అమెరికా (US) యువతలో హింసా ప్రవృత్తి పెరిగిపోతోంది. తాజాగా ఓ ఫిట్నెస్ సెంటర్ లో 24 ఏళ్ల తెలుగు విద్యార్ధిని కత్తితో పొడిచి చంపిన ఉదంతం సంచలనం సృష్టిస్తోంది. వరుణ్ రాజ్ పుచ్చా అనే ఈ స్టూడెంట్ వాల్పరైసో యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్. గతనెల 29న వరుణ్ పై జోర్డాన్ ఆండ్రేడ్ అనే అమెరికన్ యువకుడు కత్తితో తలలో పొడిచాడు. అప్పటినుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వరుణ్ నిన్న మరణించినట్లు పోలీసులు తెలిపారు. వరుణ్ తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన వాడు. కంప్యూటర్ సైన్స్ లో ఎంఎస్ చేసేందుకు 2022 ఆగస్టులో అమెరికా వెళ్లాడు.
ఎందుకు పొడిచాడో తెలీదు… US
వరుణ్ మృతిపై యూనివర్సిటీ యాజమాన్యం కూడా విచారం వ్యక్తం చేసింది. ఆతని కుటుంబం, స్నేహితులకు సానుభూతి తెలిపింది. ఓ ఫిట్ నెస్ సెంటర్ లో వరుణ్, జోర్డాన్ ఆండ్రేడ్ మాసాజింగ్ రూమ్ లోకి ఒకేసారి వెళ్లారు. అక్కడ వరుణ్ చూపులు అనుమానాస్పదంగా ఉన్నాయని , అతడు తనను హత్య చేస్తాడని తెలిసి ఆత్మరక్షణ కోసం తానే దాడి చేసినట్లు జోర్డాన్ చెబుతున్నాడు. నిందితుడు చాలా నెమ్మదస్తుడని, జిమ్ సెంటర్ లో కూడా ఎవరితోనూ మాట్లాడడని , తన పని తాను చేసుకువెళ్లే రకమని స్థానికులు చెబుతున్నారు. అయితే ఎందుకు హత్యా ప్రయత్నం చేసావన్న పోలీసుల ప్రశ్నలకు జోర్డాన్ సమాధానం విస్తుగొలిపేది గా ఉంది. వరుణ్ తనకు ఎప్పుడూ పరిచయం లేదని, ఒక్క సారి కూడా కనీసం ఎదురు పడలేదని, నిందితుడు చెబుతున్నాడు. వరుణ్ భయ పెడుతున్నాడని, తనను హత్య చేస్తాడని ఎవరో తనకు చెప్పారని అంటున్నాడు.
నిందితుని పొంతన లేని మాటలు
తాను జిమ్ లోని మసాజ్ రూమ్ లోకి వెళ్లినప్పుడు అక్కడ వరుణ్ తారస పడ్డాడని, అతని చూపులు అనుమానాస్పదంగా, వింతగా ఉండటంతో తాను కత్తితో పొడిచానన్నది జోర్డాన్ వాదన. నిందితుడు హటత్తుగా జేబులోంచి కత్తి తీసి మృతుని తలలో గుచ్చాడు. అయితే వరుణ్ ఆత్మరక్షణ కోసం జోర్డాన్ ను తోశాడు. కానీ అప్పటికే నష్టం జరిగిపోయింది. పైగా చేసిన పనికి పశ్చాత్తాప పడకపోగా, తాను ఆత్మరక్షణ కోసమే చేశానన్నాడు. చాలా కాజువల్ గా పోలీసులకు సమాధానం ఇచ్చాడు.తన పని ప్రదేశంలో బాక్సులు తెరిచేందుకు వినియోగించే కత్తి లాంటి టూల్ ను నిందితుడు ఎప్పుడూ వెంట తీసుకు వెళుతుంటాడు.
మరోవైపు వరుణ్ పూచా మరణంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఈనెల 16న వరుణ్ కి కేంపస్ లో నివాళి అర్పించాలని యూనివర్సిటీ యాజమాన్యం నిర్ణయించింది. కుటుంబ సభ్యులకు సంతాపం తెలుపుతున్నామని వారు ఈ విషాదం నుంచి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నామని వర్సిటీ యాజమాన్యం తెలిపింది. US
అడ్డు అదుపు లేని హింసా ప్రవృత్తి
అమెరికా యువతలో హింసా ప్రవృత్తి పెరిగిపోతోంది. కుటుంబ విలువలు లేకపోవడం, పిల్లలు ఒంటరిగా పెరగడం, విచ్చల విడిగా ఉన్న గన్ కల్చర్ పై అదుపు లేకపోవడం ఇత్యాది కారణాలు హత్యలకు కారణమవుతున్నాయి.యువతలో ఈ ఉన్మాద ధోరణి అక్కడి సమాజంలో కుటుంబ విలువలకు అద్దం పడుతోంది.మొన్నటికి మొన్న ఓ స్టూడెంట్ స్కూల్లో పిల్లలపై గన్ తో కాల్పులు జరిపాడు. ఇలాంటి ఘటనలు కోకొల్లలుగా జరుగుతున్నాయి. వింతగా, అనుమానాస్పదంగా కనిపించినందుకే దాడి చేశానంటున్న నిందితుడి మానసిక స్థితి అక్కడి వాతావరణానికి అద్దం పడుతోంది. US