కేరళ కుట్టి అమలాపాల్ (Amala Pal) కొత్త జీవితానికి శ్రీకారం చుట్టింది. ప్రపోజ్ చేసిన 10 రోజులే అయింది అప్పుడే పెళ్లి చేసుకున్నారు అమలాపాల్- జగత్ దేశాయ్. అమలాపాల్ కి ఇది రెండో పెళ్లి. కేరళలోని కొచ్చిలో ఆదివారం(నవంబర్ 5వ తేదిన) వీరి పెళ్లి పెద్దల సమక్షంలో కొద్ది మంది బంధువులతో అంగరంగ వైభవంగా జరిగింది. మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు ఈ జంట. వీరి పెళ్లి ఫోటోలను ఇరువురు సోషల్ మీడియాలో షేర్ చేశారు. రెండు మనసులు ఒక్కటైన వేళ.. జీవితాంతం ఈ చేయి వదలను అని క్యాప్షన్ తో వారి పెళ్లి పిక్స్ షేర్ చేసుకున్నారు ఇరువురు. పెళ్లిలో జగత్ లావెండర్ కలర్ షేర్వాణీలో, లావెండర్ కలర్ లెహంగా ధరించి ఇరువురు మ్యాచింగ్ కలర్ లో అందరిని ఆకట్టుకున్నారు. ప్రస్తుతం వీరి ఫోటోలు వైరల్ గా మారగా సెలబ్రిటీలు, ఫ్యాన్స్ న్యూ కపుల్ కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ప్రపోజ్ చేసిన 10 రోజుల్లోనే పెళ్లి
అమలా పాల్ బర్త్ డే అంటే అక్టోబర్ 26వ తేదిన ఆమెకు ప్రపోజ్ చేశాడు జగత్ దేశాయ్. జగత్ దేశాయ్ ఈవెంట్ మేనేజర్ గా పనిచేస్తున్నాడు. ఓ బర్త్ డే పార్టీలో మోకాళ్ల పై కూర్చుని నన్ను పెళ్లి చేసుకుంటావా? అని పక్కా సినిమా స్టైల్ లోనే జగత్ అడిగాడు. ప్రపోజ్ చేసిన వెంటనే సర్ ప్రైజ్ అయిన అమె వెంటనే నవ్వుతూ లిప్ లాక్ కిస్ ఇచ్చి ఒకే చేప్పేసింది. దీంతో ఆదే క్షణంలో అమలాపాల్ కి ఉంగరం తొడిగి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు ఇరువురు. ఆ ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. అలా జరిగిన 10 రోజులకే పెళ్లి పీటలేక్కేశారు. ఇరువురు జీవితంలో కొత్త అధ్యయాన్ని మొదలు పెట్టారు.
రిలేషన్ షిప్స్: (Amala Pal)
అమలాపాల్ కెరీర్ పీక్స్ లో ఉన్న టైమ్ లోనే పెళ్లి చేసుకుంది. 2014లో డైరెక్టర్ ఏ యల్ విజయ్ ని ప్రేమ పెళ్లి చేసుకుంది ఈ కేరళ కుట్టి. పట్టుమని పది సంవత్సరాలు కూడా కలిసి ఉండలేకపోయారు ఈ జంట… పెళ్లి చేసుకొని మూడేళ్లకే కొన్ని కారణాల చేత విడిపోయారు. అలా జరిగిన కొన్ని ఏళ్లకు భవీంధర్ అనే సింగర్ తో రిలేషన్ లో ఉంది. వీరు ఇద్దరు కలిసి బిజినెస్ షురు చేశారు. ఇద్దరికి పెళ్లి కూడా జరిగిందని వార్తలు వచ్చాయి. కానీ పెళ్లి విషయం బయటకు మాత్రం చెప్పలేదు. చివరకు భవీందర్ మోసం చేశాడని ఆరోపణలు చేసింది అమలాపాల్. వీరద్దరు పోలీస్ స్టేషన్ దాక వెళ్లిన రోజులు కూడా ఉన్నాయి. ఇలా రెండు రిలేషన్ లతో విడిపోయిన అమలాపాల్ చివరకు కెరీర్ పై ఫోకస్ పెట్టింది. హీరోల సరసన హీరోయిన్ గా, లేడీ ఓరియెంట్ డ్ మూవీస్ లో నటిస్తూ బిజీగా ఉంది. సోషల్ మీడియాలో తన గ్లామర్ ఫోటోలను షేర్ చేసి కుర్రాళ్లకు నిద్రలేకుండా చేసింది. రీసెంట్ గా జగత్ దేశాయ్ తో రిలేషన్ ఉండి చివరకు మూడు ముళ్లు వేయించుకుంది.
(Amala Pal)