దీపావళి పండగకి బంగారం (Gold) కొనుక్కోవాలనుకుంటున్నారా? ఇదే సరైన సమయం. బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. గత కొన్ని రోజులుగా పరుగులు పెడుతూ వచ్చిన బంగారం ఇప్పుడు కాస్త తగ్గుముఖం పట్టింది. ఇవాళ మార్కెట్ రేట్ల ప్రకారం 24 క్యారెట్ల బంగారం తులం రూ. 61,470 గా ఉంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర తులం రూ.56,350 గా ఉంది. గతంతో పోలిస్తే 170 రూపాయలు తగ్గుముఖం పట్టింది. బంగారంతో పోల్చితే వెండి రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి. గత వారంతో పోలిస్తే వెండి ధర రెండొందలు పెరిగింది. దాంతో వెండి కొనుగోలుకు ఇది సరైన సమయం కాదంటున్నారు నిపుణులు.
శుభ కార్యానికి బంగారం (Gold)
పసిడికి, వెండికి ఎప్పుడూ డిమాండ్ ఉంటునే ఉంటుంది. సాధారణంగా వివాహాలు, శుభకార్యాలు, పండుగల సమయంలో బంగారం, వెండిని ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. మరి కొన్ని రోజులలో దీపావళీ కూడా వస్తుంది. అయితే దీపావళీకి పసిడిని ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో అందరి దృష్టి బంగారం, వెండి ధరలపైనే ఉంటుంది. చాలా మంది బంగారం కొనేందుకు ఆసక్తి చూపుతారు. అయితే మేకింగ్ ఛార్జీలు, ధరలు వంటి అంశాల్లో అవగాహన లేకుండానే బంగారం కొనేస్తుంటారు. దీంతో ఆభరణాలపై అధికంగా డబ్బులు ఎక్కువగా ఖర్చు చేస్తుంటారు. పండగనే కాదు ఎలాంటి సందర్భంలోనైనా బంగారం కొంటున్నప్పుడు జాగ్రత్తలు వహించాలి. అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరుగుతుంటాయి. కొన్నిసార్లు ధరలు తగ్గితే మరికొన్నిసార్లు పెరుగుతూ ఉంటాయి.
బంగారంలో ఎన్నిరకాలు?
బంగారం (Gold) కొనేటప్పుడు చాలా మంది తగిన జాగ్రత్తలు తీసుకోరు. బంగారం తూకంలో, నాణ్యతలో తేడాలు ఉంటాయి. దానిని అవసరాలకు తిరిగి అమ్మే సమయంలో మోసపోయినట్లు తెలుసుకోలేరు. ముఖ్యంగా బంగారం కొనే ముందు 22 క్యారెట్ల బంగారానికీ, 24 క్యారెట్ల బంగారానికీ మధ్య తేడా తెలుసుకోవాలి. 24 క్యారెట్లలో 99 శాతం బంగారం, మిగతా ఒక శాతం వెండి, రాగి మిశ్రమం ఉంటుంది. 22 క్యారెట్లలో 92 శాతం బంగారం, మిగతా ఎనిమిది శాతం వెండి, రాగి మిశ్రమం ఉంటుంది. బంగారంలో తరుగు తీసేటప్పుడు ఈ మిశ్రమాన్ని తొలగిస్తారు. బంగారం కొనడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా మన దేశంలో బంగారం సాంప్రదాయ అవసరాలు తీర్చడంతోపాటు పెట్టుబడిగా కూడా ఉపయోగపడుతుంది. మన దేశంలో మహిళలకు బంగారు ఆభరణాలపై మక్కువ ఎక్కువ. అంతే కాకుండా భవిష్యత్ అవసరాలకు కూడా పసిడి ఉపయోగపడుతుందని మనవారు భావిస్తారు. అందువల్ల బంగారం ధర పెరిగినా ఆ స్థాయిలో డిమాండ్ తగ్గదు.
కల్తీ బంగారాన్ని ఎలా గుర్తించాలి? (Gold)
ఇక బంగారం (Gold) స్వచ్ఛత విషయానికి వచ్చేసరికి గీటురాయిని ఉపయోగించి మనమే తెలుసుకోవచ్చు. బంగారంలో రాగి ఎక్కువగా ఉంటే గీసినపుడు గీత రాగి రంగులోకి వస్తుంది. దానిపై యాసిడ్పోస్తే, రాగిని యాసిడ్ కరిగిస్తుంది. అదే బంగారంపై యాసిడ్ పోస్తే, బంగారు వర్ణం వస్తుంది. దీంతో ఆ బంగారం లో కల్తీని గుర్తించవచ్చు. శబ్దాన్ని బట్టి కూడా బంగారం స్వచ్ఛత కనుక్కొనవచ్చ. గోల్డ్ కాయిన్ 22 క్యారెట్లదా లేక 24 క్యారెట్లదా అన్నది తెలుసుకోవాలంటే, గోల్డ్ కాయిన్ని పైకి ఎగురవేసి నప్పుడు ఖంగుమనే శబ్దం వస్తే అది 22 క్యారెట్ల బంగారమని అర్థం. అదే మెత్తని శబ్దం వస్తే అది 24 క్యారెట్లని అర్థం! ఇవన్నీ అశాస్త్రీయ పద్ధతులు. ఇప్పుడు బంగారం స్వచ్చతను హాల్ మార్కింగ్ ద్వారా నిర్ణయిస్తున్నారు. హాల్మార్క్ గుర్తు ఉన్న బంగారాన్ని అమ్మితే, దాని విలువకు సమానంగా బంగారం రావాలి. అలా షాపు వారు ఇవ్వకపోతే చట్టరీత్యా చర్యలు తీసుకోవచ్చని నిపుణులు చెపుతున్నారు. అందుకే కొన్న వెంటనే హాల్మార్కింగ్ చెక్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.