Chat GPT ఇప్పుడీ పదం యావత్ ప్రపంచాన్ని శాసిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలో సరికొత్త ఆవిష్కరణ వచ్చిన ఈ టెక్నాలజీకి ప్రపంచం ఫిదా అవుతోంది. గత ఏడాది నవంబర్‌లో లాంఛ్ అయినప్పటి నుంచి చాట్‌జీపీటీ టెక్ ప్రపంచంలో హాట్ డిబేట్‌గా మారింది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో బడా కంపెనీలు, అదే విధంగా స్టార్టప్ సంస్థలు సైతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో భారీగా పెద్దఎత్తున పెట్టుబడులు పెడుతున్నారు. ఇదిలా ఉంటే మానవులకు ఆన్లైన్ సేవలను మరింత చేరువ చేస్తున్న చాట్‌జీపీటీపై పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా చాట్‌జీపీటీకి సంబంధించిన ఓ ఆసక్తికరమైన అంశం ఆసక్తిని పెంచింది. చాట్‌జీపీటీ మనుషుల భావోద్వేగాలను సైతం అర్థం చేసుకుంటుందని పరిశోధకులు చెబుతున్నారు.
Chat GPT అంటే…..
ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సాయంతో పని చేసే అధునాతన చాట్బోటే ఈ చాట్ జీపీటీ దీని పూర్తి పేరు చాట్ జనరేటివ్ ప్రీ-ట్రైనింగ్ ట్రాన్స్ఫార్మర్ అధునాతన మిషన్ లెర్నింగ్ సాంకేతికతతో చాట్ జీపీటీ పని చేస్తుంది. మీరు ఈ చాట్ జీపీటీని ఏ ప్రశ్న అయినా టెక్స్ట్ రూపంలో అడగవచ్చు. ఆ ప్రశ్నకు ఈ ఏఐ టూల్ వివరమైన సమాధానాన్ని అత్యంత వేగంగా, వివరంగా ఇస్తుంది. ఎందుకంటే ఈ చాట్ జీపీటీలో ఎంతో అపారమైన డేటా బేస్ ఉంటుంది. డేటా బేస్ సాయంతో ఏ ప్రశ్నకైనా ఇది ఆన్సర్ చెప్పేస్తోంది.
మనుషుల భావోద్వేగాలను…..
యూట్యూబ్ మొదలు మరెన్నో సోషల్ మీడియా సంస్థలు సైతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవలను జోడిస్తున్నాయి. మైక్రోసాఫ్ట్, విలియం అండ్ మేరీ, ఆసియాలోని పరిశోధనా కేంద్రాలు సంయుక్తంగా ఈ అధ్యయనాన్ని చేపట్టాయి. మనుషుల భావోద్వేగాలను చాట్‌జీపీటీ అర్థం చేసుకొని అందుకు అనుగుణంగా స్పందిస్తాయని ఈ అధ్యయనంలో వెల్లడైంది. కొన్ని భావోద్వేగాలకు చాట్‌జీపీటీ స్పందన నాణ్యత మెరుగ్గా ఉందని అంటున్నారు. ఈ అధ్యయనంలో భాగంగా లార్జ్ ల్యాంగ్వేజ్ మోడల్స్ ఎల్ఎల్ఎం మనుషుల భావోద్వేగాలను అర్థం చేసుకోగలవని వెల్లడైంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్‌కు మూలమైన లార్జ్ ల్యాంగ్వేజ్ మోడల్స్ మానవ ఉద్వేగాలను అర్థం చేసుకొని అందుకు అనుగుణంగా స్పందిస్తాయని పరిశోధకులు తెలిపారు.
మైక్రో సాఫ్ట్ సీయిఒ….
ఈ ఆవిష్కరణతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాస్తా ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ ఏజీఐ దిశగా అడుగులు వేస్తోందని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే మైక్రో సాఫ్ట్ CEOసత్య నాదేళ్ల ఇటీవల చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే. ప్రపంచంలో ఉన్న ప్రతీ ఒక్కరూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే ట్యూటర్, ఏఐ డాక్టర్, ప్రోగ్రామర్, కన్సల్టెంట్‌ను కలిగి ఉండాలన్నదే తన కల అని చేప్పిన విషయం తెలిసిందే. దీంతో ఏఐ టెక్నాలజీ కోసం దిగ్గజ ఐటీ సంస్థలు ఏ రేంజ్లో పనిచేస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. రానున్న రోజుల్లో ఏఐలో మరిన్ని విప్లవాత్మక మార్పులు వచ్చే అవకాశం ఉన్నాయని టెక్ నిపుణులు చెబుతున్నారు. చాట్‌జీపీటీ వంటి ఏఐ టూల్స్‌కు మూలమైన ఎల్ఎల్ఎంలు మానవ ఉద్వేగాలను అర్ధం చేసుకుని, అందుకు అనుగుణంగా స్పందిస్తాయని ఈ అధ్యయనం తెలిపింది.