Fitness
ఈ మధ్యకాలంలో అందరికి బీజీ లైఫ్ స్టైల్ అలవాటైపోయింది. బద్ధకం కారణంగా చాలా మంది వర్కవుట్స్ చేయడానికి ఆసక్తి చూపడంలేదు. కానీ, రోజూ ఎంతోకొంత వ్యాయామం చేయాలని నిపుణుల సూచిస్తున్నారు. మన ఇంట్లోనే ఈజీగా చేసే వర్కవుట్స్ లో స్కిప్పింగ్ ఒకటి. స్కిప్పింగ్ వల్ల ఫిట్నెస్ కే కాదు.. మన ఆరోగ్యానికి కూడా అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజూ ప్రతి ఒక్కరూ వ్యాయామం చేయాలని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు. వర్కవుట్స్ మనల్నీ శారీరకంగా, మానసికంగా హెల్తీగా ఉండటానికి ఎంతో సహయపడుతుంది. వర్కవుట్స్ చేస్తే ఫిట్‌గా ఉంటాం, షేప్ మేయింటేన్ చేయవచ్చు అలాగే ఎన్నో అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు.
వెయిట్ లాస్ కి మంచి వ్యాయామం.. Fitness
అధిక బరువుతో బాధపడేవారికి స్కిప్పింగ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. రోజూ స్కిప్పింగ్ చేస్తే శరీరంలో పేరుకుపోయిన అనవసర కొవ్వు కరిగిపోయి సన్నగా అవుతారు. ప్రతిరోజూ ఓ గంటపాటు తాడు ఆట ఆడితే 1300 క్యాలరీలు ఖర్చవుతాయి. వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారు స్కిప్పింగ్ మంచి రిజల్ట్స్ ఇస్తుంది. స్కిప్పింగ్‌లో మనం జంప్ చేస్తూ ఉంటాం.. ఓ పది నిమిషాల పాటు స్కిప్పింగ్ చేయడం వల్ల 1.6km పరిగెత్తిన దాంతో సమానమని నిపుణులు అంటున్నారు. స్కిప్పింగ్ మెదడుపై అనుకూల ప్రభావాన్ని చూపుతుంది. మనం జాగ్రత్తగా జంప్ చేసేలా మెదడు సంకేతాలను పంపిస్తుంది. ఈ శ్రద్ధ మెదడు పనితీరును అభివృధి చేయడంలో సహాయపడుతుంది. జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. మానసిక స్ధితిని కూడా మెరుగుపడేలా చేస్తుంది.
ఎముకల దృఢత్వం కోసం.. స్కిప్పింగ్
స్కిప్పింగ్ చేయడం వలన ఎమ్ముకలు ధృఢంగా తయారవుతాయి. వయసుతో సంబంధం లేకుండా రోజూ ఉదయం 5 నిమిషాలు, సాయంత్రం 5 నిమిషాలు స్కిప్పింగ్ చేస్తే రన్నింగ్ చేయడం ద్వారా కలిగే ప్రయోజనాలకంటే మెరుగైన ప్రయోజనాలుంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎముకలను ధృఢంగా ఉంచడంలో స్కిప్పింగ్ మంచిగా సహయపడుతుంది. ప్రతిరోజు స్కిప్పింగ్ చేయడం వల్ల కాళ్లు,మోకాళ్లు, చీలమండ కీళ్లపై మంచిగా ప్రభావం చూపడమే కాకుండా కండరాలలో బలాన్నిపెంచుతుంది. పైగా ఎటువంటి నొప్పులు, వాపుల బారిన పడకుండా చూపుతుంది. మనకు తెలియకుండానే కాళ్లకు సంబంధించిన సమస్యలు దూరమవుతాయి. Fitness
స్కిప్పింగ్ తో ఈ అనారోగ్య సమస్యలు దూరం..
ఈ వ్యాయామం చేసిన తర్వాత శ్వాస తీసుకోవడం వేగంగా ఉంటుంది.ఇది ఊపిరితిత్తుల సామర్ధాన్ని మెరుగుపరచడంలో సహయపడుతుంది. మరియు గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ వ్యాయామం హృదయ స్పందన రేటుని పెంచుతుంది. దీనితో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ప్రతిరోజు స్కిప్పింగ్ చేయడం వల్ల గుండె సమస్యలను నియంత్రించ వచ్చని డాక్టర్స్ చెబుతున్నారు. జీర్ణక్రియ సమస్యలను దూరం చేస్తుంది. జీర్ణక్రియ వేగవంతంగా పనిచేయడానికి కూడా సహయపడుతుంది. ప్రస్తుతం చాలా మంది మానసిక సమస్యలతో భాధపడుతున్నారు. ఒత్తిడి, ఆందోళనలకు గురవుతున్నారు. స్కిప్పింగ్ చేయడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. కావున అరగంట సాధ్యం కాకపోతే ప్రతిరోజు 15 నిమిషాల పాటు స్కిప్పింగ్ చేయడం మంచిదని డాక్టర్స్ అంటున్నారు. Fitness
వీరు ఎట్టి పరిస్ధితిలోనూ చేయకూడదు Fitness
గుండె సంబంధిత వ్యాధులతో భాధపడే వారు స్కిప్పింగ్ చేయకూడదు. ఏదైనా ఆపరేషన్స్ జరిగిన వారు ఈ వ్యాయామం చేయాలంటే డాక్టర్ సలహతీసుకోని చేయడం మంచిది. అలాగే అధిక రక్తపోటు వంటి సమస్యలు ఉన్నవారు స్కిప్పింగ్ చేయకూడదు. ఎముకలకు సంబంధించిన సమస్యలు ఉన్నవారు స్కిప్పింగ్ చెయాలంటే వైధుల సలహ తీసుకోవడం ఉత్తమం.