AI
ప్రస్తుతం మనం స్మార్ట్ యుగంలో ఉన్నాం మనిషికి అనేక సౌకర్యాలను అందిస్తోంది, అనేక గ్యాడ్జెట్లను పరిచయంచేస్తోంది. ఒకప్పుడు ఫోన్ అంటే ల్యాండ్ లైన్ కనెక్షన్ ఉండేది, వైర్డ్ కనెక్షన్ ఉండేది. కానీ వాటి స్థానంలో వైర్ లెస్ ఫోన్లు వచ్చాయి. ఆ తర్వాత స్మార్ట్ ఫోన్లు, 4జీ, 5జీ నెట్ వర్క్ సపోర్టుతో అత్యాధునిక ఫీచర్లతో మనిషిని తన అరచేతికి కట్టేస్తున్నాయి. వీటిని చేయలేని పనంటూ ఏది ఉండటం లేదు. అలాంటి స్మార్ట్ ఫోన్ కూడా అవసరం లేకుండా దానిని ప్రత్యేకంగా మీరు మోసుకెళ్లే పని లేకుండా ఓ కొత్త టెక్ గ్యాడ్జెట్లో ప్రపంచంలో సంచలనం సృష్టిస్తోంది. చాలా చిన్నగా, క్యూట్ గా ఉన్న ఆ బుల్లి డివైజ్ ను ప్రత్యేకంగా చేతితో పట్టుకోవాల్సిన అవసరం లేదు. కేవలం మీ దుస్తులకు అటాచ్ చేసుకోవచ్చు.
AI పిన్ అంటే…
స్మార్ట్ ఫోన్ తరహాలోనే పనిచేసే ఈ చిన్న టెక్ గ్యాడ్జెట్ పేరు ఏఐ పిన్. దీనిని అమెరికాకు చెందిన హ్యూమేన్ అనే స్టార్టప్ తయారుచేసింది. యాపిల్ సంస్థలో పనిచేసిన ఇద్దరు మాజీ ఇంజినీర్లు ఈ కంపెనీని స్థాపించారు. దీనిలో ఎలాంటి స్క్రీన్ ఉండదు. పరిమాణంలో చాలా చిన్నదిగా ఉంటుంది. బరువు గా లైట్ గా ఉంటుంది. ఇది మీ వస్త్రాలకు ఎక్కడైనా అతికించుకోవచ్చు. దీనిలో విశేషమేమిటంటే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే ఈ డివైజ్ సాయంతో స్మార్ట్ ఫోన్ తో చేయగలిగే అన్ని పనులు చేసుకోవచ్చని చెబుతున్నారు.
హ్యూమేన్ ఏఐ పిన్ ఎలా పనిచేస్తుంది…
ఈ ఏఐ పిన్ హ్యూమేన్ ఓఎస్ తో పనిచేస్తుంది. అందులో ఎలాంటి యాప్లు లేదా స్క్రీన్లను పొందలేరు. దీంతో కెమెరా, మైక్రోఫోన్, యాక్సెలరోమీటర్ వంటి అత్యాధునిక సెన్సార్లు ఉంటాయి. ఈ గ్యాడ్జెట్తో మీరు సెల్ ఫోన్లాగాకాల్స్ చేయొచ్చు, మెసేజ్ లు పెట్టొచ్చు, ఫొటోలు చేయొచ్చు, వీడియో కూడా రికార్డు చేయొచ్చు. ఇందులో 13ఎంపీ ఉంది పైగా దీనిలో ఎలాంటి యాప్స్ కూడా అసవరం ఉండదు. అంతేకాక దీనిలో ఇన్ బిల్ట్ ప్రాజెక్టర్ ఉంటుంది. దీని సాయంతో మీరు ఏదైనా వస్తువు, లేదా గోడపై, లేదా మీ చేతితో డిస్ ప్లే చూడొచ్చు. ఇది బ్లూటూత్ ఫీచర్ను కూడా కలిగి ఉంటుంది. కాబట్టి మీరు దీన్ని ఇయర్బడ్లతో సులభంగా కనెక్ట్ చేయవచ్చు. ఏఐ పిన్ కెమెరాల ద్వారా చుట్టూ ఉన్న వస్తువులు, ల్యాండ్ మార్క్ లను గుర్తిస్తుంది. దాని సహాయంతో దగ్గరలోని రెస్టారెంట్ పేరు, లేదా బస్ స్టాప్ నకు ఎంత దూరంగా ఉన్నమనే వివరాలు అందిస్తుంది. అయితే 2024లో ఏఐ పిన్ లో నావిగేషన్ ఫీచర్లను సైతం ప్రవేశపెడతామని కంపెనీ తెలిపింది.
AI పిన్ ధర…
కంపెనీ ప్రకారం, ఏఐ పిన్లో యాప్లు లేదా స్క్రీన్లు లేవు. వినియోగదారులు చేతి కదలికలు, లేజర్ ప్రొజెక్టర్లు, స్లయిడ్ బటన్లు, వాయిస్ ద్వారా దానితో పరస్పర చర్య చేయవచ్చు. ఇది స్వతంత్ర పరికరం, దీని సాఫ్ట్వేర్ ఏఐ తో తయారు చేశామనిని తయారీదారులు తెలిపారు. మీరు ఈ ఏఐ పిన్ని ఎక్లిప్స్, లూనార్, ఈక్వినాక్స్ కలర్ ఆప్షన్లలో కొనుగోలు చేయవచ్చు. ఈ గ్యాడ్జెట్ ధర గురించి చెప్పాలంటే, అమెరికాలో దీని ధర $ 699 సుమారు రూ. 58,212. దీనిని నెలవారీ ఈఎంఐ కావాలంటే $ 25 సుమారు రూ. 2,082 కూడా కొనుగోలు చేయొచ్చు.