MD.SHAMI
షమీ సుల్తాన్ ఆఫ్ సీమ్. ఇప్పుడు ఎక్కడ చూసినా షమీ పేరు మారుమోగిపోతోంది. సరిగ్గా రెండేళ్లలో తాను ప్రపంచంలోనే అత్యద్భుత బౌలర్ గా మారిపోయాడు. రోహిత్ కి ఎప్పుడు వికెట్ కావాలంటే.. అప్పుడు ఆదుకొనే ఏకైక బౌలర్ గా మారిపోయాడు. ప్రపంచకప్ లో అత్యంత వేగంగా 50 వికెట్లు తీసిన బౌలర్ గా చరిత్రలో నిలిచిపోయాడు. ఇప్పుడు చాలా మంది మదిలో తొలిచే ప్రశ్న ఒకటే.. న్యూజిలాండ్ మ్యాచ్ లో షమీ ఏడు వికెట్లు తీయకుంటే.. దాదాపు 400 టార్గెట్ నిలబడేదా? కచ్చితంగా నిలబడేది కాదు. భారత అభిమానుల గుండెల్లో మరో న్యూజిలాండ్ ఊచకోత కనిపించేదేమో!
రికార్డుల రారాజు MD.SHAMI
మొహమ్మద్ షమీ బెంగాల్ దేశీయ క్రికెట్ కు చెందిన అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారుడు. అతను కుడి చేతి ఫాస్ట్ మీడియం స్వింగ్, సీమ్ బౌలర్. 140కి.మీటర్ల వేగంతో నిలకడగా బౌలింగ్ చేస్తాడు. ఇది అతనికి మాయాశీల ఫాస్ట్ బౌలర్ గా పేరు తెచ్చింది. అతడిని రివర్స్ స్వింగ్ స్పెషలిస్టుగా అని కూడా పిలుస్తారు. అతడు ఒన్ డే ఇంటర్నేషనల్ లో జనవరి 2013న పాకిస్థాన్ తో జరిగే మ్యాచ్ ద్వారా ప్రవేశించాడు. ఆ మ్యాచ్ లో నాలుగు మేడిన్ ఓవర్స్ చేసి రికార్డు సృష్టించాడు. నవంబరు 2013 న వెస్ట్ ఇండీస్ తో జరిగిన టెస్టు మ్యాచ్ లో ప్రవేశించి ఐదు వికెట్లను పడగొట్టాడు. మహమ్మద్ షమీ వన్డే ప్రపంచకప్ చరిత్రలో రెండుసార్లు ఐదు వికెట్లు పడగొట్టిన ఏకైక భారత బౌలర్‌గా రికార్డు సృష్టించాడు.
తండ్రి ప్రోత్సాహం…
షమీ వాస్తవంగా ఉత్తరప్రదేశ్ లోణి సాహస్పూర్ కి చెందినవాడు. అతడి తండ్రి టోసిఫ్ ఆలీ సాధారణ రైతు. తండ్రి కూడా యుక్తవయసులో క్రికెట్ లో ఫాస్టు బౌలర్ గా ఆడేవాడు. షమీకి ఒక సోదరి, ముగ్గురు సోదరులు ఉన్నారు. సోదరులు కూడా ఫాస్టు బౌలర్స్ కావాలని కోరుకునేవారట….2005లో అతడి తండ్రి షమీలోని బౌలింగ్ నైపుణ్యాన్ని గమనించి అతడిని తన గ్రామానికి 22 కి.మీ దూరంలో ఉన్న మొరాదాబాదులోని క్రికెట్ కోచ్ బద్రుద్దీన్ సిద్దిక్ వద్దకు తీసుకుపోయాడు.
షమీ మొదటి ప్రయాణం…….. MD.SHAMI
షమీ సుల్తాన్ ఆఫ్ సీమ్. ఇప్పుడు ఎక్కడ చూసినా షమీ పేరు మారుమోగిపోతోంది. సరిగ్గా రెండేళ్లలో తాను ప్రపంచంలోనే అత్యద్భుత బౌలర్ గా మారిపోయాడు. రోహిత్ కి ఎప్పుడు వికెట్ కావాలంటే.. అప్పుడు ఆదుకొనే ఏకైక బౌలర్ గా మారిపోయాడు. ప్రపంచకప్ లో
షమీ మొట్టమొదటి సారిగా 2010లో ఆస్సాంతో ఫస్టు క్లాసు క్రికెట్ ను ప్రారంభించాడు. అందులో మూడు వికెట్లను తీసుకున్నాడు. దేశీయ క్రికెట్ లో అతని ప్రదర్శన కారణంగా 2012 లో వెస్ట్ ఇండీస్-బౌండ్ ఇండియా స్క్వాడ్ లో స్థానం పొందాడు. ఆ ఆటలో మ్యాచ్ గెలుపు కోసం 10వ వికెట్ వద్ద 73 పరుగుల భాగస్వామ్యాన్ని చేసాడు. 2012 లో రంజీ ట్రోఫీలో భాగంగా ఈడెన్ గార్డెన్స్ లో హైదరాబాదు జట్టుకు ప్రత్యర్థిగా ఆడాడు. అందులో 4/36, 6/71 వికెట్లు తీసుకొని 6 బంతులకు 15 పరుగులను చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఎన్నో ఒడిదుడుకులు……..
వ్యక్తిగతంగా షమీ తన జీవితంలో ఎన్ని ఒడుదొడుకులు ఉన్నా ఓ క్రికెటర్ గా మాత్రం గత రెండేళ్లలో షమీ ఎదిగిన తీరు అత్యద్భుతం. వాస్తవానికి షమీ తాజాగా అద్భుతాలు రాత్రికి రాత్రి జరిగిపోలేదు. దాదాపు రెండేళ్ల కఠోర శ్రమ ఉంది. కఠోర శ్రమ, వల్ల మీరు బౌలింగ్ లో తుఫాన్ ను చూస్తున్నారు. భారత బౌలింగ్ ను ఆస్వాదించని వారే ఉండరనిపిస్తోంది. మేం యూనిట్‌గా కలిసి పనిచేస్తున్నాం, దాని ఫలితాలను మీరు చూడగలుగుతున్నారు” అని షమీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.
మొహమ్మద్ షమీ బౌలింగ్ సీక్రెట్….. MD.SHAMI
షమీ సుల్తాన్ ఆఫ్ సీమ్. ఇప్పుడు ఎక్కడ చూసినా షమీ పేరు మారుమోగిపోతోంది. సరిగ్గా రెండేళ్లలో తాను ప్రపంచంలోనే అత్యద్భుత బౌలర్ గా మారిపోయాడు. రోహిత్ కి ఎప్పుడు వికెట్ కావాలంటే.. అప్పుడు ఆదుకొనే ఏకైక బౌలర్ గా మారిపోయాడు.ప్రపంచకప్ లో సరైన చోట బంతిని వేయడం, లయ ఉండేలా చూసుకోవడం, బేసిక్స్ కి స్టికాన్ కావడం, మంచి లైన్ అండ్ లెంగ్త్ ఇవన్నీ షమీ స్పెషాలిటీస్..ఇక ఫైనల్లోనూ షమీ గనుక తన ఫామ్ ను కొనసాగిస్తే.. భారత క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ బౌలర్‌గా నిలిచిపోతాడు.మొదటి నాలుగు మ్యాచ్‌లు ఆడకపోవడం..హార్ధిక్ కు గాయం అవడంతో జట్టులోకి వచ్చిన షమీ వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా ఒడిసిపట్టుకుని..ప్రత్యర్థులకు ఆడరాని బౌలర్ గా మారిపోయాడు.ఈ వాల్డ్ కప్ లో భారత్ గెలిస్తే అందులో షమీ పాత్ర ఖచ్చితంగా ఉన్నట్లే. ఎందుకంటే సెమీస్ లో న్యూజీలాండ్ టీమ్ కి షమీ ఇచ్చిన రిటార్ట్ మామూలుగా లేదుమరి..