TSH
థైరాయిడ్ ఒక దీర్ఘ కాలిక సమస్య. భారత దేశంలో ప్రతి పది మందిలో ఒకరి కన్నా ఎక్కువ మంది థైరాయిడ్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్య మగవారిలో కన్నా, ఆడవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. గొంతు ముందు భాగంలో ఉండే థైరాయిడ్ గ్రంథి నుంచి ఉత్పత్తి అయ్యే హార్మోన్ ప్రభావం శరీరంలోని దాదాపు ప్రతి అవయవం మీదా ఉంటుంది. ఈ హార్మోన్ ఉత్పత్తి తగ్గితే హైపో థైరాయిడ్ అని, అధికంగా అయితే హైపర్ థైరాయిడ్ అని అంటారు. హైపో థైరాయిడ్ సమస్య హైపర్ థైరాయిడ్ కన్నా అయిదు రెట్లు అధికంగా ఉంటుంది అని డాక్టర్స్ అంటున్నారు.
థైరాయిడ్ టెస్ట్ లో తేడాలు TSH
థైరాయిడ్ రక్త పరీక్ష రిపోర్ట్ ఎన్నో విషయాల మీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు, గత నెలలో కొన్ని రోజులు మందులు వేసుకోకపోయినా, ఈ మధ్య కాలంలో ఏమైనా ఇన్ఫెక్షన్ లేక జ్వరం వచ్చినా, ల్యాబ్ నమ్మకమయినది కాకపోయినా, ఆ రిపోర్ట్ తో ఎలాంటి నిర్ధారణకు రాలేము. కాబట్టి కేవలం పేపర్ మీద ఉన్న నంబర్లను చూసి చికిత్స సూచించడం సరికాదు. రోగిని వైద్యులు పరిశీలించి, వారిలో లక్షణాలను బట్టి మాత్రమే సరైన చికిత్స అందించగలరు. గర్భిణుల్లో ఈ సమస్యను ముందుగా గుర్తించకపోతే, పుట్టే పిల్లల్లో మేధాపరమైన లోపాలు ఉండవచ్చు. చిన్న తనంలోనే ఈ సమస్య గుర్తించడం మంచిది. లేదంటే, పిల్లల ఎదుగుదల శారీరకంగానే కాదు, మానసికంగానూ మందగించే ప్రమాదం ఉంది.
హైపో థైరాయిడ్ లక్షణాలు
నీరసం, మలబద్ధకం, చర్మం, వెంట్రుకలు పొడిబారడం, ఎక్కువ నిద్ర, బరువు పెరగడం, నెలసరిలో రక్తస్రావం ఎక్కువగా లేక తక్కువగా అవ్వడం, గర్భస్రావం, చలిని తట్టుకోలేక పోవడం, గుండె తక్కువ సార్లు కొట్టుకోవడం, జుట్టు రాలడం, థైరాయిడ్ గ్రంథి వాపు తదితర లక్షణాలు ఉంటాయి.
హైపర్ థైరాయిడ్ లక్షణాలు
ఆకలి ఎక్కువ అవ్వడం, బరువు తగ్గడం, చెమటలు ఎక్కువ పట్టడం, చిరాకు, స్థిమితం లేకపోవడం, నిద్ర లేమి, నీరసం, ఎక్కువసార్లు విరేచనం అవ్వడం, నెలసరిలో రక్తస్రావం తక్కువగా అవ్వడం, వేడిని తట్టుకోలేక పోవడం, గొంతు ముందు వాపు, గుండె దడ అనిపించడం, కళ్ళు పెద్దవిగా అవ్వడం, చేతులు వణకడం వంటివి కనిపిస్తుంటాయి.
ట్యాబ్లెట్లు ఎలా వాడాలి ?
ముఖ్యంగా ట్యాబ్లెట్లు ప్రతి రోజూ క్రమం తప్పకుండా వేసుకోవాలి. మధ్యలో కొద్ది రోజులు మానేసినా, దాని ప్రభావం TSH స్థాయి మీద ఆరు వారాల వరకు ఉంటుంది.ప్రతి రోజూ ఉదయాన్నే థైరాయిడ్ టాబ్లెట్ వేసుకున్నాక, కనీసం అర్ధ గంట వరకు ఎటువంటి ఆహారం తీసుకోకూడదు. పాలు, టీ, కాఫీ కూడా తాగకూడదు. అవేవి తీసుకున్నా, టాబ్లెట్ పూర్తిగా ఒంట పట్టదు.థైరాయిడ్ ఒక హార్మోన్ అవ్వడం వల్ల, ఆ టాబ్లెట్ చేతితో తాకినా కూడా దాని ప్రభావం తగ్గిపోయే అవకాశం ఉంది.అదీ తడి చేతితో తాకితే, ఆ టాబ్లెట్ ప్రభావం ఇంకా ఎక్కువ తగ్గిపోతుంది.
థైరాయిడ్ ఎంత ఉండాలి ?
TSH సాధారణ స్థాయి 0.4 mU/L నుండి 4.0 mU/L వరకు ఉంటుంది. 2.0 కంటే ఎక్కువ ఉండే TSH స్థాయిని హైపోథైరాయిడ్గా పరిగణిస్తారు. అదే థైరాయిడ్ స్థాయి 0.4 mU/L నుండి 4.0 mU/L కంటే తక్కువగా ఉంటే, అది హైపర్ థైరాయిడ్గా పరిగణిస్తారు. థైరాయిడ్ రిపోర్టులో కనిపించే T3,T4 స్థాయిలు అనేవి మన శరీరంలోని అవయవాల జీవక్రియలకు సంబంధించినవి. అయితే, T3,T4తయారీకి TSH థైరాయిడ్ స్టిములేటింగ్ హార్మోన్ అనేది అవసరం.ఎప్పుడైతే శరీరంలో T3,T4 తగ్గుతాయో, అప్పుడు వీటి ఉత్పత్తిని పెంచడానికి TSH ఎక్కువగా విడుదల అవుతుంది.
నిర్లక్ష్యం చేయకూడదు…TSH
థైరాయిడ్ గ్రంథిలో వాపు ఉన్నప్పుడు, సంబంధిత రక్త పరీక్ష సాధారణంగా ఉన్నంత మాత్రాన ఎలాంటి సమస్య లేదు అని అనుకోవడానికి లేదు.రక్త పరీక్ష బాగుండి, గొంతు ముందు భాగంలో గడ్డ లాగా, లేక వాపు లాగా ఉంటే, నిర్లక్ష్యం చేయకూడదు.అది కొన్నిసార్లు థైరాయిడ్ క్యాన్సర్ లక్షణం అయివుండవచ్చు. కాబట్టి, వెంటనే గొంతు స్కాన్ చేయించడం, అవసరమైతే ఆ వాపు నుండి సూది ద్వారా ముక్క తీసి FNAC పరీక్ష చేయడం మంచిది. థైరాయిడ్ క్యాన్సర్ చాలా రకాలుగా ఉంటుంది.త్వరగా గుర్తించి చికిత్స అందిస్తే, పూర్తి సాధారణ జీవితం గడిపే అవకాశం ఉండవచ్చు. అదే ఆలస్యం జరిగితే పరిస్థితి చేయి జారే ప్రమాదం ఉంది.సమస్యను సరిగ్గా గుర్తించి, సరైన మందును, సరైన మోతాదులో వాడుతూ, ప్రతి ఆరునెలలకు ఒక సారి పరీక్ష చేసుకుంటూ, వైద్యుల పర్యవేక్షణలో ఉండడం అనేది థైరాయిడ్ లాంటి దీర్ఘకాలిక జబ్బుల విషయంలో చాలా ముఖ్యం.