డేట్ తో చికాకు పెడుతున్నారు. ఇక సలార్ సినిమా ఏకంగా 2024లో మార్చికి పోస్ట్ పోన్ అయ్యిందని గాసిప్స్ వినిపిస్తున్నాయి. గాసిప్ అని అందరికి తెలుసు… ఎందుకంటే సలార్ డిసెంబర్ 22వ తేదీన విడుదల కానుంది కాబట్టి. ప్రేక్షకులకు మదిలో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇలా క్లారిటీ ఇవ్వకుండా అనేక గాసిప్ లు రావటం.. మూవీ కోసం వెయిట్ చేస్తున్న ప్రేక్షకులకు నిరాశ ఎదురవుతోంది. అన్ని సంఘటనలు ఇలా ఉంటే తెలంగాణ, ఏపీలో డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు లిస్ట్ తయారవుతున్నాయట. సినిమా రిలీజ్ కోసం కొన్ని సంతాకాలు, ఒప్పందాలు చేసుకోవడం కూడా అయిపోయిందట. పోస్ట్ ప్రొడక్షన్ పనులు బయకు చెప్పవద్దంటూ స్ట్రిక్ వార్నింగ్ ఇచ్చారట ప్రశాంత్ నీల్. అనుకొని సంఘటలతో ఊహించని విషయాలతో సలార్ సినిమా విడుదలకి సిద్ధంగా ఉంది.
పోస్ట్ పోన్ లతో రానున్న సలార్ సినిమా salaar
సలార్ పాన్ ఇండియా మూవీగా డిసెంబర్ 22న మన ముందుకు రానుంది. పాన్ ఇండియా సినిమా అంటే ఆచితూచి అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు చిత్ర బృందం. హిట్ అయినా ప్లాప్ అయినా ప్రతిదీ హ్యండిల్ చేస్తూ చాలా జాగ్రత్తలు తీసుకుంటారు మూవీ యునిట్ వాళ్లు. అనుకున్నవన్నీ ఖచ్చితంగా జరుగుతాయని కాదు ఏదైనా పొరపాటు జరిగినా… సరైన రీతిలో కమ్యూనికేట్ చేయటం అవసరం. మొన్నటిదాక VFX పనులు పూర్తి కాకపోవటంతో సలార్ సినిమాను పోస్ట పోన్ చేశారు. ఆ రీ రికార్డింగ్ పనులు అంత పీక్స్ లో ఉన్నాయట. సలార్ ప్రమోషన్లు ఈ నెల చివరి నుంచి ఊపందుకోవాలి… కానీ సలార్ ట్రైలర్ వస్తే తప్ప సినిమా ఏ రెంజ్ లో ఉంటుందో తెలీదు. ఇక ఇప్పుడు అన్నీ పూర్తి చేసుకుని విడుదలకి సిద్ధంగా ఉంది.
సలార్ సినిమా హిట్ ను సొంతం చేసుకుంటుందా?
బాహుబలి పాన్ ఇండియా సినిమా తర్వాత ఇప్పటివరకు ప్రభాస్ కెరియర్ లో హిట్ కొట్టిన సినిమానే లేదు. ఇక అలాగే సలార్ సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమా అయిన హిట్ ను అందిస్తుందో లేదో చూడాలి మరి.