sensitive feet
మన శరీరంలోని ఉండే అన్ని భాగాలు మనకు ముఖ్యమే. కానీ కాళ్లను మాత్రం అంతగా పట్టించుకోము. వాటి గురించి సరైన కేర్ కూడా తీసుకోము. మన శరీరంలో ముఖానికి ఇచ్చే ఇంపార్టెన్స్ పాదాలకు ఇవ్వము. పాదాలు అందంగా సురక్షితంగా ఉంచుకోవడం అంత సులభం ఏమి కాదు. ఎందుకంటే పాదాలు ఎక్కువగా స్ట్రెయిన్ అవుతూ ఉంటాయి. చాలా మంది ముఖం, చేతులను అందంగా ఉంచుకోవడంలో ఎక్కువ ఆసక్తి చూపుతారు. రకరకాల క్రీమ్ప్ ని వాడుతుంటారు. పాదాలపై మాత్రం అశ్రద్ధ చూపుతారు. ఇలా చేయడం వల్లనే పాదాలపై డెడ్ స్కిన్ సెల్స్, మురికి బాగా పేరుకు పోవడం వల్ల పాదాలు అంద విహీనంగా కనిపిస్తాయి. వీటిని పట్టించుకోకపొవడం వల్ల కాళ్ళు గట్టిగా మారిపోవడం, పగుళ్లు రావడం వంటి సమస్యలు వస్తుంటాయి. పాదాలు చాలా సున్నితమైనవి. వాటి పట్ల సరైన కేర్ తీసుకుంటే అవి కూడా ఎంతో అందంగా కనిపిస్తాయి. అదే విధంగా సమస్యలు రాకుండా జగ్రత్తపడవచ్చు.
ఫుట్ కేర్ ని పాటించడం చాలా ముఖ్యం… sensitive feet
ఆరోగ్యకరమైన అలాగే అందమైన పాదాలను పొందేందుకు ఫుట్ కేర్ ను పాటించడం ఎంతో అవసరం. ఇంట్లోనే క్రమం తప్పకుండా సరైన ఫుట్ కేర్ ను పాటిస్తే అందమైన పాదాలు మీ సొంతమవుతాయి. పాదాలు సహజసిద్ధమైన అందాన్ని పెంపొందించడానికి అనేక ఫుట్ కేర్ టిప్స్ మరియు ట్రిక్స్ ని ఫాలో అవాల్సివుంటుంది. వీటిని పాటించడం ద్వారా పాదాల నొప్పులను తగ్గించుకుని, బాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ నుంచి రక్షణను పొందవచ్చు. అలాగే పాదాలకు మాయిశ్చరైజర్ ను కూడా అందించవచ్చు. పాదాలను అందంగా మార్చడంలో ఉపయోగ పడే కొన్ని రకాల టిప్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
స్క్రబ్(రుద్దడం) చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు:
పాదాలకు స్క్రబ్ చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. పాదాల్లో రక్త ప్రసరణ మెరుగవుతుంది. నొప్పులు లాంటివి ఏమైనా ఉంటే తగ్గుతాయి. పాదాలపై పేరుకుపోయిన మురికి, మృత కణాలు తొలగి పోతాయి. మెదడు నుంచి పాదాలకు కొన్ని రకాల నాడులు ఉంటాయి. పాదాలకు మర్దనా చేయడం వల్ల మెదడు కూడా రిలీఫ్ అవుతుంది.
పాద సమస్యలను దూరం చేసే ఇంటి చిట్కాలు: sensitive feet
1. రోజులో చాలా సేపు నిలబడటం వల్ల పాదాలు నొప్పులు పెడతాయి. ఈ నొప్పిని తగ్గించడంలో బేకింగ్ సోడా బాగా హెల్ప్ చేస్తుంది. కొద్దిగా బేకింగ్ సోడాకు నీటిని కలిపి పేస్ట్ లా చేసుకోవాలి. కాసేపు సున్నితంగా మసాజ్ చేసుకుని, పది నిమిషాల తర్వాత కడిగేసుకోండి. లేదా గోరు వెచ్చని నీటిలో కొద్దిగా బేకింగ్ సోడా వేసి అందులో ఓ పది నిమిషాలు కాళ్లను ఉంచండి. ఇలా చేసినా కూడా నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
2.కొద్దిగా బ్రౌన్ షుగర్ లో ఆలీవ్ ఆయిల్ వేసి పాదాలకు, మడమలకు సున్నితంగా మసాజ్ చేయండి. ఇలా ఐదు నిమిషాల పాటు చేసుకోండి. ఆ తర్వత శుభ్రంగా పదాలను క్లీన్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పాదాలు ఫాస్ట్ గా, కాంతి వంతంగా తయారవుతాయి.
3.ఒక చిన్న బౌల్ లోకి కాఫీ పొడిని, పంచదారను సమపాళ్లలో తీసుకోవాలి. ఇందులోకి కొబ్బరి నూనె లేదా ఆలీవ్ ఆయిల్ ని కానీ తీసుకుని పేస్ట్ లా కలుపుకోవాలి. ఈ పేస్ట్ ని పాదాలకు, మడమలకు రాసి.. బాగా మర్దనా చేసుకోవాలి. ఓ పది నిమిషాల తర్వాత కాళ్లను శుభ్రం చేసుకోవాలి. దీని వల్ల పాదాలు శుభ్ర పడతాయి.