Sreeja-Kalyan
మెగా స్టార్ చిరంజీవి చిన్న కుమారై శ్రీజ సిని ఇండస్ట్రీకి పరిచయం కాలేదు. పెళ్లి చేసుకోవడం విడాకులు తీసుకోవడం వంటి వార్తలతో సోషల్ మీడియాలో నిలుస్తుంది. శ్రీజ వైవాహిక జీవితం ఒడిదుకులతో సాగుతుంది. అటు కెరీర్ కూడా స్టాట్ చేయలేదు….ఇటు వివాహ జీవితం నిలకడ లేదు. ఇప్పటికి రెండు పెళ్లిలు చేసుకొని విడాకులతో జీవితం కొనసాగిస్తుంది. వైవాహిక జీవితంలో ఇబ్బందులు పడుతుంది ఈ మెగా డాటర్. తాజాగా మళ్లీ వార్తల్లో నిలిచింది… శ్రీజ-కళ్యాణ్ దేవ్ కలిసిపోయారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
మొదటి పెళ్లి:
శ్రీజ తన మొదటి పెళ్లి ఇంట్లో వాళ్లని ఎదిరించి ప్రేమ పెళ్లి చేసుకుంది. తన కాలేజీ స్నేహితుడు శిరీష్ భరద్వాజ్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇలా ఇంట్లో వాళ్లని కాదని వెళ్లి పెళ్లి చేసుకోవటంతో వార్తల్లో నిలిచింది. ఒక కుతూరికి జన్మనిచ్చింది శ్రీజ. కొన్నాళ్లు భరద్వాజ్ తో జీవితం గడిపిన తరువాత మనస్పర్ధలు రావటంతో విడాకులు తీసుకోని విడిపోయారు. మొదటి పెళ్లి విడాకులతో విడిపోవటంతో శ్రీజ చిరంజీవి ఇంటికి వచ్చింది. శ్రీజ తన కుతూరితో తన పుట్టింటికి రావటంతో తనకు రెండో పెళ్లి చేశాడు చిరంజీవి.
రెండోవ పెళ్లి:
ప్రేమ పెళ్లి చేసుకోని విడాకులతో ఇంటికి వచ్చిన శ్రీజకు కళ్యాణ్ దేవ్ తో రెండో పెళ్లి చేశాడు చిరంజీవి. శ్రీజ-కళ్యాణ్ దేవ్ పెళ్లి అంగరంగ వైభవంగా కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా జరిగింది. వీరిద్దరికి ఒక కుమారైకు జన్మించ్చింది. వారి కుతూరి పేరు నవిష్క. వీరిద్దరి మధ్య కూడా మనస్పర్ధలు రావటంతో విడాకులు తీసుకున్నారు. ఈ విడాకుల విషయాన్ని అధికారికంగా ప్రకటించకపోయిన వీరిద్దరూ మాత్రం విడిపోయారని స్పష్టంగా అర్థమవుతుంది. వీరిద్దరూ విడిపోయిన శ్రీజ తన కుమారైని తనతోనే ఉంచుకుంది. అప్పుడప్పుడు కళ్యాణ్ వద్దకూ కూడా తీసుకువెళ్లుతుంది శ్రీజ. ఈ క్రమంలోనే తన కుమారైతో గడిపిన మధురమైన క్షణాలను, తనతో దిగిన ఫోటోలను తన ఇన్ స్టాలో షేర్ చేస్తూ ఉంటాడు కళ్యాణ్ దేవ్.
శ్రీజ లేకుండా దీపావళి సెలబ్రేషన్ చేసుకున్న నవిష్క: Sreeja-Kalyan
దీపావళి పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఈ పండుగను ఘనంగా సెలబ్రేట్ చేసుకోని అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటారు. అలాగే కళ్యాణ్ దేవ్ కూడా దీపావళి సెలబ్రేషన్ ఫోటోలను షేర్ చేశాడు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలను చూసిన ప్రతి ఒక్కరు కళ్యాణ్ దేవ్ తన కుమారై నవిష్క తో కలిసి ఈ దీపావళి పండుగను జరుపుకున్నాడని తెలుస్తుంది. శ్రీజ లేకుండా కళ్యాణ్ దేవ్-నవిష్క దీపావళి పండుగను సెలబ్రేట్ చేసుకున్నారని అర్థం అవుతుంది. ఇలా నవిష్క కళ్యాణ్ దగ్గర ఉండటంతో శ్రీజ-కళ్యాణ్ లు కలిసిపోయారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్త ఎంత వరకు నిజమో తెలియాలంటే శ్రీజ కానీ కళ్యాణ్ కానీ స్పందిస్తే ఒక క్లారిటీ వస్తుంది.
కళ్యాణ్ దేవ్ మూవీస్ Sreeja-Kalyan
శ్రీజను పెళ్లి చేసుకోవటంతో కళ్యాణ్ సిని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. విజేత, సూపర్ మచ్చి, కిన్నెరసాని వంటి సినిమాలో నటించాడు. అటు మెగా అల్లుడిగా ఇటు మూవీస్ లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు కళ్యాణ్ దేవ్. ఎప్పుడైతే శ్రీజతో విడాకులు తీసుకున్నాడో అప్పటి నుంచి కళ్యాణ్ కు మూవీ ఆఫర్స్ కూడా లేవు. మెగా ఫ్యామిలీ సపోర్ట్ లేకపోవడంతో యాక్టింగ్ చేయడానికి మూవీస్ లేక సినిమాలకు దూరంగా ఉన్నాడు కళ్యాణ్ దేవ్.