JSP
జనసేన పార్టీ వ్యవహారాల గురించి ఆసక్తి కర వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్చే స్తున్నాయి. ఉడుకు రక్తం ఎగసిపడే ఈ సేన ఇప్పుడు కాంట్రవర్సీలకు కేరాఫ్ గా మారిపోయింది. పసుపు లేటి సందీప్.. ఈ యువకుడు ఆ పార్టీకి కరడు గట్టిన వీర విధేయ రామభక్త హనుమాన్.. పవర్ స్టార్ తో అత్యంత సన్నిహితంగా మెదిలిన వ్యక్తి. నాదెండ్ల మనోహర్ లాంటి స్థాయి వ్యక్తులతో సమానంగా పార్టీ సిద్ధాంతాలను, వ్యవహారాలను అవుపోసన పట్టిన వ్యక్తి. పవన్ కల్యాణ్ కోటరీలో అత్యంత కీలకమైన వ్యక్తి. పార్టీయే శ్వాసగా బతికిన వాడు.. పవన్ కోసం పాతికేళ్ల తన వ్యక్తిగత జీవితాన్ని ధారపోస్తానని ముందుకొచ్చిన వాడు. పార్టీ కార్యాలయమే ఊపిరిగా బతికిన వాడు. జనసేన పార్టీ వ్యవహారాలను కింద స్థాయినుంచి మొన్నటి వరకూ పై స్థాయి వరకూ కూలంకషంగా తెలిసిన వ్యక్తి. పవన్ ను సీఎంగా చూసేందుకు తన జీవితాన్ని ఫణంగా పెట్టిన పాతికేళ్ల నవయువకుడు.. అంతటి వీరాభిమాని ఇప్పుడు రోడ్డున పడ్డాడు.
రుక్మిణీ కోట చక్రబంధం JSP
పార్టీలో పవన్ వ్యక్తిగత సహాయకురాలు రుక్మిణి కోట, నాదెండ్ల మనోహర్ లాంటి వ్యక్తుల దాష్టీకానికి బలైపోయానని వారం రోజులుగా మీడియాకెక్కి తన ఆవేదన వ్యక్తం చేస్తున్న వ్యక్తి సందీప్.. తనకు న్యాయం చేయలేని పవన్ రాష్ట్ర ప్రజలకు ఎలా న్యాయం చేస్తాడంటూ నిలదీస్తున్న వ్యక్తి.. పార్టీ కార్యాలయంలోనే 24గంటలూ ఉంటూ, తింటూ విలువైన తన వ్యక్తిగత సమయాన్ని పార్టీ నిర్మాణం కోసం వెచ్చించిన వ్యక్తి.. సివిల్స్ కు ప్రిపేర్ అయ్యే వ్యక్తి. – పాతికేళ్లు నాతో ట్రావెల్ చేయగలవా నిన్ను ఢిల్లీ స్థాయిలో కూర్చోబెడతా.. నీలాంటి వ్యక్తులు నాకు కావాలంటూ- పవన్ కల్యాణ్ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ కు బలైన వ్యక్తి..
జీతం ఇవ్వకుండా వెళ్ల గొట్టారా?
రుక్మిణీ కోట వచ్చిన తర్వాత ఆఫీస్ వాతావరణం మారిపోయిందంటున్నాడు సందీప్.. పార్టీ మొత్తాన్ని ఆమె హస్తగతం చేసుకుందని, పార్టీ కోసం కష్టపడిన తమలాంటి వారిని ఎలాంటి కారణం చెప్పకుండా తొలగించేలా చేసిందని ఆక్రోశిస్తున్నాడు. పార్టీ ఆఫీస్ లో అనేక అవకతవకలు జరుగుతున్నాయని ఒక్కటొక్కటిగా వివరిస్తున్నాడు. ఆమె మాటలు నమ్మి పవన్ తనను దూరం చేసుకున్నారని , తన వాదన వినకుండా కనీసం జీతం ఇవ్వకుండా తనను వెళ్ల గొట్టారని ఇందుకు కారణం తనకు తెలియాలని సందీప్ నిలదీస్తున్నాడు. సివిల్స్ ప్రిపరేషన్ ను పక్కన పెట్టి పవన్ కోసం తన జీవితాన్ని త్యాగం చేశానని ఆక్రోశిస్తున్నాడు.
ఫైళ్లు తగలబడ్డాయా? తగల పెట్టారా?JSP
పార్టీ కోశాధికార విభాగం హటాత్తుగా ఎందుకు అగ్ని ప్రమాదానికి బలైందో తెలియాలని ప్రశ్నిస్తున్నాడు. కీలకమైన పార్టీ ఆర్థిక వ్యవహారాల లెక్కలన్నీ బుగ్గిపాలు ఎందుకయ్యాయి?కావాలనే తగుల బెట్టారా? దీనికి కారణాలేంటో తేలాలి? తాను లేని సమయంలోనే పార్టీ ఆఫీస్ లో ఫైర్ యాక్సిడెంట్ అయ్యిందని అసలు యాక్సిడెంట్ అవడానికి ఆస్కారమేలేని చోట ప్రమాదం ఎందుకు జరిగిందని సందీప్‌ని లదీస్తున్నాడు.
జనసేన JSP ఆర్థిక లావాదేవీలు ఎందుకు మూడో కంటికి తెలియకుండా అగ్నికి ఆహుతి చేశారు? ఇందులో ఎవరి హస్తముంది? తనకున్న అనుమానాలను పవన్ తో షేర్ చేసుకుంటానంటే కనీసం అపాయింట్మెం ట్ ఇవ్వలేదు. మరొకరితో ఫోన్ చేయించి ఆఫీస్ వదిలి వెళ్లిపోమన్నారంటూ సందీప్ ఆరోపిస్తున్నాడు.. జనసేన ఆర్థిక లావాదేవీలు బుగ్గి పాలు కావడానికి కారణమేంటి? పార్టీకి వచ్చే విరాళాల వివరాలు ఎందుకు తగులబడిపోయాయి. మొన్నా మధ్య పవన్ భార్య అన్నాలెజినోవా సింగపూర్ లో భారీ నగదు తో కూడిన సూట్ కేసుతో పట్టుబడినట్లు, ఉన్నతాధికారులతో ఒత్తిడి చేయించి, చాలా వివరాలు సమర్పించాకే ఆమె విడుదలయినట్లు కూడా సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి.
పోరాటం ఆగబోదంటున్న సందీప్ JSP
ఈ వ్యవహారాలన్నింటి వెనకా ఏదైనా కారణముందా?పార్టీ వ్యవహారాల్లో అవకతకవలు జరిగాయంటూ 40 మందిని ఈమధ్యే తొలగించారు. ఆ విషయాన్ని వారాహి వేదికగానే పవన్ ప్రకటించారు. మరి సందీప్ ఆరోపణలకు సమాధానం మాత్రం చెప్పడం లేదు. సందీప్ ను ఎందుకు తొలగించినట్లో పవన్‌వి వరణ కూడా ఇవ్వలేదు. తనకు సవివరణతో కూడిన జవాబు వచ్చే వరకూ తన పోరాటం ఆగదంటున్నాడు సందీప్. ఇన్ని ఆరోపణలు చేస్తున్న ఈ సందీప్ ఎవరో కాదు.. అనంతపురం జిల్లాలో అత్యంత క్రియాశీలకంగా ఇతర పార్టీలను ఎదుర్కొని పవన్ కల్యాణ తో ప్రశంసలు అందుకున్న పసుపులేటి పద్మావతి కుమారుడు. ఇప్పుడు తన తల్లిని, తనను కూడా పార్టీ వ్యవహారాలకు దూరం చేయడం పట్ల ఈ కుటుంబం తీవ్రమైన మనో వేదనకు గురవుతోంది.
పార్టీ కార్యకర్తలు లేనిదే పార్టీయే ఉండదు. జనసేనకు వెన్నెముకలా నిలిచిన వారందరూ ఒక్కొక్కరుగా పార్టీకి దూరమవడం చూస్తుంటే పవన్ కల్యాణ్ కార్యాలయంలో నిబద్ధత, నిజాయితీతో కూడిన వ్యవహారాలు సాగడం లేదన్నది అర్ధమవుతోంది. కమిట్ మెంట్ తో కూడిన రాజకీయాలు చేయాలంటే ఇలాంటి సిన్సియర్ కార్యకర్తలను వదులు కోకూడదు. మరి పవన్ ఎందుకు ఇలాంటి పొరపాట్లు చేస్తున్నట్లు? జనసేనాని తనంతట తాను నోరు విప్పితే కానీ దీనికి సమాధానం దొరకదు.
ప్రాణాలిచ్చే కార్యకర్తల ప్రశ్నలకు పవన్ నీ దగ్గర ఆన్సరుందా?