Foxtail Millet
ఈ మధ్యకాలంలో చాలా మంది దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడటంతో పాటు ఆ వ్యాధుల వల్ల నిత్యజీవితంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మన ఆహరపు అలవాట్లే అనేక అనారోగ్య సమస్యలకు కారణమవుతున్నాయి. మనం తినే ఆహారం మన శరీరానికి అన్ని విధాలుగా మేలు చేసేవిగా ఉండాలి. వాటి ద్వారా అందే శక్తి మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేదిగా ఉండాలి. శరీరానికి శక్తితో పాటు వివిధ పోషకాలు అందించే కొర్రలు ఇప్పుడు చాలా మంది ఆహారంగా తీసుకుంటున్నారు.. చిరుధాన్యాలను ఆహరంగా తింటే అనేక ఆరోగ్య సమస్యలను దూరం పెట్టవచ్చు.వీటిలో ఒకటైన కొర్రలు శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తాయి.
కొర్రల్లోని పోషకవిలువలు…
కొర్రల్లో అధికంగా పీచు పదార్థం, మాంసకృతులు, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్, ధైమిన్, రైబోఫ్లేవిన్, భాస్వరం వంటి అనేక ఖనిజాలు ఉంటాయి. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. (Foxtail Millet)
రైస్ బదులు కొర్రలు…ఎలా వాడాలంటే…
బియ్యాన్ని ఎక్కువగా పాలిష్ చేయడం వలన దానిలో ఉండే పోషక విలువలు తగ్గిపోతాయి. తద్వారా అనేక రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. ఈ సమస్యను అధిగమించేందుకు చిరుధాన్యాలుగా పిలుచుకునే కొర్రలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కొర్రలు తీపి వగరు రుచిని కలిగి ఉంటాయి. కొర్రలు కనీసం 4 గంటలు నానబెట్టిన తరువాతే వండుకోవాలి. సమయాభావం ఉంటె ముందురోజు రాత్రే నానబెట్టుకోవచ్చు. వరి బియ్యం వండుకున్నట్లుగానే కొర్ర బియ్యాన్ని వండుకోవచ్చు.. అలాగే కొంచెం ఉప్పు, పెప్పర్ పౌడర్ ని కలుపుకొని తాగొచ్చు. కుదిరితే పెరుగు కూడా వేసుకుంటే ఇంకా మంచిది చలువ చేస్తుంది. శరీరానికి శక్తితో పాటు వివిధ పోషకాలు అందించే కొర్రలు ఇప్పుడు చాలా మంది ఆహారంలో భాగంగా తీసుకుంటున్నారు..
దీర్ఘకాలిక వ్యాధులకు మేలు చేసే కొర్రలు… (Foxtail Millet)
షూగర్ వ్యాధితో బాధ పడేవాళ్లకు కొర్రలు మంచి ఆహారం అని చెప్పవచ్చు. పిల్లలు, గర్భిణులకు కొర్రలు భేషుగ్గా తినొచ్చు.వీటితో జీర్ణశక్తి మెరుగుపడుతుంది. వీటిలో ఐరన్, మాంసకృత్తులు అధికంగా ఉండటంతో మలబద్దకం, గ్యాస్, అజీర్తి వంటి సమస్యలు తగ్గుతాయి. మతిమరపు, మూర్ఛ రోగాలను తగ్గించడంలో కూడా కొర్రలు ఎంతగానో తోడ్పడతాయి. వీటితో గంజి చేసుకుని తాగితే జ్వరం తగ్గుతుందని పెద్దలు చెబుతుంటారు. ఇవి ఏకాగ్రతను, జ్ఞాపకశక్తిని కూడా పెంచడంలో సహయపడతాయి. ప్రతి రోజు రైస్‌కు బదులుగా కొర్రలు తీసుకోవడం వల్ల ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ప్రాణాంతకమైన క్యాన్సర్ కణాలను నాశనం చేస్తాయి. ఇక రెగ్యులర్‌గా కొర్రలు తీసుకోవడం వల్ల దృఢంగా మారతారు. కిడ్నీలో రాళ్లు లేదా కిడ్నీకి సంబంధించిన వ్యాధులు కూడా కొర్రలు దూరం చేస్తాయి. కడుపునొప్పి సమస్య ఏదైనా ఉన్నా. అరుగుదల సమస్య ఉన్నా కూడా కొర్రలు అద్భుతంగా పనిచేస్తాయి. వీటిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల అధిక బరువును తగ్గించుకోవచ్చు. గుండెజబ్బులు, రక్తహీనత, ఊబకాయం, కీళ్ళవాతం, రక్తశ్రావం, కాలిన గాయాలు త్వరగా తగ్గటానికి కొర్రలు తినడం మంచిది. (Foxtail Millet)