(Tamanna Marriage ?)
తమన్నా భాటియా హీరోయిన్ గా పరిచయం అయి ఇప్పటికి 18 ఏళ్లు అవుతుంది. 2005 లో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తన నటనతో ఎంతో మంది ఫ్యాన్స్ ని దక్కించుకుంది. దాదాపుగా అటు స్టార్ హీరోలతో ఇటు కుర్ర హీరోల అందరి సరసన నటించింది ఈ మిల్కీ బ్యూటీ. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం భాషల్లో నటించి అగ్ర కథనాయకిగా తన హవా చాటుకుంది. తన తోటి హీరోయిన్స్ అందరూ పెళ్లి చేసుకొని పిల్లలతో హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. అటు ఫ్యామీలి లైఫ్ ను ఇటు మూవీస్ ను రెండు కవర్ చేస్తున్నారు తమన్నా తోటి నటిమణులు. కాజల్ మ్యారేజ్ జరిగినప్పుడు ఇక తమన్నా ఎప్పుడు పెళ్లి చేసుకోబోతుందంటూ కామెంట్స్ పెట్టారు అభిమానులు. కానీ ఇప్పటి వరుకు తమన్నా సింగిల్ గా లైఫ్ లీడ్ చేస్తూ సినిమాల్లో నటిస్తుంది. రీసెంట్ గా మూవీ ఆఫర్స్ కూడా సరిగా లేవు. తమన్నా ఇంట్లో వాళ్లు కూడా పెళ్లి చేసుకో అంటూ ఫోర్స్ చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఈ బ్యూటీ డేటింగ్ రూమర్స్ తో సోషల్ మీడియాలో నిలుస్తుంది. తన బాయ్ ఫ్రెండ్ తో చెట్టపట్టాలు వేసుకుని తిరుగుతూ మీడియా కంట పడింది.
బాయ్ ఫ్రెండ్ తో విరివిగా షికార్లు (Tamanna Marriage ?)
తమన్నా తన కెరీర్ లో ఎలాంటి రూమర్స్ లేకుండా లైఫ్ లీడ్ చేసింది. కానీ ఈ ఏడాది న్యూఇయర్ సందర్భంగా తన లవ్ మేటర్ ను లీక్ చేసింది. మూవీ ఆఫర్స్ అంతగా లేక బాయ్ ఫ్రెండ్ తో టైమ్ స్పెండ్ చేస్తుంది. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో సీక్రెట్ లవ్ ను మెయింటైన్ చేస్తూ వచ్చింది. వీరిద్దరూ లస్ట్ స్టోరీస్ సిరీస్ లో కలిసి నటించారు. తన జీవితంలో విజయ్ లాంటి వ్యక్తిని చూడలేదు అని చాలా ఓపెన్ గా మీడియాతో కూడా షేర్ చేసుకుంది. పార్టీలకు, ఈవెంట్లకు, టూర్ లకు కలిసి విచ్చలవిడిగా తిరుగుతున్నారు ఈ జంట. తమన్నా ఎక్కడికి వెళ్లిన విజయ్ వర్మతో కలిసి ట్రావెల్ చేస్తూ మీడియా కంటా పడుతున్నారు. వీరి ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.
త్వరలో పెళ్లి చేసుకోబోతుందా
విజయ్ తో చేసిన డేటింగ్ చాలు ఇకనైనా పెళ్లి చేసుకోమని ఇంట్లో వాళ్లు ఒత్తిడి చేయడంతో తమన్నా పెళ్లికి ఓకే చెప్పినట్లు సమాచారం. తన బాయ్ ఫ్రెండ్ ను పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఇరు కుటుంబాలు కూడా ఒకే చేసినట్లు వార్తలు వస్తున్నాయి. దీపావళి పండుగను ఈ జంట కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. త్వరలో పెళ్లి బాజాలతో మన ముందుకు రానున్నారని తెలుస్తోంది. తమన్నా, విజయ్ ప్రస్తుతం కొన్ని మూవీస్ ఒప్పుకోవటంతో వాటిని ఫినిష్ చేసి వచ్చే ఏడాదిలో వీరి పెళ్లి వేడుకలు మొదలుకానున్నాయని సిని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. డిసెంబర్ చివరి వారంలో కానీ, జనవరి మొదటి వారంలో కానీ వీరి ఎంగేజ్ మెంట్ ఉంటుందని, ఫిబ్రవరిలో పెళ్లి జరగనుందని సమాచారం. ఈ మేటర్ లో నిజం ఎంతో తెలీదు గానీ మూవీ గాసిప్స్ లో మోస్ట్ క్రేజీ గాసిప్ గా ఇది మారిపోయింది. (Tamanna Marriage ?)