Mega
మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ, తన భర్త కల్యాణ్ దేవ్ తో మళ్లీ కలిసిపోయిందా? ఆమధ్యన ఇద్దరూ విడిపోయారని, వేర్వేరుగా ఉంటున్నారని రూమర్లు వచ్చాయి. కానీ ఇవాళ కల్యాణ్ దేవ్ పెట్టిన ఎమోషనల్ పోస్ట్ చూస్తే ఈ దంపతులిద్దరూ మళ్లీ కలిసిపోయారా అన్న అనుమానాలు కలుగుతున్నాయ్. వాస్తవానికి చిరంజీవి చిన్న కూతురు శ్రీజ వైవాహిక జీవితం ఒడిదుడుకులతోనే సాగుతోంది. మొదటి ప్రేమ పెళ్లి విఫలం కావడం, ఆపై కుమార్తెతో సహా పుట్టింటికి వచ్చేసిన శ్రీజ ఆ తర్వాత మొదటి భర్తకు విడాకులు ఇచ్చేసింది. అప్పటినుంచి పుట్టింట్లోనే ఉంటోంది. ఆ తర్వాత కొన్నాళ్లకు తన క్లాస్ మేట్ అయిన కల్యాణ్ దేవ్ ను శ్రీజ ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇద్దరూ ఇష్టపడటం, కల్యాణ్ దేవ్ ఫ్యామిలీ కూడా సంపన్న కుటుంబమే కావడంతో చిరంజీవి ఇద్దరికీ ఘనంగా పెళ్లి చేశాడు. ఈ జంట కొన్నాళ్లు సవ్యంగానే కాపురం చేసింది. వారికి నవిష్క పుట్టింది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా శ్రీజ Mega
రెండో వివాహం తర్వాత శ్రీజ సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యింది. తన భర్తతో చిన్న చిన్న వీడియోలు, క్లిప్పులు ఇన్ స్టా లో షేర్ చేస్తూ వచ్చింది. కల్యాణ దేవ్ పట్ల తన ప్రేమను సోషల్ మీడియా ముఖంగా వెల్లడిస్తూ వచ్చేది. సరదా సరదా వంటలు చేయడం, తన కుమార్తెతో చిలిపి కబుర్లు, చిన్న చిన్న సంఘటనలూ వారిద్దరి పట్ల కల్యాణ్ కు ఉన్న ప్రేమను వీడియోల ద్వారా చాటేది. సోషల్ మీడియాలో ఇద్దరూ ఒకరినొకరు ఫాలో అయ్యేవారు.
అలాంటిది రెండేళ్ల తర్వాత వీరిమధ్య పొరపొచ్చాలు వచ్చాయి. ఏం జరిగిందో ఏమోగానీ కల్యాణ్ దేవ్ , శ్రీజ ఇద్దరూ ఒకరిని ఒకరు అన్ ఫాలో చేసుకున్నారు. శ్రీజ సడెన్ గా తన భర్త వీడియోలన్నింటినీ తీసేసింది. కల్యాణ్ కూడా అలాగే శ్రీజతో ఉన్న బ్యూటిఫుల్ మూమెంట్స్ ను ఇన్ స్టా నుంచి డిలీట్ చేశాడు. కానీ కుమార్తె నవిష్క అంటే కల్యాణ్ దేవ్ కు చెప్పలేని ప్రేమ, అలాగే పెద్ద కూతురు అన్నా కూడా కల్యాణ్ చాలా బాగా చూసుకునేవాడు. నవిష్క తనతో గడిపే సమయం అతి తక్కువ అయినా అది తనకు స్వర్గం కంటే ఎక్కువని ఇన్ స్టా లో కల్యాణ చెబుతుండేవాడు. దానిని బట్టి ఈజంట మళ్లీ విడిపోయింది అని ప్రజలకు అర్ధమయ్యింది. వారంలో నాలుగు రోజులు తండ్రి కల్యాణ్ తో నవిష్క గడుపుతూ వచ్చేది.
ఊహలకు దారి తీసిన కల్యాణ్ పోస్ట్
ఇలా సాగుతున్న ఈ బంధంలో ఈ మధ్య కాలంలో మళ్లీ ఒక పాజిటివ్ పోస్టు కల్యాణ్ వైపు నుంచి కనిపించింది.‘ నేను 100% కాన్ఫిడెంట్ తో చెబుతున్నాను.. మా అమ్మ చేసిన పూజలు, ప్రార్ధనలు నా జీవితాన్ని నేను ఊహించని దానికంటే ఎక్కువగా మార్చాయి’ అని రాసుకొచ్చాడు. అలాగే తన కూతురు నవిష్క తో దిగిన ఫోటోను షేర్ చేశారు. కళ్యాణ్ ఇలా పోస్ట్ చేయటంతో శ్రీజ, కళ్యాణ్ లు కలిసిపోయారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. వరుణ్ పెళ్లిలో వీళ్ల జంట కలిసిపోయారని అనుకుంటున్నారు ప్రేక్షకులు.
ఇక కళ్యాణ్, శ్రీజ కలిశారా లేదా అనేది ఎవరో ఒకరు స్పందిస్తే కానీ చెప్పలేము. ఇక ఈ వార్త గాసిప్పా.. లేక నిజమేనా అనేది తెలియాల్సి ఉంది.కల్యాణ్ మెగా అల్లుడు అన్న బ్రాండ్ తో సినిమాల్లోకి అడుగు పెట్టినా.. నిలదొక్కు కోలేకపోయాడు. ఆ తర్వాత కల్యాణ్ రెండు, మూడు సినిమాలు చేసినా వాటికి వేటికీ మెగా స్టార్ ఫ్యామిలీ మద్దతు కనిపించలేదు. అయితే శ్రీజ మాత్రం ప్రొడ్యూసర్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలని ప్రయత్నిస్తోంది. ఏదేమైనా ఈజంట మళ్లీ కలిసిపోతే మెగా అభిమానులకు అంతకన్నా తీయని వార్త ఏముంటుంది?