Cumin Seeds
జీలకర్ర.. దీని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే వంటల్లో ఖచ్చితంగా వాడేదే కాబట్టి. ఇది కేవలం రుచికే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. జీలకర్రను రోజు మనం చేసుకునే ఆహారాల్లో వాడుతూనే ఉంటాం. కానీ అది ఏన్ని విధాలుగా మన శరీరానికి మంచి చేస్తుందో ఎవరికీ తెలియదు. ఇందులో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ ఔషద గుణాలు చలికాలంలోనే కాదు..ఏ కాలంలోనైనా అనేక వ్యాధుల నుంచి కాపాడతాయి. అందుకే ఆయుర్వేద వైద్యులు జీలకర్రని తరుచూ తీసుకోవాలని సూచిస్తున్నారు.
పుష్కలంగా ఉన్న పోషకవిలువలు.. Cumin Seeds
కాల్షియం, ఐరన్, ఫాస్పరస్, మెగ్నీషియం, మాంగనీస్, సోడియం, పొటాషియం, విటమిన్ ఎ, బి, సి, యాంటీఆక్సిడెంట్స్ వంటివి పుష్కలంగా ఉంటాయి. దీనిలో విటమిన్ ‘బి’ మన శరీరానికి కావలసిన ఎనర్జీని అందిస్తుంది. మరియు మానసిక ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. ఇందులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది గుండెకు ఆక్సిజెన్ సరఫరా చేయడానికి తోడ్పడుతుంది. జీలకర్రని ఎక్కువగా తీసుకోవడం వల్ల చర్మం కాంతివంతంగా ఉండేందుకు మంచిగా సహయపడుతుంది.ఎందుకంటే దీనిలోని విటమిన్ ‘ఇ’ హర్మోన్స్ సరిగా పనిచేయడానికి మరియు చర్మంపై ఉన్న గాయాలను నయం చేయడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే మెగ్నీషియం శరీర విశ్రాంతికి తోడ్పడుతుంది.
జీలకర్రతో ఇన్ని ప్రయోజనాలా..
బరువు తగ్గడానికి జీలకర్ర ఎంతగానో ఉపయోగపడుతుంది. షూగర్ వ్యాధితో భాధపడే వారికి కూడా దీనిని అదుపులో పెట్టుకునేందుకు బాగా సహాయపడుతుంది. మానసిక ఒత్తిడిని దూరం చేస్తుంది. చర్మ వ్యాధులను నివారించడంలో కూడా ఎంతో ఉపయోగపడుతుంది. చర్మం కాంతివంతంగా ఆరోగ్యంగా ఉంచడానికి మరియు మొటిమలు తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. క్యాన్సర్ వ్యాధులతో భాదపడే వారికి జీలకర్ర చాలా మంచిది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్స్ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచకోవడానికి చాలా ఉపయోగపడతాయి. పైల్స్ వంటి సమస్యలతో భాధ పడేవారు జీలకర్ర ఎంతో మేలు చేస్తుంది. ఆస్తమా వంటి సమస్యలు ఉన్నవారికి దీనిని తీసుకోవడం వల్ల కోంత వరకు ఉపశమనం లభిస్తుంది. అధిక రక్తపోటు వంటి సమస్యలు ఉన్నవారికి జీర చాలా బాగా పనిచేస్తుంది. ఇది రక్తపోటును నియంత్రిణలో పెట్టడానికి ఉపయోగపడుతుంది. Cumin Seeds
దీనిలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ మన శరీరంలో ఉన్న చెత్తను బయటకి పంపడానికి ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనిని ముఖ్యంగా జీర్ణ వ్యవస్ధకు సంబంధించిన వారికి ఎక్కువగా వాడుతూ ఉంటారు. జీలకర్ర జీర్ణాశయాన్ని శుభ్రం చేస్తుంది. దీంతో మలబద్ధకం, గ్యాస్, అసిడిటీ, అజీర్తి ఇలాంటి సమస్యలన్నీ దూరం అవుతాయి. పొట్ట ఉబ్బరం, వికారం, వాంతులు, తిన్న ఆహరం జీర్ణం కానపుడు జీలకర్ర ఉపశమనాన్ని ఇస్తుంది. ముఖ్యంగా కిడ్నీలో రాళ్ల వంటి సమస్యలు దూరం అవుతాయి. కిడ్నీల్లో చేరిన వ్యర్థాలను తొలగించడంలో ఇది అమోఘంగా పనిచేస్తుంది.
నీళ్లల్లో కలిపి తీసుకుంటే మరిన్ని ఉపయోగాలు.. Cumin Seeds
జీలకర్రని నేరుగా తీసుకోవడం కంటే నీళ్లల్లో కలిపి తీసుకుంటే మరిన్ని ప్రయోజనాలు కలుగుతాయంటున్నారు ఆరోగ్యనిపుణులు. నేటికాలంలో బీజీ బీజీ షెడ్యూల్లో ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవడం తగ్గిపోతోంది. ప్రతిరోజు నీటిలో జీలకర్ర వేసి బాగా మరిగించి ఆ నీటిని పరగడుపున తాగితే ఆరోగ్యనికి మంచిదని చెబుతున్నారు నిపుణులు. పరగడుపున టీ, కాఫీ లకు బదులుగా జీరా వాటర్ ని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యనికి ఎంతో మేలు చేస్తుంది. అంతేకాదు అనేక సమస్యలను కూడా దూరం చేయడంలో సహయపడుతుంది. Cumin Seeds