Anushka Shetty
లేడీ ఓరియంటెడ్ మూవీస్ కి పెట్టింది పేరు అనుష్క శెట్టి. అటు హీరోయిన్ లకే కాదు ఇటు హీరోలకు కూడా గట్టి పోటి ఇస్తుంది ఈ అమ్మడు. సూపర్ మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అరుంధతి, రుద్రమదేవి, భాగమతి, సైజ్ జీరో సినిమాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అటు లేడీ ఓరియంటేడ్ మూవీస్ ను చేయడం తో పాటు ఇటు స్టార్ హీరోల సరసనా హీరోయిన్ గా తన హవా నడిపిస్తుంది. నటించిన ప్రతి సినిమా హిట్ ను సొంతం చేసుకోవటం…. ఎన్నో అవార్డులను దక్కించుకుంది. అందం, అభినయం, నటనతో ఎంతో మంది ఫ్యాన్స్ ను సొంతం చేసుకుంది ఈ మాంగుళూరు బ్యూటి. సౌత్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో బిజీగా ఉంటుంది. స్వీటీ నేడు తన 42వ బర్త్ డే జరుపుకుంటుంది. తన బర్త్ డే ను ఫ్యామిలీ, స్నేహితులతో కలిసి సెలబ్రేట్ చేసుకోనుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో అభిమానులు, సహనటులు ఆమెకు బర్త్ డే విషెస్ చెబుతున్నారు.
బర్త్ డే రోజున క్రేజీ సర్ ప్రైజ్ :
ఏ సెలబ్రిటీ బర్త్ డే అయినా ఒక మూవీ అప్డేట్ తో మన ముందుకు వస్తారు. అలాగే స్వీటీ బర్త్ డేని అటు టాలీవుడ్ ఇటు కొలీవుడ్ మూవీస్ లో నటించనుందట. టాలీవుడ్ లో భాగమతి టీమ్ వాళ్లు సాలిడ్ సర్ ప్రైజ్ ను ఇచ్చారు. అసలు ఏంటి ఆ సర్ ప్రైజ్? అసలు విషయానికి వస్తే భాగమతి-2 ను అధికారంగా ప్రకటించనున్నట్లు సమాచారం. 2018 లో భాగమతి సినిమా తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ చేశారు మేకర్స్. ఈ మూవీకి జి. అశోక్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా సూపర్ హిట్ ను అందుకుంది. ఐదేళ్ల తరువాత దానికి సీక్వల్ గా భాగమతి-2 సినిమాను అనౌస్స్ చేశారు.
ఇది అనుష్క నటిస్తున్న 50వ మూవీ కావటం విశేషం. అలాగే వశిష్ట దర్శకత్వంలో ఓ సినిమా రానుంది. ఆ సినిమాలో చిరంజీవి హీరోగా అనుష్క , హీరోయిన్ గా రానుందని సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకున్నారు. ఇక ఈ మూవీ యూవీ క్రియేషన్స్ లో రానుంది. కోలీవుడ్ లో మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ అమ్మడు. ‘హోమ్’ మూవీ తో మన ముందుకు రానుంది. ఈ మూవీకి ఫేమ్ రోజిన్ థామస్ దర్శకత్వం వహిస్తున్నాడు. జె సూర్యకు జోడిగా అనుష్క నటించనున్నట్లు సమాచారం. రిసెంట్ గా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీతో మన ముందుకు వచ్చింది. ఈ మూవీ సింపుల్ స్టోరితో మన ముందుకు వచ్చి హిట్ ను సొంతం చేసుకుంది.
సిని ఇండస్ట్రీకి ఎంట్రీ : Anushka Shetty
స్వీటీ మూవీ ఇండస్ట్రీకి రాకముందు యోగా టీచర్ గా పనిచేసేదట. సూపర్ మూవీ కొసం హీరోయిన్ ను వెతుకుతూ ఉండగా పూరీకి అనుష్క కనిపించిందట. పూరి అనుష్క ను ఒ హోటల్ లో కలిసి ఆమె గురించి అన్ని వివరాలు కనుక్కొని అన్నపూర్ణ స్టూడియోలో ఈమెకు యాక్టింగ్ శిక్షణ ఇచ్చారట.ఇక సూపర్ మూవీతో నాగర్జున సరసన హీరోయిన్ గా చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టింది. అనుష్క అసలు పేరు స్వీటీ. సిని పరిచయం చేసింది, పేరును కూడా మార్చింది పూరి జగన్నాద్. 2005లో కెరీర్ ను స్టార్ట్ చేసి స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటిస్తూ మంచి హిట్ లను దక్కించుకుంటుంది. హీరోయిన్ గా అనుష్క మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుందాం… హ్యాపీ బర్త్ డే అనూష్క !!!