110
నట సింహ నందమూరి బాలకృష్ణ రీసెంట్ గా భగవంత్ కేసరి సినిమాతో మన ముందుకు వచ్చాడు. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. తూటాల్లాంటి డైలాగులతో, యాక్షన్ మూవీలో నటించి ప్రేక్షకులందరిని మెప్పిస్తుంటాడు ఈ నట సింహ. ప్రస్తుతం బాలయ్య 109వ సినిమాతో మన ముందుకు రానున్నాడు. ఇక ఈ సినిమా బాబీ-బాలయ్య కాంబోలో మన ముందుకు రానుంది. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది.. రీసెంట్ గానే ఈ మూవీ షూటింగ్ ను కూడా ప్రారంభించారు. ఇప్పటి వరకు వచ్చిన బాలయ్య సినిమాలన్ని భారీ బడ్జెట్ తో వచ్చినవే. ఇక ప్రస్తుతం బాలకృష్ణ 110 సినిమా అప్డేట్ లేకుండా ఒక పోస్టర్ లీక్ అయింది. అసలు ఆ పోస్టర్ ఏంటి? ఎవరి దర్శకత్వంలో ఈ సినిమా రానుంది? విషయానికి వస్తే…..
బాలయ్య 110వ మూవీ పోస్టర్ లీక్ 110
బాబీ దర్శకత్వంలో వస్తున్న సినిమాలో బిజీగా ఉన్నాడు బాలయ్య. ఊహించని విధంగా NBK 110వ సినిమాకు సంబంధించిన పోస్టర్ లీక్ అయింది. ఇక ఈ పోస్టర్ అధికారికంగా రిలీజ్ చేసింది కాదు. కానీ బాలయ్య లుక్ మాత్రం ప్రస్తుతం వైరల్ అవుతుంది. పోస్టర్ లో బాలయ్య రాజు గెటప్ లో యద్ధవీరుడు… సీరియస్ గా ఎవరికో వార్నింగ్ ఇస్తున్న పోస్టర్ లీక్ అయింది. బాలయ్య లుక్ మాత్రం కేక పుట్టిస్తుంది. ఈ పోస్టర్ పైన బాలయ్య 110 అని #బ్యాటిల్ ఆఫ్ బ్రిత్స్(# BATTLEOFBREATHS) అనే హ్యష్ ట్యాగ్ తో ఉంది. ఇక NBK110 సినిమాను ప్రకటించిందే లేదు…. ఎవరి దర్శకత్వంలో వస్తుందో కూడా తెలియదు కానీ అప్పుడే పోస్టర్ లీక్ అవ్వటం అందరిని ఆశ్చర్యనికి గురిచేసింది. ఇక ఈ పోస్టర్ నిజమో కాదో తెలియాలి…. లేక ఈ పోస్టర్ అభిమానులు సరదాగా చేసిందా? మరి ఈ పోస్టర్ ఎవరు రిలీజ్ చేశారు అనేది ప్రశ్నగా మిగిలిపోయింది. ఇన్ని ప్రశ్నలకు చిత్ర బృందమే క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది.
బాలయ్య పోస్టర్ కి ఫ్యాన్స్ రియాక్షన్: 110
లీక్ అయిన పోస్టర్ లోని లుక్ మాత్రం శాతకర్ణి మూవీలో రాజు గెటప్ లాగా ఉందని కొందరు కామెంట్స్ పెడుతున్నారు. మరి కొందరు న్యూ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడని చేబుతున్నారు. ఏది ఏమైనా బాలయ్య లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఒక వైపు సినిమాల్లో మరొకవైపు రాజకీయాల్లో బిజీగా ఉన్నాడు బాలయ్య. ఎంత బిజీగా ఉన్నా ప్రేక్షకులను మాత్రం నిరాశ పరచడం లేదు. వరుస హిట్ లతో ఫ్యాన్స్ ని సంతోషపరుస్తున్నాడు.
నటించిన ప్రతి సినిమా 100 కోట్ల హ్యాట్రిక్:
ఈ మధ్య కాలంలో బాలయ్య నటించిన ప్రతి సినిమా హ్యాట్రిక్ కొట్టకుండా లేదు. ఆయన నటించిన ఆఖండ, వీరసింహరెడ్డి, భగవంత్ కేసరి సినిమాలు వరుసగా 100 కోట్ల హ్యాట్రిక్ ను సొంతం చేసుకున్నాయి. వరుస హిట్ లతో దూసుకుపోవడం చూసిన ఫ్యాన్స్ పుల్ ఖుష్ అవుతున్నారు.