Varun-Lav
ప్రస్తుతం టాలీవుడ్ ట్రెడింగ్ కపుల్ ఎవరంటే వరుణ్-లావణ్య పేరు చెబుతారు. రీసెంట్ గా మెగా హీరో వరుణ్ బ్యాచిలర్ లైఫ్ కి స్వస్తి చెప్పి లావణ్యను పెళ్లి చేసుకున్నాడు. వీరి పెళ్లి ఇటలీలో అంగరంగ వైభవంగా జరిగింది. హైదరాబాద్ లోని మదాపూర్ లో రిసెప్షన్ కూడా ఘనంగా జరుపుకున్నారు మెగా ఫ్యామిలీ. వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గత కొన్ని రోజులుగా మెగా ఇంట్లో గుడ్ న్యూస్ లు వింటున్నాము. తాజాగా మరోక గుడ్ న్యూస్ తీసుకొని వచ్చారు మెగా ఫ్యామిలీ. నాగబాబు ఇంట్లో కొత్త కోడలు అడుగు పెట్టిన వేళ విశేషం ఏమో మరో శుభవార్తతో మన ముందుకు వచ్చారు.
కొత్త ఇంట్లోకి అడుగు పెడుతున్న న్యూ కపుల్ Varun-Lav
మెగా ఫ్యామిలీలో మరో శుభకార్యం జరగబోతుందట. మెగా న్యూ కపుల్ వరుణ్- లావణ్య కొత్త ఇంట్లోకి వెళ్లబోతున్నారట. ఈ సందర్భంగా గృహప్రవేశం చేయబోతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే సత్యనారాయణ వ్రతం గ్రాండ్ గా చేయబోతున్నారట మెగా ఫ్యామిలీ. పూజా కార్యక్రమాలకు అటు అల్లు ఫ్యామిలీ ఇటు మెగా ఫ్యామిలీ హడావిడి చేయబోతున్నారట. ఇలా వరసగా గూడ్ న్యూస్ లతో ఫ్యాన్స్ ని సంతోష పరుస్తున్నారు మెగా ఫ్యామిలీ.
మళ్లీ రిసెప్షన్ చేసుకోబోతున్నారా?
ఇటీవలె అన్ని పెళ్లి కార్యక్రమాలను పూర్తి చేసుకున్నారు వరుణ్-లావణ్య. అయితే ఈ జంట మళ్లీ రిసెప్షన్ చేసుకోబోతున్నారట. అందుకోసం వీరిద్దరూ డెహ్రాడూన్ వెళ్లుతూ హైదరాబాద్ విమానాశ్రయంలో కనిపించారు. పెళ్లి జరిగిన తరువాత వరుణ్ లావణ్య ఇద్దరూ వరుణ్ వాళ్ల ఇంటిలోనే ఉన్నారు. లావణ్య వాళ్ల ఇంటికి వెళ్లలేదు. అందుకోసం వీరిద్దరూ ఇప్పుడు డెహ్రాడూన్ వెళుతున్నారట. లావణ్య త్రిపాఠి యూపీలోని పైజాబాద్ లో పుట్టినా.. తన బాల్యంలో తల్లిదండ్రులతో కలిసి డెహ్రాడూన్ లోనే ఉన్నారు. అక్కడే లావణ్య పేరేంట్స్ ఉన్నారు. లావణ్య తరపు బంధువుల కోసం మరోసారి రిసెప్షన్ వేడుకలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు నిహారిక కూడా డెహ్రాడూన్ వెళ్లిందట. వీరందరూ ఎయిర్ పోర్ట్ కు వెళుతున్న వీడియా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Varun-Lav
కొత్త పెళ్లి కొడుకు ఆపరేషన్ వాలెంటైన్ సినిమాతో రానున్నడు Varun-Lav
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కొత్త సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు. ఆపరేషన్ వాలెంటైన్ సినిమాను డిసెంబర్ 8వ తేదిన థియేటర్ లో రిలీజ్ కు సిద్ధంగా ఉంది. మానుషీ చిల్లార్ హీరోయిన్ గా నటించింది. శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా ఎయిర్ స్పేస్ డ్రామా కథనంతో రానుంది. సోని సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మించింది. అయితే ఇప్పటివరుకు ప్రమోషన్లు మొదలు పెట్టలేదు.
డిజాస్టర్ సినిమాలతో సాగిన కెరీర్
గతంలో వచ్చిన మూవీస్ గని, గాండీవధారి అర్జున డిజాస్టర్లుగా నిలిచాయి. దీంతో వరుణ్ మూవీ కెరీర్ లో హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఇక ఈ సినిమా నుంచి అయినా హిట్ ను సొంతం చేసుకుంటాడో లేదో చూడాలి. పెళ్లి చేసుకున్న తరువాత రిలీజ్ అవుతున్న మొదటి సినిమా ఆపరేషన్ వాలెంటైన్. Varun-Lav