Prabhas
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ దాదాపుగా మూడు నెలల గ్యాప్ తరువాత హైదరాబాద్ కి వచ్చాడు. ఆ మూడు నెలలు ఎక్కడ ఉన్నాడు? ఏం చేశాడు ప్రభాస్? ఫ్యాన్స్ అతని రాక కోసం, పలకరింపు కోసం చకోర పక్షుల్లా ఎదురు చూస్తుంటే ప్రభాస్ మాత్రం మీడియా ముందుకే రావడం లేదు. చాలా కాలంగా మోకాలి నొప్పితో బాధపడుతున్నాడు బాహుబలి. అందుకు చికిత్స కోసం యూరప్ కి వెళ్లి అక్కడ సర్జరీ చేయించుకున్నాడు. మూడు నెలల పాటు యూరప్ లోనే రెస్ట్ తీసుకోని బుధవారం తిరిగి హైదరాబాద్ కి వచ్చాడు. ఈ విషయం బయటకు తెలియనప్పటికీ ప్రభాస్ హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో అడుగుపెట్టిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే ఆయన బర్త్ డే రోజున సినిమా రిలీజ్ లేక నిరాశతో ఉన్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ఇక ప్రభాస్ హైదరాబాద్ కి అడుగు పెట్టడంతో ఫ్యాన్స్ ఆనందానికి హద్దులు లేవు. సలార్ ఆగయా అంటూ కొందరు కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరు షేర్ ఆగయా, రాజు తన రాజ్యంలోకి అడుగు పెట్టారంటూ కామెంట్స్ పెడుతున్నారు ఫ్యాన్స్. సలార్ సినిమా కోసం ఎంతో మంది ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. సలార్ ప్రమోషన్స్ తో నెక్ట్స్ మూవీతో బిజీగా ఉండబోతున్నాడట ప్రభాస్.
సలార్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్: (Prabhas)
ప్రభాస్ హైదరాబాద్ రావటంతో సలార్ టీమ్ వాళ్లు ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారట. డిసెంబర్ ఫస్ట్ వీక్ లో ట్రైలర్ రాబోతున్నట్లు సమాచారం. ఇక సినిమా మాత్రం డిసెంబర్ 22వ తేదిన మన ముందుకు రానుంది. హోంబలే ఫిల్మ్ప్ బ్యానర్ పై తెరకెక్కనుంది. దాదాపుగా 200 కోట్ల బడ్జెట్ తో మన ముందుకు రానుంది ఈ మూవీ. రిలీజ్ డేట్ ఇంకా 40 రోజులు ఉండటంతో ప్రమోష్స్ ను కూడా మొదలు పెట్టాలని అనుకుంటున్నారట మూవీ మేకర్స్. పోస్ట్ పోన్ చేస్తు వస్తున్న సలార్ టీమ్ వాళ్లు ఇకనైనా వేగం పుంజుకోవాలంటూ కామెంట్స్ పెడుతున్నారు ఫ్యాన్స్ . ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ ను బట్టి కమర్షియల్ యాక్షన్ ఎంటనర్ టైనర్ గా ఈ సినిమా రానుంది. ఐదు భాషల్లో ఈ మూవీని రిలీజ్ చేయనున్నారు. ప్రభాస్ సరసన శ్రుతి హాసన్ నటించింది.
నెక్ట్స్ మూవీలో బిజీ కాబోతున్న ప్రభాస్
ఇప్పటి వరకు ప్రభాస్ సైన్ చేసిన సినిమాలకు చాలా బ్రేక్ ఇచ్చేశాడు. హైదరాబాద్ కి తిరిగి వచ్చిన ప్రభాస్ ఇక తన నెక్ట్స్ ఫిలిం లో బిజీ కాబోతున్నాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి.మారుతి-ప్రభాస్ కాంబినేషన్ లో ఓ సినిమా రానుంది. ఈ సినిమాను నవంబర్ 13 నుంచి మూవీ షూటింగ్ లో ప్రభాస్ పాల్గొననున్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రభాస్ లేని కొన్ని సన్నివేశాలను చిత్రికరించాడట మారుతి. ఇక ఈ సినిమా ‘రాజా డీలక్స్’ అనే టైటిల్ లో రానున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ సినిమాలో హీరోయిన్స్ గా మాళవిక మోహన్, నిధి అగర్వాల్, రిధి కుమార్ నటిస్తున్నారు. ఈ మూవీకి ఎస్.ఎస్ థమన్ సంగీతం అందించనున్నాడు. హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా తెరకెక్కనుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమా 2024లో రిలీజ్ చేయనున్నారట మూవీ మేకర్స్. ఇక ఈ సినిమా పూర్తి చేసిన తరువాత కల్కి ప్రాజెక్ట్ లో బిజీ కానున్నడట ప్రభాస్.