SA vs AUS
ఫైనల్ లో భారత్ తో తలపడే ప్రత్యర్థి ఎవరో ఈ రోజు తేలనుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్ మైదానం వేదికగా దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ ప్రపంచకప్‌లో రెండు జట్లూ అద్భుత ఫామ్‌లో ఉన్నాయి. లీగ్ దశలో దక్షిణాఫ్రికా పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. 9 మ్యాచ్‌ల్లో కేవలం 2 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. నెదర్లాండ్స్, టీమ్ ఇండియాలు మాత్రమే సౌతాఫ్రికాను ఓడించాయి.
ఇక ఇవాళ్ల జరగబోయే మ్యాచ్ లో రెండు టీం లా పరిస్థితి ఎలా ఉంది. అనేది ఒకసారి మనం తెలుసుకుందాం… ఈ టోర్నీ లీగ్ దశలో రెండు టీంలు కూడా తొమ్మిది మ్యాచులు ఆడితే చేరో ఏడు విజయాలను సొంతం చేసుకున్నాయి. ఇక ఈ రెండు టీంలు తలపడినప్పుడు సౌతాఫ్రికా 311 పరుగులు చేసి ఆస్ట్రేలియాని మాత్రం 177 పరుగులకు ఆల్ ఔట్ చేసి చిత్తు గా ఓడించి ఘన విజయం సాధించింది. ఇక ఇలాంటి క్రమం లో సౌతాఫ్రికా నెదర్లాండ్స్ లాంటి ఒక చిన్న జట్టు మీద పరాభవాన్ని పొంది ఆ టీం యొక్క ఆత్మ విశ్వాసాన్ని పోగొట్టుకుంది. ఇక సౌతాఫ్రికా లీగ్ దశలో చేసిన తప్పు ఏదైనా ఉంది అంటే అది నెదర్లాండ్స్ టీం పైన ఓడిపోవడమే
ఈ సారి అయినా సెమీస్ కలిసి వస్తుందా… SA vs AUS
ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా జట్టుకు అత్యంత దురదృష్టకరమైన జట్టుగా పేరుంది. గతంలో సరిగ్గా సెమీఫైనల్స్ లోనే చివరి బంతికి దక్షిణాఫ్రికా బ్యాటర్ అవుట్ కావడంతో ఫైనల్ అవకాశాలు కోల్పోయింది. దక్షిణాఫ్రికాకు దురదృష్టం వెంటాడటం ఇది తొలిసారి కాదు. గతంలో 1992, 1999, 2007, 2015లో నాలుగుసార్లు సెమీస్ వరకూ వచ్చి ఆ అడ్డంకిని దాటలేకపోయింది. ఈసారి ఐదవ ప్రయత్నంలో అయినా సెమీస్ అడ్డంకి దాటి తొలిసారి ఫైనల్ చేరేందుకు ఆ జట్టు మానసికంగా సిద్ధమైంది. ఈసారి ప్రపంచకప్‌లో సఫారీ జట్టు చాలా పటిష్టంగా ఉంది. ఓపెనింగ్, మిడిల్ ఆర్డర్ అంతా భారీ స్కోర్లు చేస్తున్నారు. ఈ టోర్నీలో బలమైన ప్రత్యర్ధులపై 300పైచిలుకు పరుగుల్ని ఐదుసార్లు చేసిన జట్టు దక్షిణాఫ్రికానే. దీన్ని బట్టే తెలుస్తుంది ఆ జట్టు బ్యాటింగ్ లైనప్ ఎంత పటిష్టంగా ఉందో. డికాక్, డసెన్, మార్క్రమ్, క్లాసెన్ అంతా మంచి ఫామ్‌లో ఉన్నవాళ్లే.
కంగారూలు తక్కువ తినలేదు
ఇక ఆస్ట్రేలియా గురించి చెప్పాలంటే నాకౌట్ మ్యాచుల్లో ఎలా గెలవాలో కంగారూలకు బాగా తెలుసు. ఇప్పటికే ఆ జట్టు ఐదు సార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. ఆస్ట్రేలియాలో కమిన్స్, స్టార్క్, హేజిల్‌వుడ్ పేస్ తో పాటు ఆడమ్ జంపా రూపంలో మంచి స్పిన్నర్ కూడా ఉన్నారు. ఇక బ్యాటింగ్ విషయనికి వస్తే డేవిడ్ వార్నర్, గ్లెన్ మాక్స్వెల్, మిచెల్ మార్ష్ లాంటి స్లార్ ప్లేయర్స్ ఉన్నారు. ఈ రెండు జట్లలో ఏది మెరుగ్గా ఆడితే అది ఫైనల్స్ కు చేరుకుంటుంది.
ఐదు సార్లు చాంపియన్స్..
ఇక ఐదుసార్లు ప్రపంచకప్ గెలిచిన ఆస్ట్రేలియా ప్రారంభంలో వెనుకబడినా ఆ తరువాత దూసుకొచ్చింది. 7 వికెట్లు కోల్పోయినా ఆఫ్ఘనిస్తాన్పై మ్యాక్స్ వెల్ అద్భుతమైన ఆటతో జట్టు ఎలా నెగ్గుకొచ్చిందో అందరికీ తెలిసిందే. ఆస్ట్రేలియా ఓపెనింగ్ ఒక్కటే తడబడుతోంది. అయితే మిడిల్ ఆర్డర్ పటిష్టంగా ఉండటంతో నెగ్గుకొస్తోంది. డేవిడ్ వార్నర్, మ్యాక్స్‌వెల్, మిచెల్ మార్ష్ విధ్వంసకర బ్యాటింగ్ చేయగలరు. అందుకే ఇవాళ్టి సెమీఫైనల్ పోటీ గట్టిగానే ఉండనుంది. SA vs AUS