Sri Leela
టాలీవుడ్ లో ఇప్పుడు మోస్ట్ బిజీయెస్ట్ హీరోయిన్ ఎవరు అంటే శ్రీలీల అనే చెప్పాలి. దాదాపు నెలకో సినిమా చొప్పున విడుదలవుతున్నాయి ఈ బ్యూటీ మూవీస్.. అటు సీనియర్లు, ఇటు యంగ్ హీరోలు ఇద్దరితోనూ ఎడా పెడా సినిమాలు చేసేస్తోంది ఈ అమ్మడు. అపియరెన్స్ బాగుండటం, చెలాకీతనం, పట్టిందల్లా బంగారం కావడంతో శ్రీలీల కెరీర్ బ్రేకుల్లేని బండిలా దూసుకుపోతోంది. నటించిన ప్రతి సినిమా హిట్ అవ్వటంతో దర్శక నిర్మాతలు కూడా ఈ అమ్మడినే హీరోయిన్ గా ఎంపిక చేస్తున్నారు. చేతినిండ అరడజనుకు పైగా సినిమాలున్నాయి.
శ్రీలీలను జూనియర్ ఎందుకు వద్దన్నాడు? Sri Leela
టాలీవుడ్ లక్కీ హీరోయిన్ శ్రీలీలను ఎన్టీఆర్ తన సినిమాలో నటించవద్దన్నాడా? అన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దేవర సినిమాలో సెకండ్ హీరోయిన్ గా శ్రీలీలను చూజ్ చేసుకున్నాడట కొరటాల శివ. అయితే ఎన్టీఆర్ మాత్రం శ్రీలీల వద్దు అంటూ తెగేసి చెప్పేసాడట. అలా ఎన్టీఆర్ చెప్పటంతో ఫ్యాన్స్ మదిలో అనేక ప్రశ్నలు తలెత్తాయి. చివరకు ఫ్యాన్స్ వారికి వారే ప్రశ్నలకు జవాబును కూడా వారే కామెంట్స్ లో వ్యక్త పరుస్తున్నారు. శ్రీలీల తన బిజీ షెడ్యూల్స్ కి మన సినిమా షూటింక్ టైమింగ్స్ కుదరవని అలా చెప్పి ఉండవచ్చు అని కొందరు కామెంట్స్ పెడుతున్నారు. దేవర సినిమాలో సెకండ్ హీరోయిన్ పాత్రకు శ్రీలీల సెట్ అవ్వదమో అని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు. ఎన్టీఆర్ తన సినిమాలో శ్రీ లీలను రిజెక్ట్ చేసిన వార్త సోషల్ మీడియాలో హట్ టాపిక్ గా మారింది.
ఆదికేశవ ప్రమోషనల్ ఈవెంట్ లో శ్రీలీల బాగం కానుందా?
ఆదికేశవ సినిమాలో పంజా వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా నటించారు. ఈ సినిమా నవంబర్ 24వ తేదిన థియేటర్ లో సందడి చేయడానికి రెడీగా ఉంది. విడుదల దగ్గర పడుతున్న తరుణంలో చిత్రం బృందం అంతా ప్రమోషనలో బిజీగా ఉండాలి. దర్శక నిర్మాతలు కూడా అదే పనిలో ఉన్నారు. మూవీ బృందం అంతా శ్రీలీలను ప్రతి ప్రమోషన్ ఈవెంట్ కు తీసుకురావడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అది వర్కవుట్ అవ్వటం లేదట. అరడజను సినిమాలతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మను పట్టుకోవడం కష్టంగా మారిందంటున్నారు దర్శక నిర్మాతలు. చివరకు మరి ప్రమోషన్లలో భాగం కానుందో లేదో చూడాలి.
ఇంటర్వ్యూలు కూడా క్యాన్సిల్.. Sri Leela
ఆదికేశవ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా వైష్ణవ్ , శ్రీలీలను కొన్ని మీడియా సంస్థలు ఇంటర్వ్యూలు చేయాల్సి ఉంది. చివరకు బిజీగా ఉన్న శ్రీలీల ఇంటర్వ్యూలకు కూడా హాజరుకాలేకపోయింది. మూవీ షూటింగ్ లో బిజీగా ఉండటంతో చివరి నిమిషంలో ఆ ఇంటర్య్వూలను రద్దు చేశారట. అటు ప్రమోషనల్ ఈవెంట్ కి ఇటు ఇంటర్వ్యూలు రెండింటికీ హజరు కాలేకపోతుందట శ్రీలీల.
ఆదికేశవ ప్రమోషన్ మిస్సింగేనా?
ప్రస్తుతం శ్రీలీల గుంటూరు కారం, ఎక్స్ ట్రా ఆర్డినరీ మూవీ షూటింగ్ లలో బిజీగా ఉంది. ఉదయం గుంటూరు కారం షూట్ లో, సాయంత్రం ఎక్స్ ట్రా ఆర్డినరీ మూవీ షూట్ లో ప్యాచ్ వర్క్, పాటలలో పాల్గొంటుందట. ఇలా బిజీగా ఉన్నందుకే ఆదికేశవ ప్రమోషన్ లకు. ఇంటర్వ్యూలకు దూరంగా వున్నట్లు తెలుస్తోంది.